ఏంట్రా బుజ్జా 2019 అప్పుడే అయిపోతోంది ఈ సంక్రాంతి కే గా బాలయ్య NTR లా మారిపోయింది . Honey is the best ఇంకా చెవుల్లో మారుమోగుతోంది.. రామ నరికిన తలలని ఇంకా గ్రద్దలు వెతుకుతూనే ఉన్నాయి. పేట, రాముడు వాలి కథని జిత్తు కి చెప్పాడు. నిక్కీ కోసం విక్కీ "కోపంగా కోపంగా" పాటేస్కున్నాడు.. అప్పుడే 2019 ఎలా అయిపోతోంది రా బుజ్జా..
నేను విన్నాను, నేను ఉన్నాను అని రాజన్న మాటివ్వడం, 118 రూమ్ లో గౌతమ్ కలలోకి ఆధ్య రావడం, జెస్సీ అనే దెయ్యం మనల్ని భయపెట్టడం ఇవన్నీ come and go లా తెలుస్తున్నాయి అంతే, అప్పుడే 2019 అయిపోతోంది ఏంట్రా బుజ్జా...
పూర్ణ జీవితం లోకి శ్రావణి రావడం. ఎన్నో అపజయాల తరువాత విజయ్ విజయం సాధించడం కొడుకు కోరిన చిన్న కోరిక తీర్చడానికి అర్జున్ చావుని కూడా ఎదిరించడం I am iron man అని tony stark చిటిక వెయ్యడం. ఇవన్నీ ఇంకా కొత్తగానే ఉన్నాయి.. అప్పుడే 2019 ఎలా అయిపోతోందిరా బుజ్జా..
స్నేహితుడి కోసం రిషి చేసిన ప్రయాణాలు. ఇద్దరు NRI లు హైదరాబాద్ బస్తీలలో దిద్దిన ABCD లు ఆస్తి కోసం సీత దాటినా గీతలు 'ఫలక్నుమా లో కనిపీరా నువ్వు' అని దాస్ ఇచ్చిన warninglu ఇవన్నీ మొన్న వేసవి లోనే గా జరిగాయి అప్పుడే 2019 అయిపోతోంది.. ఎలా రా బుజ్జా
స్వప్న తనకు దొరికిన 3 chances తో తన లైఫ్ game over కాకుండా కాపాడుకోవడం.. ఆత్రేయ వసుధ తో సెల్ఫీ దిగడం మల్లేశం ఎన్నో ప్రయత్నాల తరువాత ఆశు యంత్రం కనుగొనడం మిత్ర ని కిడ్నాప్ చేసాం అని రాధాకృష్ణ కి రాహుల్ ఫోన్ చేయడం.. శేఖర్ బాబు ఎవరు చంపారు దేవదత్త కొల్లాపూర్ అంతా తిరగడం. ఇవన్నీ మొన్నే జరిగాయి అనిపిస్తోంది రా బుజ్జా .. అప్పుడే 2019 అయిపోతోంది ఏంటో...
60 ఏళ్ల బేబీ బామ్మా, 25 ఏళ్ల బేబీ భామ లా అవతరించడం. రిషికి అద్దం లో దెయ్యం కనిపించడం రెండు మెదళ్లతో శంకర్ ధిమాఖ్ ఖరాబ్ అవ్వడం లిల్లి కోసం బాబీ కాకినాడ నుండి హైదరాబాద్ యాక్టీవా మీద షర్ట్ లేకుండా వెళ్లడం ఇవంతా జరిగి వారం కూడా అయినట్టు లేదు కదరా బుజ్జా 2019 అప్పుడే ఎలా అయిపోతోంది అంటావ్..
Christopher case ని అరుణ్, సమీరా case ని విక్రమ్ వాసుదేవ్ సాల్వ్ చేస్తున్నారు.. మన్మధుడు ఇంకోసారి విచ్చేశాడు.. ఆండ్రాయిడ్ చెప్పిన 3 నిమిషాల డైలాగ్ ఇంకా ఎవరు break చేయలేదు.. దేవా తన జీవితాన్ని రణరంగంగా మార్చుకున్నాడు. నాన్న కోసం కౌసల్య క్రికెటర్ అయ్యింది.. తన రాజ్యం కోసం సాహు సేనాధిపతి లా మారాడు.. అంతలోనే అయిపోయింది 2019 ఎలా రా బుజ్జా how?
కృష్ణుడిలా మారి పెన్సిల్ ప్రతీకార రచన చేసాడు. రాక్షసుడులాంటి లాంటి గద్దలకొండ గణేష్ హీరో అయిపోయాడు.. ఎవరికీ చెప్పొద్దు మీకు మాత్రమే చెప్తా అని రహస్యాలు ఒక చెవి నుండి ఇంకో చెవికి మారుతూనే ఉన్నాయి. నరసింహ రెడ్డి రేనాటి సూర్యుడులా వెలుగుతున్నాడు.. కప్పు ముఖ్యమని బిగిల్ కి రాయప్పన్ చెప్తూనే ఉన్నాడు. ఢిల్లీ కోసం తన కూతురు ఎదురుచూస్తూనే ఉంది. కానీ అప్పుడే 2019 అయిపోతోంది ఎలానో మరి బుజ్జా...
తెనాలి ఇంకా కోర్టు లో వాదిస్తూనే ఉన్నాడు. Jeena hai toh marna seekho అని george reddy నినదిస్తూనే ఉన్నాడు.. అర్జున్ సురవరం రిపోర్టింగ్ ఇంకా అవ్వనే లేదు. రాజు తన ప్రేమ ని రాణి కి ఇంకా చెప్పనే లేదు. చూసావా బుజ్జా అప్పుడే అయిపోతోంది 2019
అల్లుడు కోసం వెంకీ మామ కాశ్మీర్ కి వెళ్లడం తాతయ్య కోసం మనవడు అమెరికా నుండి రావడం. UP లో తెలుగువాళ్ళకు బాలయ్య రూలర్ అవ్వడం. మహి వర్ష లా లోకం ఒక్కటవ్వడం. Yes U తస్కరించడం. అంత జరిగి జస్ట్ one monthu కాలేదు 2019 అయిపోతోంది రా బుజ్జా
అయిపొయింది దాన్ని గురించి తలుచుకోవడం ఎందుకులే కానీ, కొత్త సంవత్సరం వస్తోంది కొత్త సినిమాలు తెస్తోంది అవి చూడటానికి బడ్జెట్ సెట్ చేసుకుందాం లేరా బుజ్జా..