చిత్రాస్త్ర.. సినీ సంగీత జగత్తులో తమవంటూ కొన్ని పాటలు నిక్షిప్తమైపోవాలని కలలుకనే కొంతమంది ఔత్సాహిక కళాకారుల వేదిక. సౌండ్, పిక్చరైజేషన్, సింగర్స్ లోని టాలెంట్ ఇలా ప్రతిఒక్కదానిలో క్వాలిటీని మేళవించి దాదాపు మూడు సంవత్సరాలుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. 'సాయి చరణ్ భాస్కరుని, గణేష్ క్రొవ్విడి, ఎక్ నాథ్ కిరణ్, కృష్ణ తేజస్వి, ప్రకాష్ చోడిమల్ల, షణయ్ షా, నవీన్' మొదలైన అద్భుతమైన సింగర్స్ ఇందులో పాడుతున్నారు. Music Instrumentalists గా సింజిత్ ఎర్రమిల్లి, V4 బ్యాండ్, శ్రావణ్, నరెన్ మొదలైన యంగస్టర్స్ Instruments Play చేస్తున్నారు.
ఒక్కసారి ఈ ఛానెల్ ను ఓపెన్ చేస్తే అది వెంటనే మనల్ని బయటకు రానివ్వలేదు, అంతటి నిజాయితీ, తీవ్రత దీనిసొంతం. ప్రేక్షకులకు వినసొంపైన సంగీతమే కాదు అందులోని ఆర్టిస్టులకు కూడా అవకాశాలు ఇప్పించగలిగే స్థాయి ఉన్న చిత్రాస్త్ర ను నయనేశ్ మరియు లోహిత్ ఇద్దరూ కలిసి ప్రారంభించారు. మూడు సంవత్సరాల ప్రయాణంలో వారి అనుభావాలు, ఆలోచనలు ఈ చిన్ని ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకుందాం.
వీలుంటే ఇంటర్వ్యూ లోకి వెళ్లేముందు ఈ ఒక్క పాట చూసి వెళ్ళండి, చిత్రాస్త్రలోని ప్రత్యేకత తెలుస్తుంది.
1. రవి అని నా ఫ్రెండ్ మీ యూట్యూబ్ ఛానెల్ లింక్ పంపించాడు, నేను వెంటనే బయటకు రాలేకపోయాను. నిజాయితీ, క్వాలిటీ, ఒక తపన ప్రస్ఫుటంగా కనిపించాయి. బహుశా ఇలాంటి కాంప్లిమెంట్స్ మీకు చాలా వచ్చే ఉంటాయి. మీ దృష్టిలో ప్రేక్షకులకు ఛానెల్ ఇంత నచ్చడానికి గల కారణాలు ఏవి.? చిత్రాస్త్ర: మా దగ్గరకు వచ్చిన సింగర్స్, ఆర్టిస్ట్స్ కు మేము చాలా పెద్ద అభిమానులం. ఆ అభిమానం మా వర్క్ లో కనపడడం వల్ల మా ఛానెల్ ప్రేక్షకులకు నచ్చిందని మా అభిప్రాయం. మాకు తెలిసిన మ్యూజిషియన్స్ లో అతికొద్ది మందితో చేసిన ఎక్స్పరిమెంట్ యే మా ఛానెల్.

2. పాడుతా తీయగా ప్రోగ్రామ్ గాయకులను తయారుచేసే కర్మాగారం ఐతే మీది 100% ఇండస్ట్రీకి గాయకులను ఇచ్చే కర్మాగారం అని నా అభిప్రాయం. ఒక సింగర్ మీ ఛానెల్ లో పాడించడానికి ఎలా ఎంపిక చేస్తారు. చిత్రాస్త్ర: చిన్నప్పటి నుండి మ్యూజిక్ పై ఆసక్తి వల్ల, అలాగే తెలుగు మ్యూజిక్ ను అన్ని ప్లాట్ ఫార్మ్స్ పై బాగా ఫాలో అవుతూ మా నెట్ వర్క్ లో తెలుగు సంగీతం చేస్తున్న ప్రతి ఒక్కరినీ కాంట్రాక్ట్ అవుతూ, వాళ్ళతో కొలబరేట్ అవ్వడం జరిగింది. ఈ ప్రయాణంలో మా తపన తగ్గట్టుగానే గొప్ప గాయకులను కలుసుకోగలుగుతున్నాం.

3. ఇప్పటివరకు పాడిన గాయకులలో ఎవరికి ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చే అవకాశం ఉందని మీ అభిప్రాయం.? ఎవరికైనా ఇప్పటికే పిలుపు వచ్చిందా.? చిత్రాస్త్ర: మా వాళ్లందరికీ సినిమాలలో పాడగలిగే టాలెంట్ ఉంది అని మా నమ్మకం. మా వాళ్ళు Perform చేస్తుంటే ఎంతోమంది సినిమా స్టార్స్, మ్యూజిక్ కంపోజర్స్ వచ్చి ఎంజాయ్ చేసిన రోజులు ఉన్నాయి. ఒక్కరూ అని ప్రత్యేకంగా చెప్పలేము. పాడిన ప్రతిఒక్క సింగర్ కు ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి.

