Our Tribute To The Man Who Decided How India Should Function!

Updated on
Our Tribute To The Man Who Decided How India Should Function!

మూఢ నమ్మకాలను నమ్ముకొని, పాములను ఆడించికొని బ్రతికేవారు మీకు అసలు పాలన అంటే తెలుసా.. ఎలా ఇన్ని మతాలు, కులాలు ఉన్న దేశాన్ని ఎలా పాలిస్తారు? అంటూ స్వాతంత్రం ఇచ్చే ఆకరి నిమిషంలో బ్రిటిష్ వారు ఏదో ఒక పేచి పెడుతున్న సమయంలో నాయకులందరికి ఒక పెద్ద కొండలా ఒక వ్యక్తి కనిపించాడు... అతనే డా. బి.ఆర్.అంబేడ్కర్... రాజ్యగం పూర్తయ్యేంత వరకు బ్రిటిష్ వారి రాజ్యాంగం ఉపయోగించుకొని, అంబేడ్కర్ అద్యక్షతన రాజ్యంగ రచన ప్రారంభించి 1950 జనవరి 26 నుండి భారత రాజ్యంగం అమలులోకి వచ్చింది... ప్రపంచంలో ఎక్కడా లేని ప్రజాస్వాయ్యం మన భారతదేశంలోనే ఉంటుంది... 9 దేశాల రాజ్యాంగాల నుండి ఇంకా మన దేశ సంస్కృతి, పరిస్థితులను అనుసరించి అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పూర్తి చేశారు... స్వతంత్రానికి రాక ముందు, వచ్చిన తర్వాత అంతలా చదువుకున్న వక్తి అంతలా జ్ఞాణం చాలా తక్కువ మందిలో ఉంటుంది...అంబేడ్కర్ ఒక సామాజిక శాస్త్రవేత్త, తిరుగులేని ఉద్యమ కారుడు, ప్రఖ్యాత న్యాయ కోవిదుడు, ప్రజలను కట్టిపడేయగల వక్త,అద్వితీయమైన రచయిత, ప్రపంచంలో ఎవ్వరూ చదవలేనన్ని డిగ్రీలను అందుకున్న మేధావి, ప్రతిష్టాత్మక ఆర్ధిక శాస్త్రవేత్త, భారత రాజ్యాంగ నిర్మాత, అన్నిటి కంటే ముఖ్యంగా ఒక మంచి మానవతా వాది, స్వేచ్ఛ సమానత్వం కోసం తపన పడ్డ సామాజిక విప్లవకారుడు..

మధప్రదేశ్ లోని "మావ్" అనే ప్రాంతంలో ఏప్రిల్ 14 1891న జన్మించారు.. తల్లిదండ్రులకు అంబేడ్కర్ 14వ సంతానం... అంబేడ్కర్ ఒక దలిత కుటుంబంలో పుట్టిన గొప్ప జీనియస్. నీచుల వెనుక వారు చేసిన Crime ఉంటుంది, కాని మహాత్ములకు వారు అనుభవించిన కష్టాలే ఆస్థి. వెనుకబడిన కులాల మీద ఆధిపత్యం ఇప్పుడే ఇలా ఉంటే వంద సంవత్సరాల క్రితం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు...అంబేడ్కర్ ఎంతటి దయనీయ పరిస్థితులలో తన చదువును కొనసాగించాడంటే తన పాఠశాలలో తన తోటి విధ్యార్దులు క్లాస్ లో నుండి బయటకు తోసేసినా కిటికి దగ్గర నిలబడి చదువును కొనసాగించేవాడు... మిగితావారందరు వంద మాటలు మాట్లాడితే అంబేడ్కర్ కేవలం ఒక్క మాటనే మాట్లాడేవాడు.. ఆ ఒక్క మాటలోనే వందమాటలకు సమాధానంగా ఉండేది..అంబేడ్కర్ 9 భాషలను మాట్లడగలరు(మరాఠీ,హిందీ,ఇంగ్లీషు,గుజరాతీ,పాళీ,సంస్కృతం,జర్మన్,పార్శీ,ఫ్రెంచ్).

