మనదేశంలో క్రికెట్ కి ఎంత పిచ్చి ఉంటుందో అందుకు తగ్గ స్థాయిలోనే మన ఆటగాళ్ళల్లో సత్తా ఉంటుంది. అది మామూలు ఇండియన్ క్రికెట్ టీం కావచ్చు, మహిళల క్రికెట్ టీం కావచ్చు, బ్లైండ్ క్రికెట్ టీం కావచ్చు.. ఏ టీం ఐనా గాని మనోళ్ళు మాత్రం Cricketలో World Cup కొట్టేస్తున్నారు. మొన్న జరిగిన "T20 World Cup For Blind"(Feb12)లో పాకిస్తాన్ మీద 9 వికెట్ల తేడాతో ఇండియా గ్రాండ్ విక్టరి సాధించింది. మామూలుగా గెలిచిన గెలుపుకు ఓ రేంజ్ లో గెలిచిన గెలుపుకు చాలా తేడా ఉంటుంది. ఆ రేంజ్ గెలుపు కోసం మన క్రికెట్ టీం ను ముందుకు నడిపిన Captain మన తెలుగువాడు అజయ్ కుమార్. కళ్ళు సరిగ్గా కనిపించక పోయినా గాని అజయ్ ఎన్నో విపత్కర పరిస్థితులను దాటి ఈ స్థాయికి చేరుకున్నాడు.. అలా గమ్యాన్ని చేరుకున్న ఆ మార్గాన్ని మనం కూడా ఒకసారి పరిశీలిద్దాం.


మన గుంటూరు జిల్లా గురజాలకు చెందిన 26 ఏళ్ళ అజయ్ కుమార్ కు అందరిలానే చిన్నతనం నుండి క్రికెట్ అంటే చాలా ఇష్టం. కంటికి Infection సోకడంతో 10సంవత్సరాలు నిండక ముందే ఎడమ కన్ను చూపు పూర్తిగా కోల్పోయాడు. ఉన్న ఒక్క కన్నుతో కూడా స్పష్టంగా చూడలేడు, కేవలం 10మీటర్ల దూరం వరకే అజయ్ చూడగలరు. అజయ్ కు క్రికెట్ అంటే ఇష్టం ఉన్నా ఆడటం మాత్రం మొదట చాలా కష్టంగా ఉండేది. ఎప్పుడైతే Lutheran High School For Blind Narsaraopetలో Join అయ్యాడో ఇక అప్పటి నుండి ప్రత్యేకంగా నేర్చుకోవడం మొదలుపెట్టారు. రెండు కళ్ళు ఉంటేనే గ్రౌండ్ లో ఫీల్డింగ్ చేయడానికి, బౌలింగ్, బ్యాటింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది కాని అజయ్ ఒక కన్నుతో మాత్రమే ఆడాలి.. అందుకోసం క్రికెట్ లో రాటుదేలడానికి అజయ్ చాలా కష్టపడ్డారు.


అజయ్ తండ్రి ఒక సాధారణ రైతు.. ఆర్ధిక ఇబ్బందులు, ఇంకా క్రికెట్ అంటేనే తండ్రికి అంతగా ఇష్టం లేకపోవడంతో శిక్షణ తీసుకుంటున్నప్పుడే ఎన్నో సమస్యలతో పోరాడారు. Indiaలో Blind Cricket Association(1998) స్థాపించడం, ప్రపంచ స్థాయిలో క్రికెట్ మ్యాచ్ లు నిర్వహిస్తుండడంతో అజయ్ చిన్నతనం నుండి ఆ వైపుకు అడుగులు సాగాయి. అజయ్ Teamలో ఎప్పుడైతే ఎంపికయ్యారో ఇక అప్పటి నుండి టీం లో తన స్థానం కీలకమయ్యింది. అజయ్ ఉనికి మిగిలిన టీం సభ్యులందరికి Confidence పెంచింది.


Senior Cricketers, Coachల ప్రోత్సాహంతో అజయ్ మరింత నేర్పరితనం సాధించారు. అలా దాదాపు పది సంవత్సరాల నుండి రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ లో ఒక ఉన్నత స్థాయిని చేరుకున్నాడు. తర్వాత Vice Captain గా బాధ్యతలు తీసుకుని ఎన్నో విజయాలను భారత్ కు అందించారు. '2017 టీ20' వరల్డ్ కప్ యే లక్ష్యంగా సాగుతున్న ప్రణాళికలలో సెలక్షన్ కమిటి Captainగా అజయ్ మాత్రమే సమర్ధుడు అని భావించి సంవత్సరం క్రితమే భాద్యతలను అందించింది. అందరు ఊహించినట్టుగానే అజయ్ సారధ్యంలోని టీం ఫైనల్ లో పాకిస్తాన్ పై ఘన విజయం సాధించి కప్ గెలుచుకుంది.. ఈ టోర్నిలో మొత్తం 9 మ్యాచ్ లు ఆడిన అజయ్, బ్యాటింగ్ లో 296 పరుగులు చేసి, బౌలింగ్ లో టోర్నిలోనే అత్యధికంగా 9 వికట్లు పడగొట్టి, భారత విజయంలో ఆల్ రౌండర్ ప్రతిభతో గెలుపును సులభం చేశారు.

