భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశం. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా ఇంకా ఆ అభివృద్ధి చెందుతూనే ఉంది. పార్లమెంట్ లో జరగాల్సిన డిస్కషన్ లు వీధి చివర టీ కొట్టు పంచాయితీలను తలపిస్తున్నాయి. మనల్ని ఏలే వాళ్ళకి వేలెత్తి చూపలేక, మనం ఏదో ఒకటి చేసే ఓపిక లేక, ఎం చేయాలో తెలియక మార్పు ను మాటలకే పరిమితం చేసి, పరదేశానికి పయనమవుతున్నాం. ఎందుకు వెళ్తున్నావ్ అని అడిగితె ప్రతి ఒక్కరి దగ్గర ఒక సమాధానం ఉంది. "మన దేశం లో అవకాశాలు లేవు, ఉన్నా ఆ ఉద్యోగం రావాలి అంటే మనకున్న టాలెంట్ కంటే మనం పుట్టిన కులం చూస్తున్నారు. ఇక్కడ బ్రతకటం కంటే వేరే దేశానికీ పోవటం మంచిది. బానిస బ్రతుకు కూడా ఒక బ్రతుకే కదా!! డబ్బులు వస్తే చాలు" అని అంటున్నారు. ఇలా దేశాన్ని వదిలి పోతున్న ఎందరో యువకులారా ఇది నా చిన్న విన్నపం!
పోతుండారా పోతుండారా మార్పు తేవాల్సిన మీరే మారిపోయి పోతుండారా దారి చూపాల్సిన మీరే దారి తప్పి పోతుండారా తప్పు ఎత్తి చూపి మార్చలేక పోతున్నారా దేశ స్థితిని చూసి జాలి పడిన మీరే దీన్ని దుస్థితి ఇంతే అని అనాధగా వదిలి పోతుండారా
ఓ యువత ప్రాణం పోసిన తల్లిని బ్రతుకు నేర్పిన భూమిని అర్ధాంతరంగా వదిలి ఉన్నత చదువులు అంటూ పోతుండారా ఉత్తుత్తి మాటలు చెప్పి పరదేశానికి పోయి వాడి సేవ చేయండి
పోండి పోండి పోండి ఛీ తూ అంటూ వెక్కిరిస్తున్న తెల్లవారికే లాల్ సలాం అంటూ కొమ్ము కాయండి ప్రేమ ఆప్యాయతలు వదిలి డబ్బు ముసుగులో మునిగి తేలండి
ఇంటిని పట్టుకు కూర్చున్న మహానుభావులారా మా వాడు విదేశాలు పోయాడు అంటూ వాడ్ని ఎత్తేయండి గూగుల్ మైక్రోసాఫ్ట్ CEO మన వాడే అని గొప్పలు చెప్పుకోండి
కానీ చివరిగా మన దేశంలో ఉంది ఎందుకు పీకలేపోతున్నాం అని ప్రశ్నించుకోండి ..