"శ్రీకాలహస్తి" ఇది మామూలు శైవక్షేత్రం కాదు బ్రహ్మ పరమేశ్వరుడిని పూజించిన క్షేత్రం.. బ్రహ్మకు ముక్తిని ప్రసాదించిన క్షేత్రం.. భూలోక కైలాసంగా దక్షిణ కాశిగా పూజలందుకుంటున్న క్షేత్రం ఈ శ్రీకాలహస్తి దేవాలయం. కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయానికి 60కిలోమీటర్ల దూరంలో చిత్తూరు జిల్లాలో ఈ పవిత్ర కోవెల కలదు.

ఆ శివుడు కేవలం మనుషులకు మాత్రమే కాదు సకల జీవులకు ముక్తిని ప్రసాదించగలడు.. అందుకు ఉదాహరణగా ఇక్కడ సాలేపురుగు, పాము, ఏనుగులను అలాగే అనుగ్రహించాడు. ఈ గుడిని యుగానికి ఒక పేరుగా పిలిచారు కృతయుగంలో బ్రహ్మబ్రమణి, త్రేతాయుగంలో విష్ణుపురం, ద్వాపరియుగంలో నారధపురం, కలియుగంలో వరుణపురం/ శ్రీకాలహస్తిగా పిలిచేవారు. శ్రీకాలహస్తికి దామర్ల వంశం, పల్లవరాజులు, చోళరాజులు, శ్రీకృష్ణదేవరాయులు రాజులుగా ఉండేవారు ఆ కాలంలోనే చిన్నగా ఉన్న ఈ గుడిని అప్పటి పరిస్థులకు అనుగూణంగా మర్పులు చేశారు. ఇక్కడి పవిత్రత మూలంగా పూర్వం ఎంతోమంది మహర్షులు ఈ గుడిలో తపస్సు చేశారు.

భగీరధుడు గంగను భూమి మీదకు తీసుకువచ్చినట్టు గా అగస్త్య మహర్షి సువర్ణమణి నదిని శ్రీకాలహస్తికి తీసుకువచ్చారు ఈ దివ్య నీటితోనే ఇక్కడ శివ పార్వతులకు పూజలు అభిషేకాలు జరుగుతాయి. ఇక్కడ పార్వతి దేవి జ్ఞాణప్రసూనంభగా దర్శనమిస్తుంది. త్రేతాయుగానికి చెందిన ఒక పాము పాతాళం నుండి మణి అనే వజ్రాలను తీసుకువచ్చి శివుడుని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించేది అప్పుడు ఒక ఏనుగు పాము తెచ్చిన మణులను ప్రక్కకు తొలగించి బిల్వ పత్రాలతో పూజలు చేసేది ఆ తర్వాత ఆ పత్రాలను పాము తొలగించి పాము మణులను తీసుకొచ్చి శివుడిని సేవించేది ఇలా ఒకదానితో ఒకటి పోటి పడేవి.. అలా వారి మధ్య జరిగిన గొడవలతో ఆ పోరాటంలో ఒకదాని ప్రాణం ఇంకొకటి తీయడంతో రెండు చనిపోయి శివుడిలో ఐక్యం అయ్యాయి. ఒక సాలేపురుగు నిత్యం నిర్మించే దారాల గూడు గాలికి చెదిరిపోయినా మళ్ళి నిర్మించేది అలా నిర్మించడంలో ప్రాణాలు కోల్పోయిన సాలేపురుగు కూడా శివుడులోకి ఐక్యం అయ్యింది. అందుకే ఇక్కడి స్వయంభూ దగ్గరిగా సాలేపురుగు పాము, ఏనుగు ప్రతిమలుంటాయి.

కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తుండేవాడు . అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటినుండి నెత్తురు కార్చాడట. వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి కంటికి అమర్చాడట. అప్పుడు స్వామి రెండవకంటి నుండి కూడ నెత్తురు కారటం మొదలయింది. భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవకన్ను కూడా పీకి స్వామికి అమర్చాడు. స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తి ప్రసాదించాడు. శ్రీకాలహస్తి పరమేశ్వరుడిని దర్శిస్తే సర్పదోశాలు పోతాయని భక్తుల నమ్మకం. ఈ కోవెలను సర్వపాప పరిహార క్షేత్రంగా పిలుస్తారు. ఇక్కడ పాము ఆకరంలో ఉన్న రాహుకేతువులను పూజించడం ద్వారా సకలదోషలు తొలగిపోతాయి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.