గ్రామాలే ఈ దేశానికి పట్టుకొమ్మలు. రైతులు, వ్యవసాయమే ఈ దేశానికి వెన్నుముక అని అన్నారు మహాత్మ గాంధీ. నిజమే ఈరోజు మనం అనుభవిస్తున్న చాల సదుపాయాలు గ్రామాల నుండే వస్తున్నాయి. అసలు వ్యవసాయం అనేది లేకుంటే మనకు లైఫ్ అనేదె లేదు. భారతదేశానికి ఒక ఆత్మ లాంటి మన పల్లెటూరులను అభివృద్ధి పదంలో నడిపించటానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడి ప్రభుత్వం సంసద్ గ్రామ యోజన ప్రారంభించబడింది. నరేంద్రమోడి ప్రభుత్వానికి ముందే చాల మంది తమ గ్రామాలను తమకు తోచినంతగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు మోడి వారాణాసిలోని జయపూర అనే గ్రామం, క్రికేటర్ సచిన్ మన నెల్లూరు జిల్లా లోని పుట్టం రాజువారి కండ్రిక గ్రామాలను దత్తత తీసుకునే సరికి దేశ వ్యాప్తంగా, మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాతో మన తెలుగు రాష్ట్రాలలో గ్రామాల దత్తత అంశం మీద చాల మంచి ప్రచారం జరిగింది. ఒకరితో ఒకరు పోటిపడుతు తమ సోంతవూళ్ళనే కాకుండా వేరే ప్రాంతాలను అభివృద్ధి చేద్దామనుకునే వారి ఆశయం గొప్పది. ఇంకా మన ఆర్. నారాయణ మూర్తి 20 సంవత్సరాల క్రితం నుండే తనకు వచ్చిన లాభాలను తన సొంతూరుని బాగుచేయడంలో ఉపయోగిస్తున్నారు. శ్రీమంతుడు సినిమా కన్నా KCR గ్రామజ్యోతి కన్నా మన Real Star శ్రీహరి మరణించిన తన కూతురు స్మారకంగా అక్షర ఫౌండేషన్ ను స్థాపించి అనేక సేవ కార్యక్రమాలే కాకుండా మేడ్చల్ పరిధిలోని మూడు ప్రాంతాలను దత్తత తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేసి నిజంగానే రియాల్ స్టార్ అని అనిపించుకున్నారు.. రాజకీయ నాయకులకు ఖచ్చితంగా తమ సొంతూరుని ఇంకొక వేరే గ్రామాన్ని దత్తత తీసుకొవాలి అనే నియమం ఉంది.. మన తెలుగురాష్ట్రాలలోని గ్రామాలను దత్తత తీసుకున్న కొంత మంది ప్రముఖుల వివరాలు...
రతన్ టాటా: 264 గ్రామాలు విజయవాడ
మహేష్ బాబు: బుర్రిపాలెం, సిద్ధాపురం
చిరంజీవి: పేరుపాలేం, పశ్చిమ గోదావరి
మంచు విష్ణు: చిత్తూరు జిల్లాలోని 10 గ్రామాలు
DGP రాముడు: నార్శిం పల్లి, అనంతపురం
రవి కృష్ణ: కప్పట్రాళ్ళ, కర్నూలు
సచిన్ టెండుల్కర్: పుట్టం రాజు వారి కండ్రిగ, నెల్లురు
వివేక్ ఒబెరాయ్: ముత్వకుంట్ల పల్లి, అనంతపురం
ప్రకాష్ రాజ్: కొండరెడ్డి పల్లి, మహబూబ్ నగర్
ఏకే. ఖాన్: జుక్ఖల్, రంగారెడ్డి
శ్రీహరి: మేడ్చల్ పరిధిలోని మూడు ప్రాంతాలు
బ్రహ్మని: నారావారి పల్లి, చిత్తూరు