Everything You Need To Know About Chittoor's Boyakonda Gangamma Temple!

Updated on
Everything You Need To Know About Chittoor's Boyakonda Gangamma Temple!

ఒక్కసారి చిత్తూరు జిల్లాలో అడుగుపెడితే ఎన్నో మహిమాన్విత పుణ్యక్షేత్రాలు మనకు దర్శనమిస్తుంటాయి.. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ భక్తులు దర్శించే తిరుపతి, శక్తివంతమైన కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయం, శ్రీకాళహస్తి ఇలాంటి దేవాలయాలతో చిత్తూరు జిల్లా కొలువై ఉన్నది. చిత్తూరు జిల్లాలో ఉన్న మరో గొప్ప దేవాలయాలలో ఒకటి బోయకొండ గంగమ్మ దేవాలయం.

bgfb

500 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం నిర్మించారని స్థల పురాణం. గోల్కొండ నవాబుల సైన్యం దాడులకు దిగడంతో ఇక్కడి అమాయక ప్రజలు ఇదే బోయకొండకు తరలివెళ్ళి నివాసం ఏర్పరుచుకున్నారు. కాల క్రమంగా ఇక్కడ కరువు సంభవించడంతో ఆ జగన్మాతను ప్రజలు కన్నీటితో వేడుకున్నారు. మరుసటి రోజు దాదాపు 80 సంవత్సరాల ఒక వృద్దురాలు ఆ ప్రాంతానికి చేరుకుంది, కొన్నిరోజులకే ఆ అమ్మ అక్కడి వారికి ఆత్మీయురాలైంది. ఆ వృద్ధురాలిలో ప్రేమ, నిర్మలత్వం తాండవించడంతో అందరు తమ కన్న తల్లిలా ఆ వృద్ధురాలిని స్వీకరించారు.

boyyakonda-gangamma-temple12

కొన్నాళ్ళకు ఆ అమ్మ కనిపించక పోవడంతో చుట్టు ప్రక్కల ప్రాంతాలలో వెతకడం ప్రారంభించారు. అలా వెతకగా ఒక ఉయ్యాల మీద ఊగుతు కనిపించడంతో దగ్గరికి వెళ్ళి పరిశీలించగా సాక్షాత్తు దేవతగా దర్శనమిచ్చింది. భక్తుల కోరిక మేరకు గోల్కొండ శత్రు సైన్యాన్ని వీరోచితంగా హతమార్చి, తన కనుచూపు శక్తితో నిత్యం ప్రవహించే నీటికొలను సృష్టించిందని చరిత్ర. ఆ తర్వాత ప్రజల కోరిక మేరకు అమ్మ అక్కడే ప్రతిమ రూపంలో ఉండిపోయింది. ఆ విధంగా అమ్మవారిని బోయకొండ గంగమ్మగా పూజించడం ప్రారంభమయ్యింది.

drgrwe

మిగిలిన కోవెలలో భక్తల కోరికలు భగవంతుడు నెరవేరుస్తాడో లేదో తెలియడానికి అనుకున్నది జరిగేంత వరకు వేచిచూడాల్సిన పరిస్థితి.. కాని ఇక్కడ మాత్రం అలా కాదు. భక్తుల మనసులో ఉన్న కోరిక నిజమవుతుందో లేదో ఒక చిన్న పరీక్ష ద్వారా వెంటనే తెలిసిపోతుంది. భక్తులు అమ్మవారి విగ్రహ శిరస్సు మీద మూడు పూలను పెడతారు. ఆ తర్వాత కళ్ళు మూసుకుని భక్తితో తమ కోరికలను విన్న వించుకుంటారు. శిరస్సుపై పెట్టిన పూలల్లో ఏ ఒక్కటి పడకుంటే ఆ కోరిక నెరవేరదని, మూడు పూలల్లో ఏదైనా ఒకటి కుడివైపు పడితే ఆ కోరిక నెరవేరుతుందని, ఎడమ వైపు పడితే కాస్త ఆలస్యంగానైనా కోరిక నెరవేరుతుందని భక్తుల ప్రగాడ నమ్మకం. అత్యంత అరుదుగా ఉండే మహిమ గల దేవాలయం ఇది. కేవలం దేవాలయ దర్శనం కొరకు మాత్రమే కాకుండా ఇక్కడి ప్రకృతి రమణీయతను చూడటానికి కూడా భక్తులు వివిధ రాష్ట్రాల నుండి విచ్చేస్తారు.

Image Source: GoTirupati.com

Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.