రాజ్ - కోటి , తెలుగు సినీ సంగీతం లో తమకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నారు . ఇళయరాజా గారు తన బాణీలతో శ్రోతలను కట్టిపడేస్తున్న 80వ దశకంలో , ప్రయోగాలతో , ఆధునికత రంగరించి యువతని ఉర్రుతలూగించే మాస్ బీట్స్ ని ,మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సుమధుర గీతాల్ని అందించారు రాజ్ - కోటి ద్వయం . ఈ ఇద్దరి కలయిక లో ఎన్నో వినసొంపైన పాటలు వచ్చాయి వాటిల్లోంచి ఎప్పటికీ ది బెస్ట్ గా నిలిచిపోయే కొన్ని పాటలు ఓసారి మనమూ విందాం .
సెంటిమెంట్
1.ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా - ఇద్దరూ ఇద్దరే
2. అమ్మంటే ప్రేమకు రూపం - బంగారు కుటుంబం
డ్యూయెట్ మెలోడీ
3.అందం హిందోళం - యముడికి మొగుడు
4.గువ్వా గోరింకతో - ఖైదీ నెం. 786
5.గజ్జె ఘల్లుమన్నదో గుండె జల్లుమన్నదో - బావ బావమరిది
6.అంజనీ పుత్రుడా - ముఠా మేస్త్రి
7.స్వాతిలో ముత్యమంత - బంగారు బుల్లోడు
8.ఇందిర మందిర సుందర కారా - గోవిందా గోవిందా
9.అందమా అందుమా - గోవిందా గోవిందా
10.ప్రియా రాగాలే - హలో బ్రదర్
పాప్ బీట్ & మాస్ సాంగ్స్ - ఈ పాటలు ఇప్పుడు థియేటర్లలో వేసినా బి సి సెంటర్ లలో పూనకాలే
11.పదహారేళ్ళ వయసు - లంకేశ్వరుడు
12.హే పాపా - త్రినేత్రుడు
13.కన్నె పెట్టారో కన్ను కొట్టారో - హలో బ్రదర్
14.రూపుతేరా మస్తానా – రిక్షావోడు
Bonus కోటి గారి తండ్రిగారు సాలూరి రాజేశ్వరరావు గారు సుప్రసిద్ధ సంగీత దర్శకులు . వారు వార్ధక్యం లో ఉన్నపుడు ఈ పాటనే ఎక్కువగా వింటూ ఉండేవారని కోటి గారు ఓ సందర్భం లో చెప్పారు . ఈ ఒక్క పాట చాలదూ రాజ్ - కోటి గార్లు ఎంత గొప్ప సంగీతాన్ని అందిచారో చెప్పడానికి
15.ఇదేలే తరతరాల చరితం - పెద్దరికం