ఎక్కడో కారంచేడు లో పుట్టిన రామానాయుడు గారు సినిమాల మీద ప్రేమతో మద్రాస్ చేరి,అడుగులో అడుగు వేస్తూ సరిగ్గా ఇదే రోజున తన మొదటి చిత్రం రాముడు భీముడు తో అఖండ విజయాన్ని సాధించి , తెలుగు హిందీ, కన్నడ,తమి, బెంగాలీ,మరాఠి,పంజాబీ వంటి భాషల్లో ఎన్నో చిత్రాలని నిర్మించి సురేష్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ కి ఒక బ్రాండ్ వేల్యూ తీసుకొచ్చారు మూవీ మొఘల్ రామానాయుడు గారు . అగ్ర కథానాయకులతోనే కాకుండా,చిత్ర పరిశ్రమకి నూతన నటీనటుల్ని దర్శకులని పరిచయం చేస్తున్న చిన్న సినిమాలకి సైతం వెన్ను తట్టి ప్రోత్సహిస్తుంది సురేష్ ప్రొడక్షన్స్ .
సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణం లో వొచ్చిన రాముడు భీముడు విడుదలై ఇవాళ్టితో 53 సంవత్సరాలు. ఈ ఐదు దశాబ్దాలలో ఎన్నో అద్భుతమైన చిత్రాలని మనకి అందించారు. వాటిల్లోంచి కొన్ని ఆణిముత్యాలు ఓసారి చూద్దాం .
1.రాముడు భీముడు
2. శ్రీ కృష్ణతులాభారం
3. ప్రేమ్ నగర్
4. జీవన తరంగాలు
5. అగ్ని పూలు
6. ఆహ నా పెళ్ళంటా
7. ఇంద్రుడు చంద్రుడు
8. ప్రేమ
9.బొబ్బిలి రాజా
10. గణేష్
11. ధర్మ చక్రం
12. కూలి నం.1
13. ప్రేమించు
14. కలిసుందాం రా
15.మల్లీశ్వరి