కార్టూన్లు వెయ్యటం అంత తేలిక కాదు.. అదికూడా 27 ఏళ్లు నిర్విరామంగా అంటే అస్సలు తేలిక కాదు... కానీ కృష్ణ కిషోర్ వల్లూరి గారికి మాత్రం తేలికే.. ఎందుకంటే ఆయన కష్టపడి ఈ కార్టూన్లు గీయరు..! ఇష్టపడి గీస్తారు... నవ్విస్తూనే తన కార్టూన్లు సమాజంలోని అసమానతలను, అవకతవకలను ఎత్తి చూపిస్తాయని, చూపించాలని, వాటి ద్వారా కొంచెమైనా మార్పు రావాలని ఇంకా ఇష్టంగా గీస్తారు కృష్ణ కిషోర్ గారు.
1992 ఆంధ్రప్రభ వీక్లీ లో పబ్లిష్ అయిన మొదటి కార్టూన్ నుంచి తన కళా ప్రయాణం, నేటికీ 9000 పైచిలుకు కార్టూన్స్ మరియు 500 పైగా స్టోరీ illustrations, cover designs, logos తో విజయవంతంగా కొనసాగుతూ అందరి మన్ననలు పొందుతున్నది. అంతర్జాతీయ స్థాయిలో 5, జాతీయ స్థాయిలో 14, రాష్ట్ర స్థాయిలో 30 అవార్డులు.. ఇవి మన కృష్ణ గారి ప్రతిభకు వరించిన పురస్కారాలు. ఇక ఇంత కాలం విజయవంతంగా కార్టూనిస్ట్ గా కొనసాగటం, అసలు ఇంత ప్రతిభ వెనుక కారణం, మీ గురువు ఎవరు అని కృష్ణ గారిని అడిగితే ఆయన నవ్వుతూ చెప్పే సమాధానం.. ఇంకెవరు మా పెద్దనాన్న గారైన బాపు గారే అని...



































