This Engineer's Questions About His Future After B.Tech Are Something That You Can Surely Relate To!

Updated on
This Engineer's Questions About His Future After B.Tech Are Something That You Can Surely Relate To!

Contributed By V.Siva Rama Teja

Actual గా ఈ article frustration వచ్చి రాస్తున్నది కాదు. Frank గా చెప్పాలంటే మన దేశం లో btech చదివిన వాళ్ళు అసలు చివరికి ఎం అవుతున్నారు? నాకు ఇదే ప్రశ్న ఎప్పట్నుంచో మనసులో తొలిచేస్తోంది . ok ., విషయానికి వెళదాం.

ఇంటర్మీడియట్ లో దిక్కుమాలిన బట్టీ పద్దతి అయ్యాక ఎదో రాయాలని EAMCET రాస్తాం. మనం పుట్టినప్పుడు తర్వాత మన పేరెంట్స్ సంతోషించేది ఎంసెట్ ర్యాంక్ తోనే . సరే ఏదో ఒక ర్యాంక్ వచ్చింది. నేను లోకల్ సినిమా లాగా ,btech లో join అవ్వకుండానే next ఏ college అని చుట్టాల దగ్గర్నుంచి పొద్దున్న పాలు తీసుకోచ్చే వాడి దాకా అందరూ అడిగేయడమే. అసలు ఎందుకు inter చదివామో తెలీదు . పోనీ btech ఐనా ఎందుకు చేస్తున్నామో మనకే clarity లేదు . సరే పోనీ ఎదో ఒక గొప్ప కాలేజీ లో seat వచ్చిందని సంతోష పడదాం అంటే, మన చదువుకి ఏ ఐఐటీ ఢిల్లీ అంత సీన్ లేదు.

1st ఇయర్....... కాలేజీ... పుట్టిన రోజు నాడు వేసుకొనే కొత్త బట్టలు ఎంత సువాసన వస్తాయో అంత ఫ్రెష్ గా ఉంటుంది . ఐనా నా లాంటి ఫ్రెషర్ కి ఫ్రెష్ గ కాకపోతే కుళ్లిపోయింది గా ఎలా ఉంటుందిలే ! రాగ్గింగ్ , కొత్త సబ్జక్ట్స్ , కొత్త అమ్మాయిలు , కొత్త ఫ్రెండ్సూ , కొత్త పరిచయాలు స్టార్ట్ అవుతాయ్ . జీవితం అనే సముద్రం లో ఇంజనీరింగ్ అనే పడవ మీద బ్యాలన్స్ చేస్తూ ఒడ్డు కి చేరుదాం అనుకుంటారు . కానీ అక్కడే Engineering Mechanics సబ్జెక్టు లో కాలు ,చెయ్యి అన్నీ వేసారు . కాలేజీ starting లో ఎంతో గొప్పలు చెప్తారు. అక్కడికి వెళ్తే తూతూ మంత్రం మాత్రమే . Lecturers చెప్పేవి అర్థంకావు. పోనీ మంచి lecturer చెప్పేవి ఐనా అర్ధమవుతాయా అంటే మనం ఇంటర్ లో బట్టీ కాబట్టి, ఇక్కడ కూడా అదే ఫాలో అయిపోతే ఒకటి రెండు units cover చేసేయచ్చు లే అనుకుంటాం. ఇంటి దగ్గర మన పేరెంట్స్ ఏమో బయట ఎవరైనా అడిగితే మా వాడు ఆహ్ కాలేజీ లో ఇంజనీరింగ్ చేస్తున్నాడు అని చాలా గర్వం గ చెప్తారు . కానీ ఇక్కడ మనకి ఛీ దీనమ్మ జీవితం. ఎందుకయ్యా ఈ బతుకు అనిపిస్తది . ఆలా చూస్తుండగానే 2nd , పడుకొని లేచే లోపే 3rd years అయిపోతాయి . ఇంక మన జీవితం లో ఏం సాధించినట్టు ? మనిషి బ్రతికేదే చాలా తక్కువ ఏళ్ళు . అలాంటిది మనం 3ఇయర్స్ వేస్ట్ చేస్సామ్ . సారీ ....వేస్ట్ చేయించేసారు.