అంబేడ్కర్ చదువులు:-

B.A - (Politics and Economics) Bombay University in 1912 - వెనుకబడిన కులాల నుండి మొట్టమొదటి గ్రాడ్యుయేట్.

M.A - (Economics - For his thesis ‘Ancient Indian Commerce’) in America in 1915.

PhD - (Economics - For his thesis ‘The evolution of provincial finance in British India’) in Columbia University, America in 1917.- ఆర్థిక శాస్త్రంలో ఆసియా ఖండం నుండి మొట్టమొదటి డాక్టరేట్.

D.Sc - (Thesis - ‘Problem of the Rupee - Its origin and its solution’) in London School of Economics in 1923. ఆర్ధిక శాస్త్రంలో D Sc తీసుకున్న మొదటి మరియు ఆఖరి భారతీయుడు

M.Sc – (Economics – For his thesis ‘Provincial Decentralization of Imperial Finance in British India’) London. - ఆర్ధిక శాస్త్రంలో మొదటి డబల్ డాక్టరేట్

Bar-At-Law - Gray’s Inn in London, 1923. మొట్టమొదటి ప్రపంచ స్థాయి న్యాయవాది

Political Economics - Germany.

LLD - (Honoris) Columbia University, New York, For his achievements of leadership and authoring the Constitution of India.

D.Litt - (Honoris) Osmania University, Hyderabad, For his achievements, Leadership and writing the constitution of India.

&nbp;

స్వతంత్ర భారతావనిలో మొదటి న్యాయశాఖ మంత్రిగా భాద్యతలను నిర్వహించారు.. కాని మహిళలకు కుడా సమాన వేతనం హక్కులు కల్పించడం లేదనే ఉద్దేశ్యంతో తన పదవికి రాజీనామ చేశారు.

అంబేడ్కర్ తన జీవిత కాలంలో 20,000 పుస్తకాలు సేకరించారు., అమెరికా నుండి తిరిగి వచ్చే సమయంలో ఆయన పుస్తకాలు తీసుకొస్తున్న నౌకను జర్మనీ సబ్మెరైన్ దాడి చేసి ముంచేయడంతో దాదాపు 6,000 పుస్తకాలు పోగొట్టుకున్నారు..

స్థాపించిన విధ్యా సంస్థలు: డిప్రెస్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ సొసైటీ -- జూన్ 14,1928,పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ -- జూలై 08,1945,సిద్ధార్థ్ కాలేజి, ముంబై -- జూన్ 20,1946,మిళింద్ కాలేజీ, ఔరంగాబాద్ -- జూన్ 01,1950.

అరుదైన గౌరవాలు

బాబాసాహెబ్ తన జీవిత కాలంలో 527 ప్రసంగాలు చేసారు., ప్రతి ప్రసంగం అత్యంత ప్రభావితం చేయగలిగేవే.. లండన్ యూనివర్సిటీ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు మొత్తం చదివి అవపోసన పట్టిన ఒకే ఒక్కరు.

ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావశీలురైన 6గురు మేధావులలో బాబాసాహెబ్ ఒకరు.

లండన్ విశ్వవిద్యాలయంలో తన ఎనిమిదేళ్ళ PhD ని మూడు సంవత్సరాలలో పూర్తి చేసిన అత్యంత మేధావి.

కొలంబియా యూనివర్సిటీ ప్రకారం - ప్రపంచంలో అత్యంత ప్రభావశీలుడైన నాయకుడు.

ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రకారం విశ్వంలోనే అతిగొప్ప ఉద్యమ నిర్మాత.

CNN,IBN, History channel నిర్వహించిన సర్వే ప్రకారం THE GREATEST INDIAN. భారత ప్రభుత్వం నుండి దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న అందుకున్నారు.

ఉన్నతమైన వ్యక్తిత్వం మనుషులలో చాలా అరుదు.. అంబేడ్కర్ తనకు జ్ఞాణాన్ని అందించిన, జన్మనిచ్చిన దేశానికి ఎంతొ ప్రేమను అందించాడు.. చనిపోయేంత వరకు కులం పేరుతో దూషిస్తున్నా కించపరుస్తున్నా కూడా దేశ పౌరులందరి ఉన్నతికి ఎంతగానో కృషి చేశారు..