10 Nostalgic Childhood Acha Telugu Rhymes That'll Take You Back In Time

Updated on
10 Nostalgic Childhood Acha Telugu Rhymes That'll Take You Back In Time

Telugu, Tamil, Hindi, Malayalam, English, Bhojpuri Ila language bedham lekunda nachina song ni nachinattu noru terisi singuthunnam ippudu. But mana pillathanam lo ? abbe! aa Songs and Rhymes roote separatu...yenthaina appati mana filla thananiki filla patalaku ippati feddha thanam feddha patalu yekkada saripothayandi... Hey ! konni rhymes & songs mee mind playlist lo play avuthunnai kadhaa... Avi ivena..? konchem sudandi...

1. ఒప్పులకుప్ప - వయ్యారి భామా ! సన్న పప్పు - చాయ బియ్యం చిన్న మువ్వ - సన్న గాజు గూట్లో రూపాయ్ - నీ మొగుడు సిపాయ్

2. చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే కోటి వేలు తేవె బండెక్కి రావే బంతిపూలు తేవె నట్టింట పెట్టవే మా అమ్మాయికివ్వవె

3. కాళ్ల గజ్జి కాంకాలమ్మ వేగు చుక్క వెలగ మొగ్గ మొగ్గ కాదు మోటినీరు నీరు కాదు నిమ్మల వాయ వాయ కాదు వావింటి కూర కూర గాదు గుమ్మిడి కాయ కాయ కాదు పాపాయి కాలు కాలు తీసి గట్టున పెట్టు

4. గుడి గుడి గుంజం గుళ్ళో రాగం పాముల పట్నం పడగా రాగం కత్తైన ? బద్ధైన ? వెన్నిళ్లా ? చన్నిళ్లా ?

5. ఏనుగు ఏనుగు నల్లన ఏనుగు కొమ్ములు తెల్లన ఏనుగు మీదా రాముడు ఎంతో చక్కని దేముడూ!

6. దాగుడు మూత దండాకోర్ ఎక్కడ దొంగలక్కడే పిల్లి వచ్చే ఎలకా దాక్కో గప్ చుప్ దొంగకు జుట్టిచి మూలను కొలపోసి అబ్బాయికి పాలిచ్చి ఆడుకుని వద్దాం

7. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుగట్టి దండన తావీదు సరి గజ్జ మువ్వలు చేరి కొలుతు నిన్ను చిన్న కృష్ణా !

8. వాన వాన వల్లప్ప వాకలి తిరుగు చెల్లప్ప తిరుగు తిరుగు చెల్లప్ప తిరుగలేనూ చెల్లప్ప అన్నము తిను చెల్లప్ప ఆకలి లేదు చెల్లప్ప విసురూ విసురూ చెల్లప్ప విసర లేను చెల్లప్ప

9. తప్పట్లోయ్ తాళలోయ్ దేవుడి గుడిలో బాజలోయ్ పండ్లు ఫలము దేవుని కోయ్ పాలూ ఉగ్గు పాపాయి కోయ్ !

10. చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అట్లు పోయెంగ ఆరగించంగా ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులేయంగ రత్నాల చెమ్మ చెక్క రంగు లేయంగ పగడాల చెమ్మ చెక్క పందిరేయంగ పందిట్లో అమ్మాయి పెళ్ళి చేయంగ