వాడు అందరిలాంటి వాడు కాదు చాల ప్రత్యేకమైన వాడు. ఉదయం 5గంటలకు లేచి స్నానం చేసి, భగద్గీత పారాయణం దైవ ప్రార్ధన, మెడిటేషన్ చేసి అప్పుడు వాడు చదివే Charted Accounts కి సంబందించిన బుక్స్ తో కుస్తీ పట్టెవాడు. మందు, సిగిరేట్ కాదు కదా Tea Coffeeలు కూడా ముట్టే వాడు కాదు ఎప్పుడు ఏదో ఒక ఆలోచన ఎప్పుడు ఏదోరకంగా ఎదుటివారికి సహాయం చేస్తుండేవాడు ప్రతి తల్లిదండ్రులు, స్నేహితులు ఇలాంటి వ్యక్తి మా జీవితంలోకి రావలని కోరుకునే వారు. అంతటి మంచి తెలివైన వ్యక్తి నాకు ఒకసారి ఫోన్ చేసి... శ్రీకాంత్ ... నాకు చనిపోవాలని ఉంది రా అంటు మాట్లాడుతూ నిద్రమాత్రలు మింగేశాడు... వీడి జీవితంలో జరిగిన అనుకోని పరిస్థితుల గురుంచి తెలిసిన ఇంట్లో వాళ్ళు వీడినీ ఒక కంటా కనిపెడుతూనే ఉన్నారు వెంటనే హస్పిటల్ కి తీసుకెళ్ళారు... నిద్రమాత్రలు మింగిన 40 Hours కి నేను అక్కడికి చేరుకున్నాను (నేను వాడు వేరే ఊరిలో ఉంటాము) అది ఒక గవర్నమెంట్ హస్పిటల్ నేను హస్పిటల్ దగ్గరికి రాగానే వాడు ఏడుపు వినిపిస్తుంది మామూలుగా కాదు నరాలు తెగిపోయేలా మనసులో ఏది దాచుకోకుండా కడుపునిండా వాడి భాదంతా ఈ ప్రపంచానికి అర్ధం అయ్యేలా ఏడుస్తున్నాడు నాకు పట్టరాని తట్టుకోలేని భాదేసింది కోటి మందిలో ఒక్కడిలా ఉండే వీడు ఇలా ఏడవడమేంటీ... ఇలా ఆత్మహత్యకు ప్రయత్నించడమేంటి.. అని ఒక పక్క వేదన ఒక పక్క ఆలోచనలతో వాడి రూమ్ దగ్గరికి వెళ్ళాను నలుగురు కంపౌండర్లు వాడ్ని పట్టుకున్నారు సెలైన్ ఎక్కించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు నాకు ఏ ట్రీట్మెంట్ వద్ధు అని ఏడుస్తు ప్రతిఘటిస్తున్నాడు... వాడికేదో ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల నిద్రపోయాడు...కాసేపటి తర్వాత డాక్టర్ గారి Permission తీసుకొని వాడితో మాట్లాడటానికి వెళ్ళాను అప్పుడు చెప్పాడు...
ఒక అమ్మాయి Dress విప్పి నన్ను జీవితాంతం గుర్తుండిపోయే విదంగా నన్ను సుఖ "పెట్టు" రా అని అన్నా కూడా ఒక చిన్న నవ్వు నవ్వి ఇలాంటివి నాకు కాబోయే భార్యతో తప్ప ఎవ్వరితో చేయనండి అంటు అక్కడినుండి వెళ్ళిపోయే లాంటి వ్యక్తి రాము.... వీడు చదివే CA Institute లో వీడే Brilliant అవ్వడం వల్ల కొంతమంది Students Doubt కోసం వచ్చేవాళ్ళు అలానే పరిచయం అయ్యింది "జాస్మిన్" ఎందుకో జాస్మిన్ కళ్ళల్లోకి చూడగానే జన్మ జన్మల బంధంలా రాముకి అర్ధం అయ్యింది. జాస్మిన్ సుకుమారంగా మాటలు కలిపింది మెదటిరోజే ఇద్ధరు ఫోన్ నెంబర్లు తీసుకున్నారు... ఇక ఏముంది మాటలు కలిసాయి, అభిప్రాయలు కూడా కలిసాయి జాస్మీన్ యే నా సర్వస్వం నా భవిషత్తు అని రాము అనుకున్నాడు ప్రాణంలా ప్రేమించాడు కాని ఏ ఒక్కనాడు కూడా తన చేయి కూడా ముట్టుకోకుండా ఆ ప్రేమ పవిత్రత అనుభవించాడు... ఇలా కొన్ని నెలలు గడిచాయి... ఒకరోజు జాస్మీన్ రాముకి ఫోన్ చేసి మా ఫ్రెండ్ ఇంట్లో ఎవ్వరు లేరు నీతో మాట్లాడాలి రాము...ఏదైన Serious Incident జాస్మీన్ Life లో జరిగిందా అని తను చెప్పిన అడ్రస్ కి వెళ్ళాడు.జాస్మీన్ Door తెరిచింది, చీరలో చాల రొమంటిక్ గా రాముని లోనికి పిలిచి రాము బుగ్గమీద ముద్దుపెట్టి చిన్నగా చెవి కొరికింది... రాముకు ఇలాంటివి చాల కొత్త అవ్వడం, ఎంతైనా తాను ప్రాణంలా ప్రేమించిన అమ్మాయి పెళ్ళి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయే కాదా అని ఆరోజు ఇద్ధరు శరీరకంగా కలిసారు... కాసేపటికి బెడ్ మీద తనని కౌగిలించుకొని జాస్మీన్ నువ్వంటే నాకు ప్రాణంరా నువ్వు లేకుండా నేను బతకలేను మనిద్ధరం తొందరగా పెళ్ళిచేసుకుందాం నాకు Deloitte లో Job వచ్చింది నువ్వు After Marriage నీ చదువును కొనసాగించు అని చెప్పాగానే జాస్మీన్ ఏమి మాట్లాడకుండా రాము కౌగిలిని విడిపించుకొని నాకు కొంచెం Urgent Work ఉంది నేను వెళ్ళాలి అంటూ వెళ్ళిపోయింది...
