బెజవాడ గోపాల్ రెడ్డి.. ఈ పేరు స్వాతంత్ర్య ఉద్యమానికి బాగా తెలుసు. చిన్నతనం నుండే దేశభక్తి ఎక్కువ ఉండటంతో బ్రిటీష్ వారిపై స్వాతంత్ర్యం కోసం ప్రాణాలకు తెగించి నాటి భారతీయులందరి చేత గొప్ప వీరుడు అంటు మన్ననలు అందుకున్నారు. అంతేకాదు స్వతంత్ర పోరాటంలో తన రచనల ద్వారా ఎంతోమందికి స్పూర్తినందించిన రచయిత. భారతమాత కన్న గొప్ప దేశభక్తుడు బెజవాడ గోపాల్ రెడ్డి పుట్టినరోజు ఈరోజు. పేరులో బెజవాడ ఉన్నా గోపాల్ రెడ్డి పుట్టింది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంలో. మాజీ ప్రధాని పి.వి నరసింహారావు 17 దేశ, విదేశీయ భాషలు మాట్లాడగలరు ఆయన తర్వాత గోపాల్ రెడ్డి దేశంలోని 11 భాషలు మాట్లాడగలరు. గోపాల్ రెడ్డి గారిని తెలుగుప్రజలు ఆంధ్రా ఠాగూర్ గా పిలుస్తారు రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలు చాలా వరకు మన తెలుగు భాషలోకి అనువదించడం మూలంగా ఈ పేరు వచ్చింది.
స్వతంత్ర పోరాటంలో పాల్గొని జైలులో సంవత్సరాల తరబడి గడిపారు. 1956లో విశాలాంధ్ర ఏర్పడినపుడు హైదరాబాదు రాజధానిగా ఉపముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ కేంద్రంలో మంత్రిగా ఆహ్వానించి రెవిన్యూ మంత్రిని చేశారు. అనంతరం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను అప్పగించారు. ఐదేళ్ళపాటు ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా వ్యవహరించారు. 186 నెలలు వివిధ రాజకీయ పదవులు నిర్వహించారు. సాహితీ రాజకీయ రంగాలలో తనదైన విశిష్ట స్థానాన్ని నిలుపుకొని 90 సంవత్సరాల నిండు జీవితాన్ని గడిపిన పూర్ణపురుషుడు బెజవాడ గోపాలరెడ్డి.
బెజవాడ గోపాల్ రెడ్డి 30 సంవత్సరాలు నిండకముందే రాజాజీ(మద్రాస్ ముఖ్యమంత్రి) మంత్రివర్గంలో మంత్రి అయ్యారు. కర్నూలులొ ఆంధ్రరాష్ట్రం ఏర్పడినపుడు 1955లో ముఖ్యమంత్రి అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంవత్సరం పాటు భాద్యతలను నిర్వహించి ఆర్ధిక మంత్రిగా, హోం మంత్రిగా, రెవిన్యుశాఖ మంత్రిగా ఇలా పలు సంధర్భాలలో రాజకీయ నాయకుడిగా సేవలందించారు. ఉత్తరప్రదేశ్ కు గవర్నరుగా మరియు రాజ్యసభ సభ్యుడుగా (1958-1962) కూడా పనిచేశారు.