మన దేశం లోనే కాదు ఏ దేశం లో అయినా ఉండే ఏ ముజియం కి అయినా ఎందుకు అంత గొప్పదనం?
మన సాలార్ జంగ్ మ్యజియం కి ఎందుకు అంత సెక్యూరిటీ?
అంతరించి పోయే ప్రతిదీ వెళ్ళిపోయాక గొప్పదే అవుతుంది. వాటిలో ఒక్కదాన్నైన ఒడిసి పట్టుకున్నందుకు మన ముజియంస్ గొప్పవి.
ఇక్కడే నాకు మన గురూజీ అన్న మాటలు గుర్తొస్తాయి, ''చాలా మంది గొప్ప వాళ్ళు ఎక్కువ మందికి తెలియకుండానే వెళ్లిపోతు ఉంటారు'' అని. అలానే చాలా గొప్ప ప్రదేశాలు కూడా ..
అందులో ఉన్న దాంట్లో ఒకటి మన హైదరాబాద్ కేఫ్ లు.
Yes, మీరు విన్నది నిజమె.
ఇంకా వినాలంటే చదవాలంతే . . :)
ఈ కాఫీ డే లకి బారిస్ట లకి బాబు లు మన కేఫ్ లు . .
అలా ఒక పది రూపాయలు జేబులో పెట్టుకొని మీ ఇంటికి దగ్గరలో ఉన్న కేఫ్ లోకి వెళ్లి కూర్చోండి. చాలా అర్ధం అవుతయి.
కాఫీ డే లకి వెళ్ళే అప్పుడు ఉండే ''మేక్ అప్'' అవసరం లేకుండా
ఒక అంగి వేసుకొని జీవితాన్ని వెంట పెట్టేస్కోని వచ్చేస్తారు జనాలు మన కేఫ్ లకి.
అనవసరమైన ''FAKENESS'' ఉండదు.
ఉన్నదంతా అలవాటు తనమే.
ఎక్కువగా ఇది నడిపే వాళ్ళు 'మన' ముస్లిమ్సే. .
కానీ 'భాయ్' అని పిలవడం తప్ప వాళ్ళ పేర్లు కూడా తెలియదు.
రంజాన్ పండుగ కి కేఫ్ వెళ్తే
వాళ్ళ అత్తర్ పరిమళం లో మనల్ని ముంచి మూడు సార్లు కౌగిలించుకునే అంత అలవాటు ''ముభారఖ్'' ''ముభారఖ్'' ముభారఖ్'' అని..
గొప్ప చదువులు లేకున్నా ఆ స్వచ్చత లో ఉంది గా 'tolerant india' అని అనిపిస్తుంది.
అక్కడ పని చేసే వాళ్ళు పనికట్టుకొని కాళ్ళు గుంజేలా మోకాళ్ళు అరిగేలా
రోజు మొత్తం నిల్చునే 'రూల్స్' 'ప్రోటోకాల్స్' ఉండవు
'కస్టమర్స్-మర్యాద' అని.
మన పక్కన కుర్చుని 'అన్న. .' అని ముచ్చట చెప్పే అంత దగ్గరితనం.
క్రెడిట్ కార్డ్స్ పని చెయవు.
'నో క్రెడిట్స్' అని అంటించిన మాసిపోయిన కాగితం తప్ప.
డబ్బులు మర్చిపోయో పర్సు తీసుకరాకనో ఆ కాగితాన్ని చూపిస్తే ''నీకు భీ నా తమ్మి'' ఒక భోలా నవ్వు.
అదో నమ్మకం. మనోడే కదా అని ఫీలింగ్.
ఇది కాఫీ డే లో కొనుకుందాం అన్నా దొరకని ఫీలింగ్.
ఎక్కడ పుట్టాయో ఎట్లా వచ్చినయో తెల్వది కానీ..
ఊరు కుక్కలకి అనాధ పిల్లులకి మన కేఫ్ లు పుట్టినిల్లు కన్నా ఎక్కువ.
వాటికి అక్కడ మనుషులంటే భయం ఉండదు.
అవ్వి అక్కడే తిరుగుతున్నా మనకి తెలియదు దాని తోకనో కాలో మనకి తాకే దాంక.
చలి కాలం అయితే జుర్రుకుని తాగే ప్రతి చాయ్ చుక్కలో,
ఎండాకాలం అయితే ఉన్న నాలుగు కాళ్ళు లో కనీసం ఒక్క కాలైనా విరిగి ఉన్న అవిటి కుర్చీల్లో కుర్చుని పెరిగే ఎండను, మాడే మొహాల గురించి కామెంట్స్ చేస్తూ అక్కడే కూర్చుండి పొతము.
ఒక్క మాటలో అదొక ఎకో సిస్టం. మైక్రో కాప్సుల్ లో ఉన్న మన భారత్ దేశం.
దినం మొత్తం కౌంటర్ మీద కుర్చుని మనల్నే చూడడానికి ఎన్ని ఎన్ని గుండెలు కావాలి మన 'భాయ్' లకు
అంటే ఐ మీన్ ఎంత పెద్ద మనస్సు అని..
కానీ గమనిస్తే మనకి కేఫ్ లు ఉన్నందుకు అదృష్టవం అనుకొవలి.
ఎందుకంటే, ఉన్నవే తక్కువ .
అందుకేనా? అంటే, కనీసం ఇందుకు..
మనం చూసే క్రికెట్ మ్యాచ్ లు చేసే అల్లర్లు పెట్టె బాతాకాని లు అన్నిటి మధ్య ఎవరో ఒక పెద్దాయన ఛాయి తాగుతూ ఏకాంతంగా జీవితాన్ని నెమరు వేసుకుని వెళ్లిపోతు ఉంటడు.
మన ఆగమాగం లొల్లి ల డిస్టర్బ్ కాని ఆయన ఏకాంతము.
solitude prevails prevails 'here', few inches away from sexy conversations, undisturbed, unnoticed...
you rarely see a sight like this.
వాళ్ళని కదిలించి చుడండి బాస్.
కధలు , పాటాలు, అనుభవాలు . .ఇలా మీరు వినని చరిత్ర కేవలం పది రూపాయల చాయ్ మీద చెప్పెయగలరు..
long live cafe, chai, Charminar and our Hyderabad.
ps: హైదరాబాద్ లో ఉన్నందుకు లేకపోతే వచ్చినప్పుడైనా కనీసం ఒక్కసారన్న కేఫ్ లో చాయ్ తాగండి ఎందుకంటే..
అప్పుడే పుట్టిన ఎన్ని కలలకు
అప్పుడే దిగిన ఎంత మంది 'హీరో' లకు
మన సికింద్రాబాద్ ఆల్ఫా కేఫ్ ఇరానీ చాయి కాకపోతే వెల్కమ్ చెప్పింది ఎవరై ఉంటరు?