Contributed By Masch Indra
తండ్రి : అరేయ్ ఏంట్రా ఇది..?
అబ్బాయి : సిగరెట్ నాన్న, పేరు టోటల్. తెలీదా..?
"ఛా.. నేను అంత తెల్లగా ఉంటే బలపాల కొత్త మోడల్ అనుకున్నాన్లే. మా వాడు చిన్నపిల్లోడు కదా రోజు తినే అలవాటు ఉందేమో అనుకున్న...!?"
(కొద్దిసేపు ఆగి)
తండ్రి : ఎన్నాళ్ల నుంచి..?
" వన్ మంత్ నుండి నాన్న ".
" హో అయితే రీసెంట్ గానే అలవాటు అయ్యిందన్న మాట సంతోషం. రోజుకేన్ని తాగుతావ్..? "
" రెండు "
" హా రెండు పాకెట్లా..? "
"కాదు నాన్న రెండు, పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి".
" అబ్బా ప్రణాళిక బాగా వేసావురా. పొద్దున్న టీ కి ఒకటి సాయంత్రం టీ కి ఒకటి.
అయినా ఎందుకు అలవాటయ్యింది, ఎవరైనా అలవాటు చేయించారా? "
"టెన్సన్స్ ".
" అబ్బోఓ.. టెన్సన్స్సు ....దేనికి నాన్న అవునులే పొద్దున్నే లేసిన కాడ నుంచి ఎదో ఒక పని సేసి పెళ్ళాం పిల్లల్ని, తల్లితండ్రిని సాకూతున్నావ్ కదా ఉంటాయి లే.
10 కి లేస్తావ్ పనికిమాలిన ఫ్రెండ్స్ దగ్గరికి బైక్ ఏస్కోని పోతావ్. టీ సిగరెట్టు కబుర్లు. ఏమైనా అంటే మనకి ఉండేది ఒకే లైఫ్ రా ఇప్పుడు కాకపోతే ఎప్పుడు లైఫ్ ఎంజాయ్ చేసేది అంటావ్ ఊరూరు ట్రిప్పులని, ట్రెక్కింగ్ లని పోతావ్. మళ్ళీ రాత్రెప్పుడో పది కి అందరు పడుకున్నాక వస్తావ్. పాపం మీ అమ్మ ఏ దరిద్రాన నిన్ను కన్నదో నీ కోసం నువ్వొచ్చేదాకా నీకోసం ఎదురుచూస్తూ ఉంటది.వస్తావ్, అన్నం పెట్టుద్ది తింటావ్ బెడ్ మీద పడ్తావ్. మరి ఇన్ని చేయాలంటే టెన్షన్ ఉండదు. అందుకే సిగరెట్లు, బీర్లు అలవాటైతాయ్.
" అది కాదు నాన్న "
" ఛీ ఛీ నోర్ముయ్. మళ్ళీ రెండు తాగుతా అని నాకే చెప్తావ్ రా నువ్వు, సిగ్గు లజ్జ ఉండక్కర్లే. అవునులే భవిష్యత్తు అంటేనే భయం లేని వానికి తండ్రి అంటే లెక్కేముంటుంది ".
నాన్న.. సారీ నాన్న....
నాకేం భవిష్యత్తు అంటే బాధ్యత లేక కాదు మీరంటే లెక్క లేక కాదు. ఏంచేయాలో తెలియట్లేదు నాన్న.
నేనేం రోజు ట్రిపులంటూ షికార్లు చెయ్యట్లేదు నాన్న, జాబ్ కోసం ట్రై చేస్తున్న. కానీ మధ్యలో నాకిష్టమైన పని చేసి నేను సుఖంగా ఉంటూ మిమ్మల్ని బాగా చూసుకోవాలా లేక ఇష్టంలేకపోయినా కష్టమైన సరే ఇష్టం లేని పని చేస్తూ మిమ్మల్ని బాగా చూసుకోవాలో అర్థం కావట్లేదు నాన్న.
ఇదంతా ఎవరితో చెప్పుకావాలో, ఎవరితో చెప్తే సమస్య తీరుతుందో తెలియట్లా.మీతో చెప్పు కుందామంటే మీరెప్పుడు
చదువు చదువు అన్నారే తప్ప నా ఇంటరెస్ట్ ఏంటో కనుక్కొన్నారా. ఎలా తెలుస్తుంది..?
నేను ఇంట్లో ఉన్నంత సేపు రే పాల ప్యాకెట్ తాపో, మైదా పిండి తాపో ఇదే సరిపోయే.
ఎప్పుడైనా పక్కన కూర్చొని నీ ప్రాబ్లెమ్ ఏంటి ఎందుకు నీకు జాబ్ రావట్లేదు అని ప్రేమగా అడిగారా..?
నేనెప్పుడైనా డల్ గా కనిపిస్తే ఎందుకని ఆరా తీసారా..?
ఎంతసేపు కొడుకు డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించాలి అనే తప్ప మా మనసు గురించి ఆలోచించరే.
ఒక్క అమ్మాయి దిగులుగా ఉందంటే ఎందుకు, ఏమిటి అని వంద రకాలుగా ఆలోచించే మీరు అబ్బాయిల విషయంలో ఎందుకని ఆలోచించరు.ప్రేమగా మాట్లాడారు.
పక్కింట్లో ధీరజ్ వాళ్ళ నాన్న చూడు కొడుక్కి ఏదిష్టమో కనుక్కొని అందులో చేర్చారు ఇప్పుడు వాడు లక్షలు సంపాదిస్తున్నాడు.
ఈ ఏజ్ లో ఎదురుదెబ్బలు మీకు తెలియనివా నాన్న.
డబ్బు కోసం నేనెప్పుడూ మీరు తలదించే పని చెయ్యలేదు అంటే దానికి కారణం మీ పెంపకమే
మీ పెంపకంలో తప్పు లేదు నాన్న,
మీ కొడుకుని మీరు సరిగా అర్థం చేసుకోకపోవడంలో ఉంది.
కాసేపు నిశ్శబ్దం తర్వాత
తండ్రి : " ( బయటకి వెళ్తూ తలుపు దగ్గర ఆగి ) నిన్ను పెంచి పెద్ద చేసి తండ్రి గా గెలిచాను అనుకున్నాను కానీ బిడ్డల్ని అర్థం చేసుకోవడంలోనే తల్లిదండ్రులు గెలుస్తారంటే అలాగే కానీ.
మాకోసం నువ్వు త్యాగాలు ఏం చేయక్కర్లేదు. నీకిష్టమైన పని ఎదో ప్రయత్నించు. రాకపోతే అప్పుడు..
వస్తుందిలే నా కొడుకు మీద ఆ మాత్రం నమ్మకం ఉంది.
ఏదైనా చేసిన శ్రద్ధతో చెయ్ సిగ్గరేట్ కాల్చినట్టు సగం సగం చేయకు. పూర్తిగా తాగి ఏడు. మళ్ళీ ఎక్కువ తాగామక కొన్నాళ్ళ తర్వాత మానెయ్.