పెళ్ళైన 15రోజుల వరకు బాగానే ఉంది ఇక అప్పటినుండి మొదలైంది ఆమె భర్త వికృత చేష్టలు... భర్త ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండేవాడు, ఉదయం 11 గంటలకు నిద్రలేచేవాడు.. ఇవ్వేమి తనకు ఇబ్బంది కలిగించలేదు కాని అతను ఎంత సోమరి అంటే వాష్ రూమ్ కు వెళ్ళడానికి కూడా బద్దకించె వాడు పాలిథిన్ కవర్ లోనో వాటర్ బాటిల్ లోనో టాయిలెట్ చేసి మంచం కింద పెట్టుకునెవాడు. అతనికి అమ్మాయిల పిచ్చి ఎక్కువ భార్యతో శరీరకంగా కలిసినప్పుడు ఒక వేశ్యకు ఇచ్చినట్టుగా డబ్బులిచ్చెవాడు అదేంటి అంటే నీ శరీరానికి రేట్ ఇంతే అని రూ.100 విసిరేసేవాడు అప్పుడే తాను మనసికంగా చనిపోయింది. ప్రతి ఆడపిల్లకు పెళ్ళి అంటే ఎన్నో ఆశలు తన జీవిత భాగస్వామి అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఎన్నో కలలు.. కాని పగవారికి కూడా అలాంటి భర్త రాకూడదు అన్న వ్యక్తి తన జీవితంలోకి వచ్చాడు. మండలి నిహారిక.. కృష్ణ జిల్లా అవని గడ్డ స్వస్థలం. డిగ్రి చదువుతుండగా ఎంత చెప్పినా వినకుండా తల్లిదండ్రులు నిహారికకు పెళ్ళిచేశారు. ఏది చేసినా తనమంచి కొరకే అని నిహారిక అమ్మనాన్న మాటలు విని పెళ్ళికి ఒప్పుకుంది. పెళ్ళి తర్వాత కనపడింది ఆ భర్త అసలయిన వికృత రూపం.
శారీరకంగా మానసికంగా అత్యంత జుగుప్సకరంగా చిత్రహింసలు పెట్టెవాడు.. అత్తమామలు వారుంటున్న బెడ్ రూమ్ డోర్ దగ్గరే పడుకునెవారు ప్రతిరోజు వారు నైట్ మాట్లాడుకున్న మాటలను ఉదయం నిహారికతో సూటిపోటి మాటలతో వేదించెవారు. తన భాదలను ఇంట్లో చెబితే భాదపడతారని భాదల్లో ఉన్నగాని బాగున్నాననే ఫోన్ లో చెప్పేది. ఒకరోజు ఈ వేదింపులు తాళలేక నేయిల్ పాలిష్ తాగేసింది.. నిహారిక ఇంట్లో తెలియనియకుండా గుట్టుచప్పుడు కాకుండా హాస్పిటల్ ట్రీట్ మెంట్ ఇప్పించారు.. కనీసం ఆ సంఘటన నుండి అయినా పరిస్థితిలో మార్పు వస్తుందని నిహారికా ఆశించినా వేదింపులు చిత్రహింసలు ఎక్కువయ్యాయి. కనీసం కన్న తల్లికి సాటి ఆడపిల్లకు కూడా చెప్పలేని విధంగా ఆ భర్త, ఆ కుటుంబం నుండి గృహహింసను అనుభవించింది.. ఈ వేదింపులు భరించలేక పుట్టింటికి వెళ్ళి భోరుమంది.
తల్లిదండ్రులు తన పరిస్థితిని చూసి భాదపడ్డారు కాని... పిల్లలు పుడితె మారిపోతారు సర్ధుకుపోవాలని ఒదిలేస్తారు. అంతే తప్పా అల్లుడింటికి వెళ్ళి అతడిని నిలదీయాలి అని అనలేదు నిహారికకు ఇదంతా ఆశ్ఛర్యం కలిగింది తనకేం జరిగిన పేరెంట్స్ ఉన్నారనుకున్న ధైర్యం అంతా ఆ సంఘటనతో పోయింది. అప్పటికె తను రెండు నెలల గర్భవతి. పోని విడాకులు తీసుకుందామనుకుంటే పెళ్ళి అయ్యి కనీసం 5నెలలు కూడా కాపురం చేయలేక పోయింది అని సమాజం నుండి సూటిపోటి మాటాలుంటాయని తనకి తెలుసు.. బందువులలో 90% తన నిర్ణయాన్ని విమర్శించేవారే కాని తన భాదను ఎవ్వరు అర్ధం చేసుకునెవారు కాదు. భర్త ఫోన్ చేసి విపరీతంగా సభ్యత సంస్కారం లేని పదజాలంతో తిట్టెవాడు. ఇక మరణమే తనకు దిక్కు అని నిశ్చయించుకుంది ఒంటి మీద కిరోసిన్ పోసుకొని గంటన్నర పాటు ఆలోచించింది కాని నాకే కాదు రేపు పుట్టబోయె పాపకు కూడ ఇలాంటి కష్టాలే అనుభవించాల్సి వస్తుందని ఈ ఇక జీవించడం వ్యర్ధం అని నిప్పంటించుకుంది. తండ్రి వెంటనే నీళ్ళుపోశాడు.. ఆ సంఘటనలో తండ్రి ఒక మాట అన్నాడు "అయ్యో నా కూతురికి ఏమైంది" అని అనలేదు.. "అయ్యో నా పరువు పోయిందే" అని అన్నాడు... ఆ ఒక్క మాటతో నిహారికకు అర్ధం అయ్యింది దేశంలో ఆడవారి పరిస్థితి ఎలా ఉందో అని. హస్పిటల్ కు తీసుకువెళ్ళినా కాని అప్పటికే 55% శరీరం అంతా కాలిపోయింది. గర్భస్రావం జరిగి గర్భం పోయింది. మూడు రోజులు కోమాలో ఉండి కళ్ళు తెరిచాక నేనింక చనిపోలేదా? అనవసరంగా బతికాననిపించింది..
