చక్రి డిగ్రీ చదివే రోజులు... కాలేజి వార్షికోత్సవ వేడుకలలో 'ఒకే జాతి మనదిరా ఒకే బాట మనదిరా అని చక్రి స్వయంగా రాసి ఆలపించిన గీతానికి ఆడిటోరియం అంతా కరతాల ధ్వనులతో మారుమోగి పోయింది చక్రి ప్రతిభకు ముగ్ధులైపోయిన తన స్నేహితులందరూ నువ్వు ఇక్కడ ఉండల్సిన వాడివి కాదురా నీ టాలెంట్ ఈ మారుమూల ప్రాంతానికి పరిమితం కాకుడదు నువ్వు సినిమాలలో ప్రయత్నలు మొదలు పెట్టు ఖచ్చితంగా ఇండస్ట్రీ గర్వించ దగ్గ సంగీత దర్శకుడివి అవుతావు అని ఎంతగానో ప్రోత్సహించారు కాని చక్రి వారి మాటలు పట్టించుకోలేదు ఏదో జోక్స్ చేస్తున్నారని విని వదిలేశాడు. చక్రి నాన్న టీచర్ ఖాళీ సమయంలో హరికథలు చెబుతుండేవారు, అమ్మ గృహిని అప్పుడప్పుడు పాటలు కూడ పాడుతుండేది ఈ కారణాల చేతనే చక్రికి సంగీతం పట్ల ఒక అభిరుచి, ప్రతిభ ఏర్పడింది వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలంలోని కంభాలపల్లి గ్రామం చక్రి స్వగ్రామం ఎం.కామ్ వరకు చదివారు. చక్రికి అందరిలా ఒకరి కింద ఏదో ఒక మాములు ఉద్యోగం చేయడమంటే నచ్చదు వ్యాపారం చేయడం అంటే ఇష్టం అల మొదట ఒక రెడిమేడ్ బట్టల దుకాణం ప్రారంభించాలని అనుకున్నాడు కాని కొన్ని అవంతరాల వల్ల రెడిమేడ్ షాప్ ప్రారంభించలేదు, ఇదే సమయంలో స్నేహితులు పట్టు పట్టటంతో అవకాశాల కోసం హైదరాబాద్ కు వచ్చాడు. ఎవరో సిని పరిశ్రమకు తెలిసిన వారు ఇక్కడ ఉన్నారని కాదు కేవలం హైదరాబాద్ లో పరిశ్రమ ఉంది అన్నఒకే ఒక్క ఆధారంతో మాత్రమే హైదరాబాద్కు చేరుకున్నాడు.
మొదట చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తు డబ్బులు అప్పుకు తీసుకొని "పండు వెన్నెల" అనే ప్రైవేట్ ఆల్బమ్ ఒకటి రూపొందించారు అది ఆశించినంతగా హిట్ కాలేదు అయినా కూడా నిరాశ చెందక ప్రయత్నమాపలేదు ఇలా మూడు ఏళ్ళలో 30 ఆల్బమ్స్ చేశారు. అలా ఆల్బమ్స్ చేస్తుండగా ఒకసారి మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ఆల్బమ్ చేసే అదృష్టం అవకాశం రూపంలొ వచ్చింది చక్రి చిరంజీవికి విరాభిమాని అవటంతో "చిరునవ్వు" అనే పేరుతొ వచ్చిన ఈ ఆల్బమ్ ని ప్రాణం పెట్టి పాటలను స్వయంగా తానే రాసి ఆలపించి కంపోజ్ చేశారు మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు సాక్షాత్తు చిరంజీవే ఆ పాటలు విని ప్రత్యేకంగా చక్రిని అభినందించారు. ఒక మిత్రుడి సహకారంతో పూరి జగన్నాథ్ జగపతి బాబు కంబినేషన్ లో వచ్చిన బాచీ సినిమాకు సంగీత దర్శకునిగా అవకాశం వచ్చింది 2000 సంవత్సరంలో బాచీ సినిమాతో మొదటి సారిగా తెలుగుతెర ద్వారా తెలుగువారికి తన సంగీతాన్ని అందించారు అలా ఏ సంగీత దర్శకుడి దగ్గర ఏళ్ళ తరబడి అసిస్టెంట్ గా పనిచేయకుండానే అవకాశం వచ్చింది కాని సినిమా ఫ్లాప్ అవ్వటంతో అవకాశాలు అంతగా రాలేదు. పూరిజగన్నాథ్ తీస్తున్న ఇట్లు శ్రావాణి సుబ్రమణ్యం సినిమాకు కూడా చక్రినే తీసుకుందామనుకున్నారు కాని అందుకు సహ నిర్మాతలు ససేమిరా వద్దని వారించారు పూరిజగన్నాథ్ చక్రిని వదలలేదు ఆ నిర్మతలనే పూరిజగన్నాథ్ ఒదిలాడు. పూరిజగన్నాథ్ చక్రిలది సూపర్ హిట్ కాంబినేషన్. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, దేశముదురు, నేనింతె, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి ఇలా వీరిద్దరు దాదాపు 10చిత్రాలకు కలిసి పనిచేశారు. 85 చిత్రాలకు సంగీతాన్ని అందించిన చక్రి గాయకునిగా 150కి పైగా పాటలు పాడారు.
సింహ సినిమాకు వెనుముక లాంటి సంగీతాన్నిఅందించి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ సంగీత దర్శకునిగా గౌరవ నందిని అందుకున్నారు. వంశి, కృష్ణవంశి, వి.వి. వినాయక్, పూరి జగన్నాథ్, వై.వి.యస్ చౌదరి, బి. గోపాల్, శ్రీను వైట్ల, ఎన్.శంకర్ ఇలా పని చేసిన ప్రతి ఒక్కరి సినిమాలకు అద్భుతమైన పాటలను అందించి చిరస్థాయిగా నిలిచారు. చక్రి తండ్రి వెంకటనారాయణకు దేశభక్తి, దైవభక్తి ఎక్కువ. ఆ విషయంలో కూడా తండ్రికి తగ్గ తనయుడిగా చక్రి తన పుట్టిన రోజైన 'జూన్ 15 'ను వివిధ సేవాకార్యక్రమాలతో జరుపుకునేవారు. రక్తదానాలు, అన్నదానాలు, పండ్ల పంపిణీ ఇలా ఆ రోజు అంతా సేవా కార్యక్రమాలతొ ఆనందంగా గడిపేవారు. జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అంటు మన నుండి దూరంగా వెళ్ళిపోయిన చక్రి గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం
1. రా రమ్మని.. (ఔను వాల్లిద్దరు ఇష్టపడ్డారు)
2. మళ్ళి కూయవే గువ్వా.. (ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం)
3. నిన్నే నిన్నే.. (దేశముదురు)
4. I am In Love (సత్యం)
5. చెలియా చెలియా (ఇడియట్)
6. Madhurame (satyam)
7. మోనా మోనా (శివమణి)
8. నువ్వక్కడుంటె (గోపి గోపిక గోదావరి)
9. బంగారు కొండ (సింహ)
10. జై బోలో తెలంగాణ (జై బోలో తెలంగాణ)
11. నీవే నీవే (అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి)
12. Everybody (చుక్కల్లో చంద్రుడు)
13. కృష్ణానగరే మామ(నేనింతె)
14. వెన్నెల్లొ హయ్ హయ్ (ఔను వాల్లిద్దరు ఇష్టపడ్డారు)
15. ఒకే ఒక మాట (చక్రం)
16. జగమంత కుటుంబం (చక్రం)