ఇది జరిగిన వారం తరువాత ... రాముకి ఏం అర్ధం కాలేదు ఆరోజు నుండి ఎన్ని సార్లు ఫోన్ చేసినా మాట్లాడటం కాదు కాదా Phone, Facebook, Whats-app, అన్ని బ్లాక్ చేసింది... రాము జాస్మీన్ మౌనం తట్టుకోలేక పోతున్నాడు.. తన జ్ఞాపకాలు రాముని చీల్చి చెండాడి ముక్కలు ముక్కలు చేస్తున్నాయి... సెకండుకు రెండుసార్లు జాస్మీన్ గుర్తొస్తుంది అసలు మర్చిపోతే కాదా రోజుకు జాస్మీన్ ఒక్కసారే గుర్తుకొస్తుంది కాని మర్చిపోడానికే ఒకరోజు టైం పట్టుద్ధి. ఇంట్లో అమ్మనాన్నకు వీడి పరిస్థితి అర్ధం అయ్యింది రాము కూడా జరిగినదంతా పేరెంట్స్ కు చెప్పేశాడు.. వీడి పరిస్థితిని చూడలేక CA Institute కి కాల్ చేసి (జాస్మీన్ తన అడ్రస్ అడిగిన చెప్పేదికాదు) జాస్మీన్ ఇంటి Address కనుక్కున్నారు. Parents తో కలసి పెళ్ళి సంబందం మాట్లాడదామని జాస్మీన్ వారింటికి వెళ్ళారు. రాము కు ప్రతి ఒక్కక్షణం ఒక యుగంలా ఉంది ఎప్పుడు జాస్మీన్ ను చూద్దామా అని అతని కళ్ళు మూగగా ఎదురుచూస్తున్నాయి... జాస్మీన్ ఇంటి చుట్టు చుట్టాలు చిన్నపిల్లలతో కోలాహలంగా ఉంది ఒక పాపని అడిగి జాస్మీన్ ఎక్కడ ఉంది అని అడిగారు.... "లోపల ఉంది"... రాము అది వినగానే పరిగెత్తుకుంటు వెళ్ళి జాస్మీన్ ను కౌగిలించుకుని తన గుండె పడ్డ భాదను చెప్పాలని వెళ్ళాడు... అందరు చప్పట్లు కొడుతూ జాస్మీన్ చుట్టు కొంతమంది జనాలున్నారు... తన పక్కన ముసిముసిగా నవ్వుతున్న ఒక వ్యక్తి నోట్లో కేక్ తినిపిస్తుంది.... వెనుక ఉన్న బోర్ఢుచూసి రాము గుండె ఆగిపోయింది Happy 3rd Wedding Anniversary అని అంటే అప్పటికే జాస్మీన్ కు పెళ్ళి జరిగి మూడు సంవత్సరాలైంది... వచ్చిన అతిధులు తనకు శుభాకాంక్షలు చెబుతున్నారు రాముకు తన గుండె చప్పుడు తప్ప ఇంకేమి వినిపించలేదు... విన్న నేనే తట్టుకోలేక పోయాను అనుభవించిన వాడి పరిస్థితిని ఊహించుకోలేను...మనం చూస్తుంటాం కాదా పెళ్ళి జరిగిన కూడా కొంతమంది మగవాళ్ళు నాకు పెళ్ళి కాలేదు అని నమ్మించి మోసం చేసే వారిని... ఆ కోవకు చెందిన అమ్మాయి ఈ కొవ్వు పట్టిన జాస్మీన్... అబ్బాయిలోనే కాదండి అమ్మాయిలలో కూడా ఇలాంటి చెడ్డవాళ్ళుంటారు... రాము ఇప్పటికి 3సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు ఆకులు రాలిన ఎండిన చెట్టులా వాడు నేర్చుకున్న చదువు జ్ఞాణం అంతా మరిచిపోయాడు. Deloitte లాంటి Company లో ఉద్యోగాన్ని ఒదిలేసి ఇప్పుడు ఇంట్లో ఒక చీకటి గదిలో తన జ్ఞాపకాలతో రెండు సంవత్సరాలు శిక్షను అనుభవించాడు...జాస్మీన్ ఏదో Foreign కి వెళ్ళిపోయింది. రాము ఇప్పుడు ఒక చిన్న జాబ్ చేస్తున్నాడు. నా జీవితంలో ఇది ఒక మరుపురాని సంఘటన వాడి బంగారు జీవితం నాశనం అయ్యింది... కొంతమంది అబ్బాయిలు అమ్మాయిల పవిత్ర శరీరంతో ఆడుకొని రేప్ చేస్తుంటారు... అలాగే కొంతమంది అమ్మాయిలు రాము లాంటి అమాయక మనసుతో ఆడుకొని వారి జీవితాన్ని నాశనం చేస్తుంటారు ... జాగ్రత్త !!!!