సాధారణంగా పెళ్ళి కాని మరే ఇతర ఫంక్షన్ లో భోజనానికి వెళ్ళినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే.. వారింటికి అతిధిగా వెళ్ళిన మనల్ని చూసి వీడికి బొత్తిగా తిండి దొరకక మనకాడికి వచ్చి ఫ్రీగా మెక్కేయడానికి వచ్చాడ్రా అని ఏదో వడ్డించాలి తప్పదు అని తక్కువ వడ్డిస్తు అంతర్లీణంగా మనల్ని కించపరుస్తుంటారు.. ఇలాంటి పరిస్థితులు దాదాపు అన్ని ఫంక్షణ్ లలో కనిపిస్తాయి ఇంకా పుణ్యం అంటు చేసే అన్నదానాలలో కూడా చాలా చోట్ల రెండవ రకం బియ్యాన్ని, రుచి లేని భోజనంతో ఏర్పాటు చేస్తారు ఇలాంటి మానవత్వం లేని అన్నదానాలు చేసేవారు చిన్న పెట్టుబడితో వారి పాపాలు కడిగేయించుకోవాలి, స్వర్గానికి వెళ్ళాలి అనే ఆరటమే తప్పా వచ్చిన అతిధిని ఎలా చూసుకోవాలి వారితో ఎలా గౌరవంగా మెలగాలి, వారికిష్టమైన భోజనం ఏంటి అని చాలా తక్కువ మందే ఆలోచిస్తుంటారు.. అలాంటి తక్కువ మందిలో ముందుండే వ్యక్తే ఈ షరీఫ్ షతాజ్ ఖాదిరి బాబా అదేనండి స్థానికులు ఇష్టంగా పిలుచుకునే బిర్యాని బాబా.
ఆంధ్రప్రదేశ్ విజయనగరం కు చెందిన 79ఏళ్ళ ఖదిరి దాదాపు 40 ఏళ్ళుగా, కృష్నా జిల్లాలోని చీమలపాడు దర్గాలోని లంగర్ ఖానాలో, ప్రతిరోజు నాణ్యమైన చికెన్, మటన్, స్వచ్ఛమైన నెయ్యి, భాస్మతి బియ్యంతో చేసిన బిర్యానీని ఆ దర్గాకు వచ్చే భక్తులకు ప్రసాదంగా వడ్డిస్తుంటారు. ప్రతిరోజు దాదాపు 1,000కి పైగా భక్తులకు బిర్యానీని వడ్డిస్తారు కొన్ని పండుగలలో మాత్రం పదివేలకు పైగా వచ్చే భక్తులకు ఏ కులం ఏ మతం, బీద, ధనిక అనే తారతమ్యం లేకుండా ఉచితంగా ఈ బిర్యానీని అందిస్తారు. కేవలం బిర్యాని మాత్రమే కాదు ఇక్కడ శాకాహారులకు కూడా ప్రత్యేక భోజన సధుపాయాలను కూడా కల్పించారు. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా వారికి తోచినంతగా విరలాలను అందిస్తారు. ఈ బిర్యాని వితరణ కోసం ప్రతిరోజు రెండు టన్నుల భాస్మతి బియ్యం, క్వింటాళ్ళలో చికెన్, మటన్ కొనుగోలు చేస్తారు. ఆయన గురువు ఖాదర్ బాబా నుండి పొందిన ఈ వారసత్వాన్ని 40ఏళ్ళ నుండి కొనసాగిస్తున్నారు. బాబా మాటల్లో చెప్పాలంటే "నా దృష్టిలో కులం, మతం అంటు లేదు మీ దేవుడు మా దేవుడు అంటు ఎవ్వరూ లేరు దేవుడు ఒక్కడే సగటు మనిషికి సేవ చేయడం కూడా దేవుడికి సేవ చేయడం రెండు ఒక్కటే ". ప్రతిరోజు ఎంతమంది వచ్చినా లేదు అనే మాట లేకుండా ఇప్పటికి ఆకలి తీరుస్తున్న ఈ కార్యక్రమం ఎప్పటికి కొనసాగాలని కోరుకుందాం..

