Here Is Why Our Favorite Avakaay Is Probably The Best Thing In The World!

Updated on
Here Is Why Our Favorite Avakaay Is Probably The Best Thing In The World!

Whatsapp Forward

ఆవకాయ 'నవగ్రహ' స్వరూపం. ఆవకాయ లో ఎరుపు ---- "రవి". ఆవకాయలో వేడి, తీక్షణత ---- "కుజుడు". ఆవకాయలో వేసే నూనె, ఉప్పు ---- "శని". ఆవకాయలో వేసే పసుపు, మెంతులు ---- "గురువు". మామిడిలో ఆకుపచ్చ ---- "బుధుడు". మామిడిలో పులుపు ---- "శుక్రుడు". ఆవకాయ తినగానే కలిగే అలౌకికానందం ---- "కేతువు". తిన్న కొద్దీ తినాలనే ఆశ ---- "రాహువు". ఆవకాయ కలుపుకునే అన్నం ---- "చంద్రుడు". ఇలాంటి ఆవకాయ కంచంలో ఆగ్నేయ మూల వేసుకుని నవగ్రహ స్తోత్రం చెప్పుకొని, తింటే, సమస్త గ్రహ దోషాలు ఔట్. హాం ఫట్.

శ్రేష్టంబిది పచ్చళ్ళన, టేష్టున ఇది మొదట నుండు డెఫినెట్ గానూ, ఇష్టముగ ఆవకాయను సుష్టుగ తిని దొర్లినంత సుఖమది కలదే!

ఊరిన ముక్కను కొరకగ, ఔరా! అది ఎంత రుచిని అందించునయా, కూరిమితో నాల్గు ముక్కలు నోరారా తినని నోరు నోరవ్వదుపో!

బెల్లము వేసిన మధురము, పల్లీనూనెను కలపగ పచ్చడి మధురం, వెల్లుల్లి వేయ మధురము, పుల్లని మామిడితో చేయ ముక్కది మధురం!!

ఈ ఆవకాయలోని ముక్కకి చాలా పేర్లు ఉన్నాయి:

చెక్కందురు, డిప్పందురు, ముక్కందురు కొంతమంది మురిపెము తోడన్. డొక్కందురు, మామిడిది పిక్కందురు దీనికన్ని పేర్లున్నవయా!

ఆవకాయ ఉపయోగాలు: ఉదయమే బ్రెడ్డున జాముకు బదులుగ ఇది వాడిచూడు, బ్రహ్మాండములే, అదియేమి మహిమో తెలియదు, పదునుగ నీ బుర్ర అప్పుడు పనిచేయునయా!

ఇందువల దందు బాగని సందేహము వలదు; ఊట సర్వ రుచిహారం బెందెందు కలిపిచూసిన, అందందే రుచిగనుండు, అద్భుత రీతిన్!

ఆవకాయ అవతరణ: “చప్పటి దుంపలు తినుచును, తిప్పలు పడుచుంటిమయ్య, దేవా, దయతో గొప్పగు మార్గం బొక్కటి చెప్పుము మా నాల్కలొక్క చింతలు తీర్పన్”

ముక్కోటి దేవులందరు మ్రొక్కగ తా జిహ్వలేప సృష్టించెనయా చక్కనిది ఆవకాయన ముక్క తినని వాడు కొండముచ్చై పుట్టున్!!

చారెరుగనివాడును, గో దారిన తా నొక్కమారు తడవని వాడున్, కూరిమిన ఆవకాయను ఆరారగ తిననివాడు, తెలుగువాడు కాడోయ్!

Dedicated to All Aavakaya Lovers!