Here's All You Need To Know About Bandarulanka Sarees That Are Known For Their Brilliant Quality!

Updated on
Here's All You Need To Know About Bandarulanka Sarees That Are Known For Their Brilliant Quality!

"ఈ భూమి భగవంతుని శరీరమైతే ఆత్మ భారతదేశం" అని ఓ గొప్ప స్వామిజి అంటారు. భారతదేశం మిగిలిన దేశాల కంటే పవిత్రంగా కనిపించడానికి మన సంస్కృతి సాంప్రదాయాలు, జీవిన విధానాలే కారణం. బికిని వేసుకున్న అమ్మాయిని చూడడానికి ఇష్టపడతామేమో కాని చక్కగా సంప్రదాయంగా చీరకట్టుకున్న మహిళనే జీవిత భాగస్వామిగా చేసుకోవడానికి ఇష్టపడుతుంటాం. మన దేశ మహిళలు ఎంతో శక్తివంతులు వారి అందాన్ని, శక్తిని మరింత ఉన్నతంగా చీర పెంచుతుంది. అలా మన సంస్కృతిలో భాగమైన చీరలను మరింత అందంగా, నాణ్యతగా బండారులంక ఊరి ప్రజలు నేస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో బండారులంక ఓ అందమైన గ్రామం. బండారులంక ఎన్నో దశబ్ధాల నుండి చేనేతకు ప్రసిద్ధి. తెలుగురాష్ట్రాల వరకు మాత్రమే కాదు భారతదేశమంతటా కూడా ఎంతో పేరు సంపాదించింది. ఇక్కడ 16 సంవత్సరాల నుండి 60సంవత్సరాలు పైబడిన వ్యక్తులు ఈ పరిశ్రమలో భాగమయ్యారు. బండారులంకలో ఉన్న చేనేతలు సుమారు 3,000 కుటుంబాల నుండి 11,000కు పైగా ఇక్కడ నివసించే ప్రజలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉపాధిని ఆర్జిస్తున్నారు.

ఒక ఊరిలో పెద్ద పారిశ్రామిక పరిశ్రమ ఉండడం కన్నా ఇలా ఎవరికివారు స్వయం ఉపాధిగా డబ్బు సంపాదించడం వల్ల డబ్బు మాత్రమే కాదు మార్కెటింగ్ మెళకువలు, వారి శక్తిపై వారికి నమ్మకం పెరగుతుంది. ఇక్కడ ఒక చీరతో పాటు ఒకేసారి ఆరు చీరల వరకు నేసే యాంత్రాలున్నాయి. ఒక్కోరకమైన పనిలో ఒక్కో వ్యక్తి రాటుదేలి ఉండడంతో ఇక్కడ పనిని సమిష్టిగా విభజించుకుంటారు. నూలు వడకడం, మగ్గంపై నేత నేయడం, డిజైన్లు సృష్టించడం, చీర తయారైన తర్వాత బోర్డరు, రంగులు అద్దడం వరకు.. కొంతమంది వీటన్నిటిని వారే చేసుకుంటారు కూడా.

బండారులంక గ్రామంలో తయారుచేసే ప్రతి చీరకు ఓ ప్రత్యేకత ఉన్నది. ఎన్నో దశాబ్దాల నుండి చీరలు నేస్తున్నారు కాబట్టి అదే పాతతరం చీరలు మాత్రమే ఇక్కడ దొరుకుతాయని అనుకుంటే పోరబాటే, 60 ఏళ్ళ అమ్మమ్మలు ధరించే చీరల దగ్గర నుండి నేటి కాలేజ్ స్టూడెంట్స్ వేసుకునే డ్రెసేస్ వరకు ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ లభ్యమయ్యే 300 నుండి లక్షలు విలువచేసే పట్టు చీరలు పవర్ లుమ్ పై తయారు చేసే డ్రెస్ లను తట్టుకుని మార్కెట్ లో నిలబడుతున్నాయంటేనే అర్ధం చేసుకోవవచ్చు బండారులంక నాణ్యతా ప్రమాణాలు..