11 Lamest 'Cheema Jokes' That We All Cracked When We Were In 6th Class

Updated on
11 Lamest 'Cheema Jokes' That We All Cracked When We Were In 6th Class

కొన్ని జోక్స్ కొంతమందికి నవ్వు తెప్పిస్తుంది.. మరికొంతమందికి అసలిది జోకేనా అని అనిపిస్తుంటుంది. "అసలిది జోకేనా" అన్న Feeling లోనూ హాస్యాన్ని లాగొచ్చు.. చీమ ఏనుగు జోక్స్ కూడా ఇలాంటి Categoryలోకే వస్తాయి. రండి చూద్దాం కొన్ని..

1.

చీమ: బ్రదరూ నాకో హెల్ప్ కావాలి.. ఏనుగు: నీకంటేనా చెప్పు ఏం కావాలి..? చీమ: 2 రోజులు కొంచెం ని చెడ్డి ఇస్తావా... ఏనుగు: హ్హా.. హ్హా.. హ్హా.. వేసుకుంటవా ఏంటి? చీమ: కాదు బ్రదరూ .. మా బిడ్డ పెండ్లి ఉంది, కొంచెం పెండ్లి మండపం వెయ్యాలి అందుకే.

2.

చీమ, ఏనుగు గాఢంగా ప్రేమించుకుంటాయి. కాని పాపం చీమ వాళ్ళింట్లో పెళ్ళికి ఒప్పుకోరు.! అప్పుడు ఏ ఆడ చీమ బహిరంగంగా చెప్పుకోలేని విషయాన్ని ఏ దాపరికం లేకుండా చెప్పేస్తుంది. అలా చెప్పగానే మరోమాట లేకుండా చీమ పెళ్ళికి ఒప్పుకున్నారు.. ఏం చెప్పిందో తెలుసా.. "ఏనుగు ప్రతిరూపం నా కడుపులో పెరుగుతుంది".

3.

చెట్టు మీద నుండి కిందపడిన విరగ్గాసిన మామిడి పండును 3 చీమలు కలిసి తింటుంటాయి. అటుగా వచ్చే ఏనుగు మామిడి పండుని చూస్తుంది. తొండంతో మామిడిపండును అమాంతం నోట్లో వేసుకుని, అదే చెట్టుకింద గుర్రుపెట్టి పడుకుంటుంది. తాము తింటున్న పండును దొంగిలించినందుకు ఏనుగు మీద రెండు చీమలు కోపంగా ఉన్నాయి పగ తీర్చుకోవాలని ఇదే అదనుగా ప్లాన్ వేస్తున్నాయి. మొదటి చీమ: నేను దాన్ని చంపేస్తా!! రెండో చీమ: నేను దాని కాళ్ళు చేతులు విరగ్గొడుతా.! మూడో చీమ: అబ్బా వదిలేయండే పాపం ఒక్కడే ఉన్నాడు.

4.

ఏనుగు రోడ్డు మీద ఒంటరిగా వెళ్తుంటే ఒక రోడ్ రోలర్ వచ్చి అమాంతం గుద్దేస్తుంది. ఏనుగును హుటాహుటిగా హాస్పిటల్ కు తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ మొదలుపెడతారు. 24 గంటల తర్వాత ఏనుగు కళ్ళుతెరుస్తుంది. పక్కనే ఉన్న డాక్టర్ కు ఏనుగు థాంక్స్ చెబుతుంది. అప్పుడు డాక్టర్ చెప్పిన మాటలకు ఏనుగు పడుకున్న బెడ్ విరిగిపోయేలా ఏడుస్తుంది.. "థాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, నీ ప్రెండ్ కు చెప్పాలి. ఎందుకంటే చీమనే నీకు బ్లడ్ ఇచ్చి రక్షించింది".

5.

చీమ: నీ వయసెంత.? ఏనుగు: జస్ట్ 5Years చీమ: ఓహ్!! ఇంత చిన్న వయసులోనే బాగా పెరిగిపోయావ్ కదా. ఏనుగు: అవును!! ఎందుకంటే నేను Complan Boy!! మరి ని ఏజ్ ఎంత.? చీమ: 40Years! ఏనుగు: అవునా.. ఐనా కాని నువ్వు పెళ్లికాని అమ్మాయ్ లా ఉన్నావ్ తెలుసా.. చీమ: అవును.. ఎందుకంటే నేను 20 years నుండి సంతూర్ సోప్ వాడుతున్నా గా.. (మమ్మీ... అంటూ చిట్టి చీమ పరిగెత్తుకుంటూ వచ్చేసింది)

6.

