20 Common Games We All Played In Our Childhood That Will Take You Back In Time!

Updated on
20 Common Games We All Played In Our Childhood That Will Take You Back In Time!

అవి టెక్నాలజీ మనుషుల్ని పూర్తిగా వశ పరుచుకోని రోజులు. 4 అయితే చుట్టూ పక్కల పిల్లలు అందరు కలిసి కొత్త కొత్త ఆటలు ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అరుగులు మీద అమ్మ వాళ్ళు అందరు కూర్చుని మనల్ని ఒక కంట కనిపెడుతూ, ఇరుగు పొరుగు వారితో ముచ్చట్లలో మునిగిపోయేవారు. మేడపైన అమ్మమ్మలు వడియాలు ఆరపెడుతూ వాటిని దొంగతనంగా తినటానికి వచ్చే చింటూ గాడికి చివాట్లు పెడుతుండేవారు. అలనాటి రోజుల్లని మరలా గుర్తుచేస్తూ చిన్నతనం లో మనం ఆడుకున్న ఆటలు కొన్ని మీకోసం.

1. గుడు గుడు గుంజం గుండె రాగం పాముల పట్నం పడిగే రాగం చిన్న చిన్న గుర్రం, చిందులు తొక్కే పెద్దన్న గుర్రం, పెళ్ళికి పోయే నీ గుర్రం నీళ్ళకి పోయే నా గుర్రం పాలకు పోయే గుడు గుడు గుంజం గుండె రాగం పాముల పట్నం పడిగే రాగం

2. ఒప్పులకుప్పా వయ్యరి భామ

3. ఉయ్యాలా జంపాల

4. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి - ఇలా అక్క అడగగానే మనకి తోచిన పేర్లు ఏవేవో చెప్పేవాళ్ళం గుర్తుందా?? దాగుడుమూతా దండాకోర్ పిల్లీ వచ్చే ఎలుకా భధ్రం ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ సాంబార్ బుడ్డి - ఇలా అనగానే అందరం పరార్ !!

5. ఏడు పెంకులు

6. గోళీలు

7. అంత్యాక్షరి - 'ఫ' తో పాటలు ఇప్పటికి కూడా ఏమి రాలేదు అనుకుంట కదూ!

8. NAME-PLACE-ANIMAL-THING : అమ్మ వాళ్ళు ఎండ ఎక్కువగా ఉంది ఇంట్లో కూర్చో అన్నపుడు, క్లాస్ లో మనకి ఏమి తోచనప్పుడు ఎన్ని సార్లు ఆడి ఉంటామో!!

9. అష్టాచెమ్మ - అమ్మమ్మ వాళ్లతో కలిసి ఎన్ని సార్లు ఆడి ఉంటామో !!

10. వైకుంఠపాళి - 98 దగ్గర ఉండే పాము ఎన్ని సార్లు కాటు వేసి కిందకి తెచ్చిందో మనల్ని!

11. తొక్కుడు బిళ్ళ - అమ్మాయిలు ఇప్పటికి ఈ ఆటని మరచిపోయి ఉండరు. అప్పట్లో సిమెంట్ రోడ్ల మీద బాక్స్ లు గీసి తెగ ఆడేసేవాళ్ళు.

12. కర్రా బిళ్ళ - ఎన్ని ? 20 అంత ఉండదు కానీ 15 అయితే కోలుసుకో వాడు సగం కొలిసిన తర్వాత సరే 15 తీసుకుంటాం. ఇలా ఎన్ని సార్లు ఎంత మందిని కొలిపించి పైశాచికానందం పొందామో!!

13. అచ్చెం గిల్లలు

14. బొంగరం

15. కోతి కొమ్మచ్చి- ఎన్ని సార్లు చెట్లు ఎక్కి కాళ్ళు ఇరగొట్టుకున్నామో

16. కళ్ళ గంతలు

17. బొమ్మా ప్రాణం : అవుట్ అయినా వాళ్ళకి ప్రాణం ఇవ్వటానికి దొంగకి దొరకకుండా మనం చాలా ప్లాన్ లు వేసే వాళ్ళం. కొన్ని సార్లు తొండి ఆడుతూ అవుట్ అయినా వాడికి కావాలని దొంగ పక్కనే ఉన్న మళ్ళీ ప్రాణం ఇచ్చి మరి అవుట్ చేసే వాళ్ళం !

18. Musical Chairs : కుర్చీ కోసం కుమ్ములాటల్లో ఎన్ని కుర్చీలు విరిగిపోయాయో !

19. ఒంగుడు దూకుడు- మోకాళ్ళ చిప్పల మీద మరిచిపోలేని గురుతులు మిగిల్చింది దెబ్బ తగిలినా ఆగుతామా అంటే లేదు..దూకు నా సామిరంగా.. దూకు !!

20. Brick Game - టెక్నాలజీ మన జీవితాల్లోకి ప్రవేశించేందుకు చేసిన మొదటి ప్రయత్నం "వీడియో గేమ్" కూర్చొని గంటల తరబడి ఆడే వాళ్ళం

ఇవే కాదు, చిన్నపుడు ఇంకా చాలానే ఆడేవాళ్ళం వీధుల్లో ఆడే గల్లీ క్రికెట్ నుండి స్కూల్ లో ఆడించే లెమన్ and స్పూన్ దాకా ఎన్నో ఆటలు ఆడుకునే వాళ్ళం. ఈ కాలం పిల్లలు ఎన్ని మిస్ అవుతున్నారో !!