ఈ సంఘటన జరిగిన సంవత్సరం తరువాత భర్త తో విడాకులు తీసుకుని ఆ నరకం నుండి విముక్తిరాలయింది. విడాకుల తర్వాత చదువు కొనసాగించుతా అని నాన్నతో చెబితే 'నీకు స్పూన్ పట్టుకోవడమే రావట్లేదు ఇంకా పెన్ పట్టుకొని రాయగలవా అని అన్న మాటకు సంవత్సరం కష్టపడి ఒక పక్క రక్తం వస్తున్నా ఇంకోపక్క కాలిన చేతితో రాయడం నేర్చుకుంది. ఇప్పుడు పి.జి చదువుతుంది. ఒంటి మీద కాస్త వేడి నీరు పడితేనే తట్టుకోలేం అలాంటిది సగానికి పైగా శరీరం కాలిపోవడంతో తన భాద వర్ణనాతీతంగా ఉండేది. డా.లక్ష్మీ సలీం గారు తన పరిస్థితిని అర్ధం చేసుకుని అన్ని ప్లాస్టిక్ సర్జరీలను ఉచితంగా చేసింది. డా.హరికిరణ్ కూడా తనకు మానసికంగా స్పూర్తిని అందించెవారు ఇప్పుడు అతని క్లినిక్ లోనే పనిచేస్తుంది.
విపత్కర పరిస్థితులు దాటినప్పుడే ఉన్నత జీవితం ఉదయిస్తుంది అన్నట్టుగా తన జీవితం ఇక సమజానికే అంకితం ఇచ్చింది. తనలాంటి వాళ్ళు గృహ హింస, యాసిడ్ దాడులు, ఆత్మహత్యా భావనలు, కాలిన గాయాలతో భాదపడుతున్న వారందరికి బాసటగా నిలిచింది Burn Survivor Mission Trust అనే NGO సంస్థను ఏర్పాటుచేసి అగ్నిప్రమాదాాల వల్ల, యాసిడ్ దాడి వల్ల గాయపడిన బాధితులకు చికిత్సను…వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది…ఇప్పటికే పలు అవార్డులను అందుకుంది. దేశ విదేశాల్లో పర్యటిస్తూ.. అగ్రిప్రమాద బాధితులలో స్పూర్తిని నింపుతుంది. కాలిన గాయలకు బర్నాల్ రాసి నేను కూడా ఇలాంటి భాదనే అనుభవించాను తగ్గిపోతుందని భరోసా ఇస్తుంది. గృహహింస భాదితులకు డిప్రెషన్ లో ఉన్న వారందరికి తగిన కౌన్సిలింగ్ ఇస్తు వారిని మాములు మనుషులను చేస్తుంది. తన లక్ష్యం ఒక్కటే యాసిడ్ దాడులు కాలిన గాయాల వారికి ప్లాస్టిక్ సర్జరీ చాలా అవసరం కాని అది చాల ఖర్చుతో కూడుకున్నది పేద మధ్యతరగతి వారికి ఇది ఉచితంగా నిర్వహించే హస్పిటల్ స్తాపించి నిర్వహించడమే తన జీవిత లక్ష్యం..
త్రివిక్రమ్ శ్రీనివాస్ వ్రాతలో తనకి నచ్చిన సూక్తి.. యుద్ధంలో గెలవడమంటే శత్రువుని చంపడంకాదు మనం గెలవడం ఇలాగే తన జీవితం గెలవాలని మనస్పూర్తిగా కోరుకుందాం...