మనం స్కూల్ లో తోపు కావచ్చు , ఇంటర్ లో తోపు కావచ్చు , కానీ btech లో join అయ్యిన ప్రతీ ఒక్కడూ తోపే. ఏదోకటి సాధించాలి అనే మంచి ఉద్దేశం తోనే అందరూ btech జాయిన్ అవుతారు , కానీ చివరికి successful అయ్యేది మాత్రం వేళ్ళ మీద చెప్పచు . అసలు ఈ లోపం కాలేజీ లో ఉందా లేదా మనలో ఉందా ? ప్రశ్నించుకోవాలి ! ఇంకా ఎన్నాళ్ళు మన భారత దేశాన్ని developing , developing , still developing country గా చదువుకుంటాం ? మారాలి సామి . కొన్ని లక్షల మంది btech వాళ్ళు బయటికి వస్తున్నారు . వీళ్ళందరూ omegle chat లో video chat చేస్తూ కూర్చుంటే దీనమ్మ మనం ఇంక మారం...... జీవితం అంటే ఏంటి ? enjoy చెయ్యడమా , college bunk కొట్టి cinema కి పొడమా , అమ్మాయిలకి సైట్ ఎయ్యడమా ,,,,, అవన్నీ ఉన్నా పర్లేదు సామి ....కానీ అన్నిటి కన్నా ముందు మన దేశం బాగుండాలి . మొన్న కాక మొన్న sweeper posts కి 75% ఇంజినీర్లు apply చేసారంటే ..... వాడమ్మ వాడు btech లో inka ఏం పీకినట్టు ? Singapore నుంచి సివిల్ ఇంజినీర్లని తెచ్చుకోవాల్సిన పరిస్థితి . మన దేశం లో ఉన్న సివిల్ ఇంజినీర్లు పనికిరారు అనేదే కదా అందులో ఉద్దేశం!

ఒక మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వాడు TCS లో చేయడమేంటి భయ్యా . ఎక్కడికి పోతున్నాం మనం ? మనం అంత కష్టపడి నేర్చుకుని పాస్ అయ్యిన Engieering Drawing subject వేస్ట్ ఏ కదా ఇంక . India లో ఇస్రో వాళ్ళు 104 satellites పంపారనో లేదా బయట దేశాల్లో ఉన్న మన భారతీయులు CEOస్ అనో గర్వపడకూడదు . మన వల్ల కనీసం మన జిల్లా కి ఐనా గుర్తింపు వచ్చిందా ? పోనీ జిల్లా వరకు ఎందుకు ? కనీసం మన వీధికి ఐనా మన ఉపయోగం ఉందా ? ఇంకెందుకు మనం బ్రతికి ! ఎవ్వడిని ఉద్దరించడానికి 20 సంవత్సరాలు బ్యాగ్లు , భారాలు మోసి చదివాం ? ఎం సాధించడానికి చేసాం . Mechanical , Civil Engieering చదివి , ఆ knowledge తో software job చేస్తే ఎంత కామెడీ గ ఉంటుంది ? పోనీ ప్రతిసారి maa tv channel లో రఘువరన్ సినిమా ని చూసైనా నేర్చుకోవాలి భయ్యా.

Frank గా మాట్లాడుకుందాం . ఎంత మంది engineers కి మన దేశం లో పద్మశ్రీ వచ్చింది ? ఎవరో ఒక చదువు రాని అతనికి poems రాసినందుకు పద్మశ్రీ , ఒక అతనికి చెట్లు నాటినందుకు పద్మశ్రీ ....ఇలా ఇచ్చారు . అది మంచి విషయమే .....కానీ మనం(Engineers ) ఎందుకు లేము ? 20 ఏళ్ళు పడ్డా కష్టం evaporate అయిపోయిందా ? లేదా మనకి తగిన గుర్తింపు లేదా ? సవా లక్ష reasons ఉండచ్చు మన దగ్గర . కానీ గుండెల మీద చెయ్యి వేసుకుని ఆలోచిద్దాం . మనం ఏం చేశామని పద్మశ్రీ ఇవ్వాలి ? ఒక SRI DHARAN గారికి భారతరత్న తప్ప అన్ని పద్మ అవార్డ్స్ వచ్చాయి . ఎందుకు ? అతను రామేశ్వరం లో 3kms సముద్రం మధ్యనుంచి బ్రిడ్జి వేసారు . ఎన్నో మెట్రో ప్రాజెక్ట్స్ చేపట్టారు . అతను మన కాకినాడ లో BTech చదువుకున్న వాడే కదా!

నేను చెప్పదలచు కున్నది ఏమి లేదు భయ్యా . అత్తారింటికి దారేది సినిమా లో పోసాని గారు చెప్పినట్టు ..... ఒక్కసారి పడుకునే ముందు గుండెల మీద చెయ్యి వేసి ఆలోచించుకుందాం . మన వల్ల దేశానికి ఉపయోగం ఏంటి అని. మనం మనకి ఇష్టమైన జాబ్ చేస్తున్నామా , core subjects related jobs చేస్తున్నామా ? లేదా ఎదో గొప్ప కోసం డబ్బులు కోసం దిక్కుమాలిన జాబ్స్ చేస్తున్నామా ? అవకాశం ఎవ్వడూ ఇవ్వడు భయ్యా ...... మనమే కలిపించుకోవాలి .

" If opportunity does not knock, Build a door!"