పచ్చని పొలాలు ,పారే సెలయేళ్ళు ,మువ్వలు సవల్లు,మెట్టల సందడ్లు బాపుగారి బొమ్మలా నిండైనది, పసందైనది ఈ అచ్చ తెలుగు ఆవకాయ.
ఏవండోయ్ !! ప్రక్కన కూర్చుంది కదా అదే మా ముసిల్ది.. ఊర్లో అందరు ఏదో సాధిద్దాం అని అమెరికాలు ఆస్ట్రేలియాలు పోయారు. సద్దికూడు నుంచి సాండ్విచ్ ల దాక ఎదిగింది మా ఊరు. కాని ఎన్ని దేశాలు వెళ్ళిన, ఎన్ని రుచులు చూసిన, మన బామ్మా చేతి ఆవకాయ వాసన చూస్తే, అబ్బా!! నోరు ఊరిపోతుంది.
ఇదిగోండి మా ముసలి సైన్యం తయారు అయింది మన ఆవకాయి సిద్దం చేయటానికి.
మన కళ్ళు ఎన్ని అందాలను చూసిన, పచ్చతనం చూసినప్పుడు వచ్చే ప్రశాంతతే వేరు .అంత ప్రశాంతమయిన పచ్చని , పుల్లని మామిడి కాయలను కోసి వాటికి నిష్కల్మషం లేని రంగు తెలుపు. అటువంటి తెల్లని ఉప్పు రాసి ఎండలో ఎండబెట్టి కాపు కాస్తున్నారు మన ముసలి సైన్యం. ఇంతలో బుజ్జిగాడు వచ్చి మామ్మ ఒళ్లో కుర్చోని ఎక్కడ లేని వయ్యారాలు పోతున్నాడు. చటుక్కున ముక్క తీసి లటుక్కున నోట్లో వేసుకున్నాడు.
“ఓరి బడవా! అన్ని నీ తాత పోలికలే ” అని బామ్మలందరూ నవ్వుతున్నారు .
పల్లెటూరు పచ్చదనం ,మరదలిపిల్ల పెంకితనం అవి రెండు వర్ణించలేనివి . మంచుకొండలలో నుంచి వస్తున్న గంగలా వంపులు తిరిగే ఆ సోయగాలు ,ఓని చాటున దాగుడుమూతలు ఆడే ఆ నడుము ; పట్టణాల్లో అబాగ్యులు ఎన్ని మిస్ అయిపోతున్నారో .వారి సున్నితమయిన చేతిలలో రోకలి పట్టి ఆవాలు దంచుతున్నారు .
మా ముసల్ది ఒక గిన్నె తెచ్చి అందులో ఆ ఆవాలు పిండి వేసింది . వేసవి కాలంలో సూర్యుని లా మండే ఎర్రని కరం ,రాత్రి వేల చంద్రునిలా మెరిసిపోతున్న తెల్లని ఆ గిన్నెలో వేసి కలిపింది .ఇప్పుడు ఒక జాడి తీసుకుని అందులో నూనె పోసింది . కొంత నూనెని మామిడి ముక్కలకు రాసి అన్నిటిని కలిపింది .
చేతికి ఉన్న ఆ పచ్చడి సద్దన్నంలో కలిపి కొంచెం నెయ్యి వేసింది . ముసలి చేతి గోరుముద్దల కోసం ఇంట్లోవాల్లందరూ పోటిపడ్డారు . ఆ వాసనకే నా నోరు చుట్టూ నీరు నయగారా జలపాతంలా పారాయి . ఆ ముద్దలోని ప్రేమ , ఆప్యాయత ,అనుబంధం కళ్ళల్లో నీరులా మారాయి .
మన తిరంగ జండాల ఎర్రని కారం ,తెల్లని ఉప్పు ,పచ్చని మామిడి ,నూనె వల్ల అన్ని కలిసిపోయి ఒక అందమైన ఆవకాయ అయ్యింది .
హిందూ ,క్రైస్తము ,ఇస్లాం మతం ఏదైనా భారతీయత అనే బంధంతో అందరం కలిసి ఉందాం.