Contributed by Yeswanth Chinni
తన కనుపాపలు నా చేత రాయించే ప్రేమ కవితలకు లేవు కదా ఎల్లలు తన ఘల్లు ఘల్లుమనే గజ్జెలు శబ్దం వినగానే చుట్టూ ఉన్న వారికి సైతం వినిపిస్తాయి నా యదసడులు
భూమికి ముద్దు పెట్టినట్టు వేసే తన అడుగులను అనుసరిస్తే దోవలు తెలుస్తాయి కొత్త బంగారు లోకాలకు ఎన్ని సంవత్సరాలు గడిచిన విడిపించుకోలేకపోతున్న మొదటి సారి తను నా పై విసిరిన చూపుల వలలు.
తను ఆకాశం లో జాబిల్లి అంత దూరంలో ఉన్న ఇంకా కునుకు తీసే కన్నులలో తన కలలు అమావాస్య రోజు ఆకాశం కోల్పోయిన సిరి వెన్నెల లాగా ఉన్న తను కనపడక
వసంతం వచ్చిన కోకిల గానాలు వినలేని అభాగ్యుడు మాదిరి ఉన్న తన గొంతు వినపడక తను నాతో ఉన్నప్పుడే జీవితాంతం ఆమె నవ్వులను నా పేరు మీద రాయించుకోవాల్సింది, అవి లేక నేను నేడు విలువ హీనం గనుక
తను లేక నా గుండె పై పడిన గాయలకి ఏ మందు పని చేయడం లేదు అవి మానడానికి నా నుదుటి పై నేను ఉన్నాను అని చెప్పే తన పెదవుల తడి కావాలని నాకు తెలుసు.