సమోసా అంటే ఆలు సమోసానో, ఆనియన్ సమోసానో ఉంటుంది కాని స్వీట్ సమోసా ఏంటి అని అనుకుని ఉండవచ్చు ఒకేరకమైన టేస్ట్ తో తయారుచేసే వారికి ఓకేరకమైన గుర్తింపు వస్తుంది ఏదైనా డిఫ్రెంట్ గా చేస్తేనే కదా ప్రత్యేకత. ప్రకాశం జిల్లాకు చెందిన మునీర్ భాయ్ గారు ప్రత్యేకంగా స్వీట్ సమోసాను తయారుచేస్తూ ప్రకాశం జిల్లాలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాలలోను మాంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
తెలుగువారికి మాత్రమే కాదు భారతదేశమంతట సమోసాకు అభిమానులున్నారు.. కొన్ని ప్రాంతాలను మినహా దాదాపు ప్రతి ప్రాంతంలోను సమోస దొరుకుతుంది.. షేక్ మున్నీర్ గారు దాదాపుగా 30సంవత్సరాల నుండి రుచికరమైన సమోసాలను తయారుచేస్తున్నారు. మొదట వ్యాపారం బాగా జరిగినా కాని తర్వాతి కాలంలో పోటి ఎక్కువగా పెరిగిపోతుండంతో మనకంటూ ఏదైనా ప్రత్యేకంగా చెయ్యాలనిపించి ఈ స్వీట్ సమోసా తయారుచేయడం ప్రారంభించారు. ప్రారంభంలో ఇదేం సమోసారాబాబు అని ఎగతాళి చేసినవారే తరువాత ఎగబడి మరి కొనుగోలు చేశారు.
స్వీట్ సమోసా తయారుచేద్దామని అనుకున్నప్పుడు ఎన్నో ప్రయోగాలు చేశారు కాని అవి ఏ మాత్రమూ సంతృప్తినివ్వలేదు. ముందు మనకు విపరీతంగా నచ్చితేనే కదా కస్టమర్స్ కి నచ్చేది అని చెప్పి ఎక్కడా కంప్రమైజ్ కాకుండా సమోసాలో జీడిపప్పును, బెల్లంపాకంను రంగరించారు కట్ చేస్తే పెద్ద సక్సెస్. ఎంత సక్సెస్ సాధించినా గాని ఇప్పటికి ఒక తోపుడు బండి మీదనే వ్యాపారం సాగిస్తారు.. తన ప్రత్యేకమైన స్వీట్ సమోసా తయారుచేసే విధానం మిగిలినవారికి తెలిసిపోతుందేమోనని పనివాళ్ళను తన దగ్గర పనిలోకి పెట్టకుండా తనే చేస్తుంటారు. అదే బండి నుండి అమెరికా, జర్మనీ లాంటి దేశాలకు ఎగుమతి చేస్తుంటారు.