4. కేవలం గాయకులు అనే కాకుండా మ్యూజిక్ ప్లే చేసే Instrumentalists కూడా కొత్తవారే, ఐన అద్భుతమైన టాలెంట్ కనిపిస్తుంది. అసలు వారిని ఎలా ఎంపిక చేసుకోగలిగారు.? చిత్రాస్త్ర: సంగీతంలోని గొప్పతనం ఏంటి అంటే గురు శిష్య పరంపర అనేది అందులో ఇంకా బ్రతికే ఉంది. అందరికి అందరూ తెలుసు, ఇలా మాకు తెలిసిన ఆర్టిస్ట్స్ కు వాళ్లకు తెలిసిన ఆర్టిస్ట్స్ కు, అలా అలా వెతుక్కుంటూ వెళ్లిపోయాము. ఆ సెర్చ్ లో ఎంతోమంది హిడెన్ జెర్మ్స్ ఉన్నారని మాకు తెలిసింది. అలాంటి వజ్రాలను ఎంపికచేసుకోగలిగాము. అలాగే ఇలాంటి వారు కోసం ఇప్పుడు ఒక వెబ్సైట్ నిర్మిస్తున్నాం. ఎవరు ఐనా ఆర్టిస్ట్స్ వచ్చి వల్ల డిటైల్స్, వల్ల వర్క్ అప్ లోడ్ చెయ్యొచ్చు, మేము వల్ల వర్క్ చూసి కాంటాక్ట్ అవుతాం. దీనివల్ల ఇండస్ట్రీకి ఎంతోమంది యంగ్ టాలెంటెడ్ పీపుల్ రాబోతున్నారు.

5. ఇండస్ట్రీలో టాలెంట్ ని చూసికాక ఒక్కోసారి పర్సనల్ ఇంట్రెస్ట్ తో అవకాశాలు ఇస్తారని విన్నాను, ఈ జబ్బు మ్యూజిక్ రంగానికి కూడా పాకిందా.? చిత్రాస్త్ర: ఆ జబ్బు ఏ ఇండస్ట్రీలో ఐనా కామన్. కానీ అలా వచ్చిన వాళ్లకు కూడా టాలెంట్ ఉండి తీరాలి. టాలెంట్ ఉన్నవాళ్లకు ఎప్పటికైనా ఎలా అయిన అవకాశం వస్తుంది. కాకపోతే మా ఈ చిన్న ప్రయత్నం వల్ల మా ఆర్టిస్ట్స్ కు కొంచెం త్వరగా అవకాశం రావాలనేది మా ఆశ.

6. ఒకప్పుడు సింగర్ గా అవకాశం రావాలంటే ఆడియో క్యాసెట్ పట్టుకుని స్టూడియోల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, మన దగ్గర టాలెంట్ ఉంటే వెతుక్కుని మరి వస్తున్నారు. ఈ పరిస్థితి ఎంత వరకు ఉపయోగపడుతుందని మీ అభిప్రాయం.? చిత్రాస్త్ర: టెక్నాలజీ రావడం వల్ల ఎంతోమంది ఆర్టిస్ట్స్ కు వాళ్ళ టాలెంట్ ను చూపించే అవకాశం దొరికింది. దానికి Best Example Encore Lockdown edition, మనుషులు పక్కన లేకుండా కూడా అద్భుతమైన పాటలు చెయ్యగలరు అని మా వాళ్ళు నిరూపించారు.
7. చిత్రాస్త్ర ప్రారంభించడానికి గల కారణాలు.? దీనిని ఎవరెవరు రన్ చేస్తున్నారు.? ఈ ఛానెల్ యొక్క లక్ష్యాలు ఏంటి.? చిత్రాస్త్ర: నేను, లోహిత్ దీనిని రన్ చేస్తున్నాం. నేను(నయనేశ్) చదుకున్నది BTech, PGP in Media & Enertainment. లోహిత్ వచ్చేసి BTech, PGDM in Digital Marketing & Strategy పూర్తిచేసాడు. Encore music show అనేది మా డ్రీమ్ ప్రాజెక్ట్. స్కూల్ డేస్ నుండి ఎన్నోసార్లు మ్యూజిక్ లో ఏదైనా చెయ్యాలి అని డిస్కస్ చేసుకునేవాళ్ళం. సంగీత కుటుంబంలో పుట్టిపెరిగిన నాకు(నయనేశ్) ఎప్పటినుండో ఈ తపన సహజంగానే వచ్చింది. కానీ ఎలా చేయాలో తెలియదు, నేను లోహిత్ కలిసి ఎంతోమందిని కలిసాం. అలా ఆ జర్నీలో మేము తెలుసుకున్న మెయిన్ పాయింట్ 'తెలుగు మ్యూజిక్ అనేది సినిమాలకే పరిమితం అవ్వడం వల్ల మ్యూజిషియన్స్ కు వల్ల సొంత మ్యూజిక్ ను ప్రదర్శించే అవకాశాలు కలగడం చాలా అరుదు'. తెలుగు ఒరిజినల్ మ్యూజిక్ కు ప్రేక్షకుల ఆదరణ రావాలంటే ప్రేక్షకులకు ఆర్టిస్ట్స్ తెలియాలి. వాళ్ళ టాలెంట్ చూపించడానికి ఒక ప్లాట్ ఫార్మ్ ఉండాలని Encore music show అనేది స్టార్ట్ చెయ్యడం జరిగింది. అలా మొదలైన మా జర్నీ ఎంతోమంది గొప్ప వ్యక్తులను పరిచయం చేసింది. ఎన్నో నేర్పించింది, అలా ఎంతోమందిని ఒప్పిస్తూ 3 సీజన్స్ దాకా తీయగలిగాము.
You Can Visit Chitraastra: https://www.youtube.com/channel/UCV9OfggAucOXNME5jowZKSg