(Contributed by Srinivasa Ravi Theja. A)
‘సి’త్రాలు చేసి ‘ని’న్ను మైమరిపించే ‘మా’య!!
ఎందుకు సినిమా అంటే మనకింత వెర్రి?
కాదు మోజు?
కాదు కాదు ప్రేమ ?
ఆహా కాదు పిచ్చి ?
సరే పోని పైవన్ని కలిపి వెర్రిగా మొదలైన మోజుతో కూడిన పిచ్చి ప్రేమ.
ఈరోజు, అలుపుతో గెలుపు తలుపును తీసిన మన నలుపు తెలుపు సినిమాల గురించి మాట్లాదుకుందాము, సినీ చరిత్రలో ఇదో మేలి మలుపు. అజరామరం ఆ తలపు..
మన అణువణువులో జీర్ణించుకుపొయింది ఈ Black & White సినిమా, ఎంటివోడి ఆటైనా, నాగేశ్వరరావు పాటైనా, కిట్టిగాడి స్టెప్పైనా, శోభన్ బాబు రింగైనా.... ప్రతిదీ మనకిష్టమే అన్నీ చూడగలగటం మన అదృష్టమే.
అమావస్య రాత్రి నాడు పున్నమి చంద్రుడి వలే ప్రకాసిస్తూ, Brightness, contrast తప్ప, Hue అవసరమే లేని Black& White సినిమా ఒక అనుభూతి. సంద్రములో చెక్కరనీళ్ళు వలె, ఎండమావిలో పానకం వలె, మత్తు గా గమ్మత్తు గా ఉంటుంది మన సినిమా
సావిత్రి ని గర్భగుడి లేని దేవత అన్నా, సూరేకాంతం అత్తని కారం నూరే గయ్యాలిగా చూసినా, జమునని యమునా నది హొయలతో కీర్తించినా అన్ని మనకే చెల్లాయి.
రేలంగి హాస్యమైనా, ఎస్వీఆర్ లాస్యమైనా,
పద్మనాభుడి చిరుమందహాసం, రమణా రెడ్డి వికటాట్టహాసమైనా,
చమత్కారమో, బలాత్కారమో అన్నిటినీ కదుపుబ్బా నవ్వుకున్నాం, ఇప్పటికీ నవ్వుతునే ఉన్నాము.
కంప్యూటర్లు, గ్రాఫిక్స్, టెక్నాలజీ ఇవన్ని లేని రోజులలో పాతాళభైరవి, మయాబజార్ వంటి చిత్రాలలోని అద్బుతమైన ఛాయాగ్రహణం అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికీ మనల్ని ఆశ్చర్యచకితులని చేయక మానదు.
సాంకేతికత అన్న పదం ఇంకా వాడుకలోకి రాకముందు, విప్లవం వర్ధిల్లాలి అని అల్లురి పాటలో తప్ప తెలియని లోజులలో, అంతటి విలువలతో కూడిన సాంకేతికత విలువలతో తీసిన ప్రతి సినిమా ఒక కళాఖండం.
Black & White సినిమా ని దృశ్యకావ్యం అనేకన్నా దృశ్యవిప్లవం అనడం సమంజసమేమో!!!
ఎందరో ఇంకెందరెందరో, అందరూ మహానుభావులే; వీళ్ళందరు ఎవరు? సినిమా వాళ్ళా? సినీ స్టార్లా? మన బుడుగు భాషలో, వీరో, వీరోఇన్లా???
కాదు వీళ్ళందరు, మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపొయే ధ్రువ తారలు, మన రక్తతరంగాలలో ఇమిడిపోయి జీవనతరంగాలలో భాగమైన మన నేస్తాలు, రచ్చబండ దోస్తులు, తరగని ఆస్తులు. అసాధ్యాలను సుసాధ్యాలను చేసిన ఘనత మనకే సొంతం.
తెలుగు సినీ చరిత్రలో చెరగని సంతకం మన Black & White సినిమా…
ఇప్పటికీ Black & White సినిమా చూస్తే నిండు వెండి వెన్నెలలో మేడమీద మడతమంచం వేసుకుని పడుకున్న అనుభూతి కలుగుతుంది. అందుకే మన జ్ఞ్యాపకాలు black & White లో తలుచుకుంటే ఇంకా బాగుంటాయి.
Black & White సినిమా నలుపు తెలుపుల హరివిల్లు, వెచ్చని పొదరిల్లు, ముచ్చటైన బొమ్మరిల్లు. .
తెలుగు సినిమా దశను, దిశను మార్చిన సినిమాలు ఎన్నున్నా తెలుగు చలనచిత్రాలను దసదిశలా కీర్తింపజేసినది మన Black & White సినిమా, ఎప్పటికీ అజరామరం. అణువణువునా పవిత్రత మూటగట్టుకుని, వినోదాత్మక విలువలని అందరి దరికి చేర్చింది. వినోదమే పరమావధిగా కాకుండా విజ్ఞానాన్ని పంచుతూ విలువలని మరువకుండా, వ్యాపారవిలువలని పక్కనబెట్టి వినోదాత్మక వ్యాపారాన్ని చేసి మనల్ని వీనులవిందు చేసిన మన Black & White కి సినిమా ఇదే మా అక్షర నీరాజనం.