Staying Away From Home? Are You Calling Your Mom Regularly? - You Gotta Read This!

Updated on
Staying Away From Home? Are You Calling Your Mom Regularly? - You Gotta Read This!

ఇది నిజంగా జరిగిన సంఘటన......రోడ్డుమీద వెళుతున్న నన్ను ఓ తల్లి ఇలా పలకరించింది......

"ఈ ఫోనులో ఎలా మాట్లాడాలో కాస్త చెప్పమ్మా!" అంటూ.....

నేను ఆ ఫోనును నా చేతిలోకి తీసుకుని. "అమ్మా! ఈ ఫోనులోని ఆకుపచ్చ బటన్ను నొక్కితే కాల్ చేసినవారితో మాట్లాడవచ్చు.....ఎర్ర బటన్ను నొక్కితే కాల్ ఆగిపోతుందమ్మా!" అని చెప్పాను

దానికి ఆ తల్లి "ఈ ఫోనును నా కొడుకు కొనిచ్చాడమ్మా! వాడు విదేశాలలో ఉన్నాడు. నెలకు ఒకసారి నాతో మాట్లాడుతాడు..." అని ఎంతో సంతోషంగా చెప్పింది.

మళ్ళీ వెంటనేఇలా అడిగింది నన్ను..............."నాకొడుకు 2 నెలలుగా నాతో మాట్లాడలేదు.....ఒకసారి ఈ ఫోన్లో తను నాకు ఫోను చేశాడేమో కాస్తచెప్పమ్మా!" అంటూ తన కొడుకు పేరు చెప్పింది......

"అలాగే పెద్దమ్మా!" అంటూ ఫోనుని తీసుకుని చూశాను......ఏ కాల్ అందులో లేదు....నీ కొడుకు కాల్ చేయలేదు అని చెప్పడానికి మనసురాక.........ఇలా అబద్దం చెప్పాను.......

"అయ్యో! మీ కొడుకు కాల్ చేశాడమ్మా! కానీ నీవే తొందరలో పచ్చ బటను నొక్కబోయి ఎర్ర బటను నొక్కేసి ఉంటావు.........భలే దానివి పెద్దమ్మా! నీవు" అని చెప్పాను.

అప్పుడు ఆ తల్లి మొహంలో తన కొడుకు కాల్ చేశాడన్న ఆనందం.....మాట్లాడలేకపోయానే అన్న బాధ మిళితమైంది......."వాడికేమైనా అయిందేమో అని అన్నంకూడా సహించడంలేదమ్మా! చల్లని కబురు చెప్పావు" అంది ఆ తల్లి......

"ఇంతకీ ఈ రోజైనా కడుపునిండా అన్నం తిను పెద్దమ్మా! రేపు నీ కొడుకు నీ ముందుకొచ్చి నిలబడితే తనని గట్టిగా కౌగలించుకుని నీ సంతోషన్ని చూపాలంటే నీవు ఆరోగ్యంగా ఉండాలికదా!" అన్నాను నేను.......దానికి ఆ పెద్దమ్మ నీవు చెప్పింది నిజమే! ఖచ్చితంగా తింటా అంటూ ముందుకు వెళ్ళిపోయింది.......

తల్లికి దూరంగా వేరే ప్రాంతాలలో ఉన్న బిడ్డలెవరైనా సరే! దయచేసి మీ తల్లితో మాట్లా్డండి....

"అమ్మా" అన్న పిలుపుకోసం నీ కన్నతల్లి ఎదురుచూస్తుంటుందనీ గుర్తుంచుకోండి......

మీరు ఎంత పెద్దవారైనా మీరు తిన్నారా లేదా అని. కాల్ చేయకుంటే మీకేమైనా అయిందేమో అని తల్లడి్ల్లే మీ తల్లి ఉందని మరువకండి........మీరు ఎంత బిజీగా ఉన్నా సరే! తల్లితో రెండు నిమిషాలు మాట్లాడి చూడండి ఆమెకే కాదు మీరుకూడా ఎంత సంతోషంగా ఉంటారో ఓ సారి ఆలోచించండి......."అమ్మా!" అన్న పిలుపుకు మీరు దూరమై.....ఆ తల్లిని దూరంచేసుకోకండి......

ప్లీజ్........ప్లీజ్.....దయచేసి అమ్మకు కాల్ చేయడం మాత్రం మానకండి..........ప్లీజ్.........