మన ఫ్యామిలీ మెంబర్ ఐపోయిన పెట్ నీ ఎవరైనా పేరుతో కాక 'కుక్క' అని కసురుకుంటేనే కొంచెం కోపం వచ్చేస్తుంది, అది ఎదుటివారి మీద ద్వేషం అనే దాని కన్నా కూడా మన పెట్ మీద మనకున్న ప్రేమ కారణం కావచ్చు. Dogsని మనం ఎంత ప్రేమిస్తామో అంతకన్నా ఎక్కువ మనల్ని అవి ప్రేమిస్తాయి ఒక్కసారి జాలిగా భోజనం పెడితే చాలు ఎదైన సందర్భంలో వాటిని కొట్టినా గాని మళ్ళి పిలిస్తే అదంతా మర్చిపోయి తోక ఊపుకుంటు ప్రేమగా, గౌరవంగా మనదగ్గరికి వచ్చేస్తాయి. అంతలా మనల్ని ప్రేమించే వాటి బాధ్యత చూసుకోవాలని మనం తపిస్తుంటాం.
ఒక్కోసారి ఇంట్లో నుండి ఎక్కడికైనా వెళ్ళాల్సినప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది ఇంట్లో పెట్ ఒక్కదాన్ని ఉంచలేము దాని కోసం ఇంకో మనిషి ఉండాలి.. సరే మనతో పాటు దానిని తీసుకెళ్దామంటే బస్ లో, మామూలు క్యాబ్ సర్వీస్ లలో దానిని తీసుకురానివ్వరు ఇలా చాలా ఇబ్బందులు ఉంటాయి పెట్స్ ఉన్న ఇళ్ళల్లో.. ఇలాంటి రకరకాల సమస్యల కోసమే Unikorn(9100789222) పెట్స్ క్యాబ్ సర్వీస్ స్టార్ట్ చేసింది. మామూలు క్యాబ్ సర్వీసెస్ కన్నా ఈ క్యాబ్ చాలా తక్కువ ఇంకా ఫిక్సిడ్ చార్జ్ ఉంటుంది. నిజానికి ఈ సర్వీస్ ఫస్ట్ అమెరికాలో స్టార్ట్ ఐయ్యింది అక్కడ కూడా మన తెలుగు వారే స్టార్ట్ చేశారు అక్కడ మాంచి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. (ప్రస్తుతం కేవలం హైదరాబాద్ వరకే ఈ సర్వీస్ పరిమితం)