కృతయుగ్, సంశయక్ ఇద్దరు మంచి Friends. కృతయుగ్ ఎవ్వరి గురుంచి పట్టించుకోడు తనకి నచ్చిన పని చేస్తుంటాడు. సంశయక్ మాత్రం అడుగు ఆచితూచి వేస్తాడు, తన గురుంచి మిగితవాళ్ళు ఏమనుకుంటారో అని ఎప్పుడు ఆలోచిస్తు తన కోసం కాకుండా జనాలకు భయపడి బతుకుతుంటాడు. "కాని ఇద్దరికి దైవభక్తి ఎక్కువ".
ఒక మహర్షి వారిద్దరి మీద ఇష్టంతో ఆ ఊరి ప్రజలందరి ముందు మీకు 'రెండు వరాలు ఇస్తున్న' ఎవరికి ఏ వరం కావాలో కోరుకోండి అని రెండు వరాలు ఇస్తాడు ఒకటి "వందకోట్ల డబ్బు" రెండవది ఏ వరాలు అడగకుండా "దైవదర్శనం". మనసులో డబ్బు అడుగుదామనుకున్నా జనాలు ఏమనుకుంటారో అని కోరికలేమి అడగని షరతుతో కూడిన 'దైవ దైర్శనం' అడిగాడు జనాలందరు చప్పట్లు. నిస్సందేహంగ నాకు డబ్బు మాత్రమె కావలన్న కృతయుగ్. జనాలందరి నుండి నవ్వులు, తిట్లు.
సంశయక్ కి దైవదర్శనం, కృతయుగ్ కు డబ్బులు లభించాయి. తరువాత సంశయక్ భాదపడ్డాడు.... అనవసరంగా జనాలకు భయపడి కోరికలకు అవకాశంలేని దైవదర్శనం అంగీకరించా అని.
కాని కృతయుగ్ మాత్రం వచ్చిన డబ్బుతో ప్రతి పేద కుటుంబానికి సాయం చేసాడు. Schools, Hospitals కట్టించాడు అతని సేవకు ప్రజలందరు దీవించారు, సాక్షత్తు భగవంతుడే కృతయుగ్ పనికి పరవశించి "కృతయుగ్ కు దర్శనం ఇచ్చాడు, కృతయుగ్ తన కోరికలను నేరవేర్చుకున్నాడు.
ఎవడో నువ్వు చేసేది అర్ధం కానోడె నిన్ను చూసి నవ్వుతాడు. నీకు నచ్చింది Correct అనిపించింది చెయ్యడం ఆపొద్దు. నువ్వు అందరిలో Average గా కనపడనప్పుడే నిన్ను చూసి కుక్కలు మొరుగుతాయి, నువ్వు కూడ వాటిలా తిడితె, మొరిగితె నీకు కుక్కలకు తేడా ఉండదు. చూపించు నీకు వాటికి మద్య గల తేడాని. నీ దారిలో పిచ్చి కుక్కలున్నాయని వేరెదారిలో వెళ్తే నువ్వు భయపడినట్టు! అదే దారిలో వెళ్తున్నప్పుడు కుక్కలు మొరిగిన నువ్వు Silent గా వెళ్తె నువ్వు జాగ్రత్త పడినట్టు! భయపడటానికి జాగ్రత్త పడటానికి చాల తేడా ఉంది.
"నువ్వు ఎంచుకున్న లక్ష్యం దాని దారి ఇతరులకు హాని కలగనపుడు నిన్ను విమర్శించె హక్కు ఈ ప్రపంచానికి లేదు"