మునపటి కంటే ప్రస్తుతమే కల్తి రాజ్యమేలుతుంది.. నకిలి బియ్యం, నకిలి పూలు, నకిలి ఆహారం, ఆఖరికి నకిలీ మనుషులు కూడా.. ఏదైనా తొందరగా కావాలి అది డబ్బైనా, పేరైనా అందుకే ఈ వేగం కోసం మోసాలు పెరిగిపోతున్నాయి.. ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ ఒక కొత్త శక్తితో కొత్త వస్తువు సృష్టించబడుతుంది. అలా బిజినెస్ అనేది సెకండరి ప్రజలకు నాణ్యమైన ఎగ్స్ అందించాలనే బలమైన ఉద్దేశ్యంతోనే ఆయుర్ ఎగ్స్ ను చంద్రారెడ్డి గారు అమ్ముతున్నారు. ఏ కెమికల్స్, స్టెరాయిడ్స్, చివరికి వాటికి పెట్టే ఆహారం కూడా పెస్టిసైడ్స్ వాడని పంటనే ఇస్తున్నారు.
పౌల్ట్రీ రంగంలో చంద్రారెడ్డి గారు 1993నుండి ఉన్నారు. ప్రజలకు అడిగిన ఫుడ్ ఇవ్వడం వరకే ఉంటే ఎక్కువ రోజులు పోటిని తట్టుకోలేము.. వినియోగదారులు అడిగిన దానికన్నా వారి ఊహకుమించిన నాణ్యత, సర్వీస్ ఇస్తే తప్పా సుధీర్ఘ కాలం బిజినెస్ రంగంలో మనగలలేము. 1993 నుండి 2010 వరకు ఒకే రకమైన విధానాలు అవలంబించిన తర్వాత 2010 నుండి ఆయుర్ ఎగ్స్, ఆయుర్ చికెన్ మీద పూర్తిగా దృష్టి పెట్టారు. అప్పటికే ముంబాయ్ లో ఈ తరహా పౌల్ట్రీ ఫామ్ రన్ చేస్తున్నారని తెలిసి ఈ విధానం ద్వారా మన తెలుగువారికి ఎగ్స్ అందించాలని ఇందులో సంవత్సరాల తరబడి విపరీతమైన పరిశోధన చేశారు.
ఎలాంటి ఆహారం? : దాదాపు అన్ని పౌల్ట్రీ ఫామ్ లో కోడి త్వరగా ఎదగాలని చెప్పి ప్రజల ఆరోగ్యాన్ని విస్మరించి స్టెరాయిడ్స్ ఇస్తున్నారు, వాటికి నాన్ వెజ్ కూడా ఇస్తూ కోడి ఆరోగ్యం, వాటిని తిన్నవారు ఎలా ఉంటే ఏంటి అన్న తరహాలో చాలా పౌల్ట్రీ ఫామ్స్ ఈ విధానాన్నే దర్జాగా అమలుచేస్తున్నారు. కాని చంద్రారెడ్డి గారు, అతని కుటుంబ సభ్యులు మాత్రం కోడికి మంచి న్యూట్రీషనల్ ఫుడ్ అందిస్తున్నారు. ప్రతి రోజు ఆర్గానిక్ ఫుడ్ తో పాటు కోడికి ఉసిరి, పసుపు, వెల్లుల్లి, అల్లం లాంటివి కూడా ఆహారంగా ఇస్తున్నారు. మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని కోడికి ఇస్తుండడంతో మిగిలిన పౌల్ట్రీలో ఉన్న కోళ్ళ కన్నా ఇవ్వే ఆరోగ్యంగా ఉంటున్నాయి.
2009 వరకు లక్ష కోళ్ళతో ఉన్న వీరి పౌల్ట్రీ ఫామ్ ఆ తర్వాత ఆయుర్వేదిక్ ఎగ్స్ కోసం 25,000 కోళ్ళకు తగ్గించి నడిపించారు.. ఆ తర్వాత సరైన మార్కెటింగ్ స్ట్రాటజితో 45,000 వేలకు పెంచారు. ఇప్పుడు ఈ ఆయుర్ ఎగ్స్ హైదరాబాద్, రాజమండ్రి, విశాఖపట్నం లాంటి నగరాలకు చేరుకుంటున్నాయి. Omega 3 DHA Choline, Selenium, Carotenoids, Vitamin D, E, Iron లాంటి విటమిన్స్, పోషక పదార్ధాలు ఈ గుడ్డులో లభిస్తుండడం, ఇంకా ఒక్కసారి దీని రుచి చుశాక మరే ఇతర ఎగ్స్ కోసం తినలేము అన్నంతగా దీని రుచి ఉండడంతో పదిరూపాయల ధరతో ఒక ఎగ్ ఇస్తున్నా గాని దీనినే తీసుకుంటున్నారు. అమ్మ గర్భంతో ఉన్నప్పుడు అమ్మ తీసుకునే ఆహారాన్ని బట్టే ఆ పుట్టబోయే బిడ్డ ఆరోగ్య పరిస్థితి ఉంటుంది, అలా కోడి బాగుంటేనే గుడ్డు బాగుంటుంది. ఇదే పద్దతితో అటు ప్రజలకు మంచి ఎగ్స్ సరఫరా చేస్తూనే ఇటు బిజినెస్ లోనూ దూసుకుపోతున్నారు.