ఏనుగు: I Love You.. చీమ: ఛీ!! సిగ్గులేదా.. ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి నీకు.. "మా ఇంట్లో "Inter Size" మ్యారేజేస్ కు అస్సలు ఒప్పుకోరు.. దయచేసి నన్ను మర్చిపో".

7.

రెండు గున్న ఏనుగులు దాగుడుమూతలాట ఆడుకుంటున్నాయి. ఒక ఏనుగు కళ్ళు మూసుకుని "పిల్లి వచ్చే.. ఎలుక భద్రం.. దా...క్కో సాంబార్ బుడ్డి" అని అంటుండగానే ఏనుగు చెంగు చెంగుమని పరిగెత్తుతుంది. దానికి ఎక్కడ దాక్కోవాలో అర్ధం కాలేదు. అటుగా వస్తున్న చీమను అడగడానికి వెళ్ళింది. చీమ: ఓసి పిచ్చి మొహమా.. నీకు బాడీ ఎదిగింది కాని బ్రెయిన్ పెరగలేదు! ఎక్కడో ఎందుకు!! రా.. నా వెనుక దాక్కో!!

8.

బ్రిడ్జ్ మీద నిల్చుని ఏనుగు చీమ కబుర్లు చెప్పుకుంటున్నారు.. చీమ చెప్పిన జోక్ కి ఒకేసారి ఏనుగు పగలబడి నవ్వేసరికి చీమ బ్రిడ్జ్ మీద నుండి నీళ్ళల్లోకి పడిపోయింది. పట్టుకోకుండానే ఏనుగు కాపాడగలిగింది తెలుసా.. ఆలస్యం చెయ్యకుండా ఏనుగు కూడా దూకేసేసరికి నీళ్ళన్నీ బయటకు వచ్చేశాయి.. ఆ నీళ్ళల్లో చీమ కూడా ఉంది.

9.

(నది ఒడ్డున ఏనుగు ఒంటరిగా కూర్చుని ఏడుస్తుంది) చీమ: ఎమోయ్ ఏంటి అలా ఎదుస్తున్నావ్.? నీ ఏడుపుకు నది పెరిగి వరదలొచ్చేలా ఉన్నయ్!! ఏనుగు: (ఏడుస్తూ..) నా చెప్పులు నీ చీమ ప్రెండ్ దొంగిలించాడు.. అదేమని అడిగితే "నీ చెవులు కట్ చేసుకుని చెప్పులు కుట్టించుకోరా బెవకూఫ్" అని తిట్టాడు(బావురుమంటూ..)

10.

ప్రేమికులైన చీమ ఏనుగు స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేస్తున్నారు. గంట తరువాత ఏనుగు బయటకు వచ్చి "పద వెళ్ళిపోదాం ఇప్పటికే చాలా లేట్ అయ్యింది త్వరగా వచ్చేయ్" చీమ: (సిగ్గు పడుతూ)నా స్విమ్ సూట్ చినిగిపోయింది.. ఇందాక స్విమ్ చేస్తుంటే అది కూడా నీటిలో కొట్టుకుపోయింది. ఏనుగు: వోసోసి దీనికే సిగ్గుపడుతున్నావా.. ఇందా నావి వేసుకో అని "స్విమ్ సూట్ విప్పేసి చీమ మీదకు విసిరేసింది".

11.

చీమలు అన్ని కలిసి ఒకసారి సైకిల్ రేస్ లో పాల్గొన్నాయి.. అనుకోకుండా రోడ్ మద్యలో ఏనుగు నడ్చుకుంటా వెళుతుంది. అప్పుడు అందులోని ఒక చీమ సడన్ గా బ్రేక్ వేసి, అరిచేస్తూ.. ఆబే ఓ చస్తావా ఏంటి.. ఇంట్లో చెప్పి వచ్చావా వెళ్తున్న అని..