మార్చి 23 1931 న బ్రిటీషర్లపై దాడికి ప్రతీకారంగా బ్రిటీష్ వారు 23 ఏళ్ళ భగత్ సింగ్కు ఉరిశిక్ష ఖరారు చేసిన సంధర్బంలో తన తండ్రికి రాసిన చివరి లేఖ.
దైవ సమానులైన నాన్న గారికి...
నా ప్రాణాన్ని కాపాడటానికి, నన్ను ఉరికొయ్యల నుండి రక్షించడానికి మీరు పడుతున్న తాపత్రయానికి మి పుత్రుడిగా సంతోషపడాలో, భాద పడాలో అర్ధం కావడం లేదు. మీ పుత్రుడైనందుకు మీరు నా మీద పెట్టుకున్న ఆకాంక్షలను అమితంగా గౌరవిస్తాను. కాని మీ కన్నా, మిమ్మల్ని నన్ను మోస్తున్న నా మాతృభూమి ఋణాన్ని తీర్చుకునె హక్కు నాకు లేదా? స్వాతంత్ర పోరాటంలో బ్రిటీషర్లపై చేసిన దాడిని నేను నేరంగా భావించడం లేదు. నా ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం కోర్టులో నేను నిర్ధోషిని అని వారి కాళ్ళ దగ్గర నా తలను పెట్టాలని నేను భావించడం లేదు. నా ప్రాణం, నా జీవితం కన్నా దేశమే గొప్పది. ప్రతి భాద్యత గల యువకుడు దేశం కోసం తన సర్వస్వాన్ని అందించాలని బలంగా విశ్వసిస్తాను. అందుకు ఏ ఆటంకాన్నైనా నిజాయితిగా, దేశ భక్తితో ఎదుర్కొనాలి. ఇలాంటి అభ్యున్నతి కోసం నిలబడే వ్యక్తి బూజు పట్టిన విధానాలను ఎదురించాలి. నాకు బాగా అర్ధం అయ్యింది నా మెడకు బిగించే ఉరితాడే చివరి క్షణం వరకే ఈ దేశపు గాలి పీల్చగలను అని... కాని ఒక లక్ష్య చేదనలో ఇలాంటి ఉరికంబాలు గర్వకారణాలే కాని జాలి పడాల్సిన సంధర్భాలు కావు. ఎలాంటి వృత్తి లేకుండా, ఎలాంటి జీతం లేకుండా కేవలం దేశభక్తితో నా దేశం కోసం ఇలా ప్రాణత్యాగం చేస్తున్నందుకు ప్రపంచంలో నా అంత ఆనంద పడేవాడు ఇంకొకడు ఉండడేమో నాన్న... మనుషులకు సేవచేయడానికి, భాదిత పీడిత ప్రజలను రక్షించడానికి యువతరం ముందుకొచ్చినప్పుడే నేను ఎదురుచూస్తున్న నా కలల భారతం నిర్మించబడుతుంది. నా చావు తరువాత వచ్చే నా భారతయువతకు నేను చేసిన ఈ త్యాగాన్ని దేశభక్తితో ఆచరించమని స్పూర్తిని రగిలించండి. ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైన వారి ఉన్నత లక్ష్యాన్ని ఛేదించేలా మానసికంగా బలంగా ఉండాలని నా మాటగా చెప్పండి. ఇక సెలవు. ఇట్లు మీ భగత్ సింగ్.