80,90 దశకం లో సినిమా తెర మీద చిరంజీవి విలన్ ని కొడుతుంటే, వాళ్ళు కొడుతున్నంత ఉత్సాహా పడిపోయేవాళ్లు చూసే జనాలు. డాన్స్ చేస్తుంటే హోరెత్తిపోయేది, అలాంటి చిరంజీవి చేసిన భిన్నమైన సినిమా లలో మొదట గా చెప్పుకోవలసినది విజేత సినిమా గురించి.
ఖైదీ తో సంచలనం సృష్టించిన చిరంజీవి కి ఆ తరువాత చేసిన చాలా సినిమాల వల్ల యాక్షన్ హీరో గా పేరొచ్చింది. చిరంజీవి సినిమా అంటే, యాక్షన్ అని గట్టిగా ఫిక్స్ అయిపోయారు. క్లైమాక్స్ లో విల్లన్ ని చిత్తుచిత్తు గా కొట్టే చిరంజీవి కి అలవాటైపోయారు. అలాంటి సమయం లో వచ్చిన సినిమా "విజేత"
ఈ సినిమా లో చిరంజీవి మనలాంటి ఒక సాధారణ అబ్బాయి మాత్రమే. ఈ సినిమాలో క్లైమాక్స్ ఫైట్ ఉండదు, పంచ్ డైలాగ్స్ ఉండవు. వరుసగా యాక్షన్ సినిమాలు తీసిన చిరంజీవి, ఇలాంటి ఒక సినిమా తీయడం మొదటి సారి. కాబట్టి ప్రేక్షకులను ఉద్దేశించి ఈ సినిమా ఎలా ఉండబోతోందో వివరిస్తూ, చిరంజీవి ఓ వీడియో చేశారు. ఈ సినిమా మొదలవ్వక ముందు వస్తుంది అది.
ప్రేక్షక మాహాశయులకు, అభిమానులకు నా నమస్కారం. ఇప్పుడు మీరు చూడబోతున్న ఈ విజేత చిత్రంలోని నా పాత్ర గురించి రెండే రెండు ముక్కలు చెప్పదలచుకున్నాను. ఇప్పటివరకు నన్ను ఎన్నో యాక్షన్ చిత్రాల్లో మీ ఆవేశాలకు, ఆగ్రహాలకు, ఉత్సహాలకు ప్రతినిధి అయినా Angry Youngman గా నన్ను ఆదరించారు, అభిమానించారు, ఉత్సాహపరిచారు. అందుకు మీ అందరికి నా ధన్యవాదాలు. ఇప్పుడు మీరు చూడబోతున్న ఈ చిత్రం లోని నా చిన్నబాబు పాత్ర, ఈ మధ్య నేను ధరించిన అన్ని పాత్రల కంటే భిన్నంగా ఉంటుంది. ఈ పాత్ర, మీ ఊర్లో, మీ పక్కింట్లో, ఎదిరింట్లో, మీ ఇంట్లో కనిపించే ఒక సామాన్య యువకుడి జీవితానికి ప్రతిరూపం. నా నుండి వెరైటీ కావాలని కోరుకునే ప్రేక్షక అభిమానుల ఉత్తమ అభిరుచికి చక్కని సమాధానం ఈ విజేత. ఇటువంటి చిత్రాలని మీరు ఆదరిస్తే, నేను మరెన్నో కొత్త తరహా పాత్రలు పోషించడానికి ఉత్సాహాన్ని, ప్రోత్సహాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇస్తారని ఆసిస్తూ.. సెలవు..
సినిమా కూడా చాలా బాగుంటుంది. చిరంజీవి పాత్ర ని చూస్తే మనల్ని మనం చూసుకుంటున్నట్టు ఉంటుంది. సినిమా ముందు ఈ వీడియో రావడం వల్ల చిరంజీవి మీద కన్న, చిరంజీవి పోషించిన చిన్నబాబు పాత్ర మీద focus పెట్టారు చూసే ప్రేక్షకులు.
మనం చేసే పని మీద మనకో అవగాహన ఉన్నప్పుడు ఆ అవగాహనని అర్ధం అయ్యేలా మన చుట్టూ ఉన్నవాళ్లకి చెపితే వాళ్ళు కూడా అది స్వాగతిస్తారు అని చెప్పడానికి ఈ వీడియో ఈ సినిమా ఒక ఉదాహరణ.