అనిత, సునీత, సబిత, సుకృతి, మూర్తి, రఘునందన్, మాధవ రెడ్డి.. వీరందరి జీవితాలు, లక్ష్యాలు, దారులు లేరు.. ఐతే వీరందరినీ కలిపింది ఒకే ఒక్క సహజ లక్షణం అదే "మానవత్వం". వారితో పాటే బ్రతికే ఈ ప్రపంచంలో శారీరక లోపంతో కాని పేదరికంతో కాని ఎవరు తారసపడిన వారి మనస్సు చివుక్కుమంటుంది. వీరు మాకు అత్యంత సన్నిహితులు, వీరిని మరొక జీవితంలోకి తీసుకురావాలన్న బాధ్యత ఈ ఏడుగురికీ కలుగుతుంది.
"బ్రతికించడం కాదు కొత్త జీవితం ఇవ్వడమే లక్ష్యం". శారీరక లోపంతో సాయి నేత్ర ఫౌండేషన్ చేరిన ఇప్పటికి చేరిన 200 మందిలో 160 మందికి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సీఏ, సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు సాధించారు. ఫౌండేషన్ ట్రాక్ రికార్డ్ అలాంటిది మరి. ఫౌండేషన్ లో ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉండడం, ఇంకా తక్కువ మెంబర్స్ ఉంటే వారి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుందని ఒకేసారి 20 సభ్యులకు మాత్రమే అనుమతిస్తారు. ఉన్నవారికి ఉద్యోగం వచ్చి వెళ్లిపోతే వారి స్థానంలో వేరొక వ్యక్తులు వస్తారు.
ఒక్కసారి 20 మంది మాత్రమే:
సాధారణ స్టూడెంట్స్ కన్నా కళ్ళు లేనివారిని మరింత ప్రత్యేకంగా చూసుకోవాల్సి ఉంటుంది. సొంతంగా వారి పనులను వారు చేసుకోవడం దగ్గరి నుండి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి కౌన్సిలింగ్ చేస్తారు, యోగ మెడిటేషన్, గేమ్స్ కూడా ఆడిస్తారు. రోజువారీ అవసరాలు తీర్చడం దగ్గరినుండి బ్రెయిలీ లిపిలో చదువు చెప్పడం, స్టడీ మెటీరియల్ కలెక్ట్ చెయ్యడం మొదలైనవి శ్రద్ధతో చేశారు కనుకనే 200లో 160 మంది జాబ్ సాధించారు.
విజయం వెనుక పోరాటం:
ప్రతి విజయం వెనుక ఒక పోరాటం ఉంది. రాము పుట్టుకతోనే అందుడు. పేదరికం అదనంగా వచ్చిన మరో భారం. జీవితం కూడా అందకారమే అనుకున్న స్థితి నుండి సాయి నేత్ర ఫౌండేషన్ లో చేరి ఇంటర్మీడియట్, డిగ్రీ, సీఏ కంప్లిట్ చేసి కాపాడియా ఇండస్ట్రీస్ లో అకౌంటెంట్ గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న మరొక వ్యక్తికి బ్రెయిన్ ట్యూమర్ కారణంగా విజన్ కోల్పోయారు. ఉద్యోగం రాకముందు ముళ్ళదారిలోనే చిక్కుకుపోయారు. సాయినేత్ర అతని ఆలోచనలను పూర్తిగా చేర్పివేసింది. కళ్ళు కనిపించని వారు సైతం సాఫ్ట్ వేర్ జాబ్ చెయ్యొచ్చు అని అక్కడే తెలుసుకున్నారు. "JAWS (job access with Speech), NVDA(non visual desktop application) ఇలా రకరకాల అప్లికేషన్స్ తో ట్రైనింగ్ తీసుకున్నారు. ప్రస్తుతం గూగుల్ కు అనుబంధ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ఇంటికి దూరంగా ఒక స్కూల్ లో, హాస్టల్ లో జాయిన్ అయ్యాము, ఇక జాబ్ సాధించలేము అని వీరిలో మొదట కొన్ని రోజులు ఉంటుంది. కుటుంబ సభ్యులు, ప్రొఫెషనల్ టీచర్స్ లకు సరిసమానంగా ఇక్కడ చూపించే ప్రేమకు, ట్రైనింగ్ కు ఇది స్కూల్ హాస్టల్ కాదు "మా ఇల్లు, యూనివర్సీటీ అనే మార్పు సహజం వారిలో.