మన తెలుగు దిగ్దర్శకులలో వంశీ గారిది విభిన్న శైలి,గోదారి అందాలను ఆయన చూపించినంత అందంగా ఇంకెవరూ చూపించలేరేమో,బాపుగారి సినిమాల తరువాత వంశీగారి సినిమాలలో కథానాయికలు అచ్చ తెలుగు ఆడ పిల్లలా అందంగా కనిపిస్తారు. ఆయన సినిమాలలో సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. వినసొంపైన సంగీతం,సాహిత్యాల కలబోత,ఆయన సినిమాలలో నుండి కొన్ని అజరామరమైన పాటలు ఓసారి వినండి , పున్నమి వెన్నెల్లో గోదారి ఇసుక తెన్నెల్లో విహరిస్తున్న అనుభూతి కలుగుతుంది
1. ఆ కనులలో - ఆలాపన
2. ఏకాంత వేళ - అన్వేషణ
3. ప్రేమ యాత్రలకు - డిటెక్టివ్ నారద
4. కిన్నెరసాని వచ్చిందమ్మో - సితార
4.జిలిబిలి పలుకులు - సితార
5. గోపీ లోల - లేడీస్ టైలర్
6. మాటరాని మౌనమిది - మహర్షి
7. సుమం ప్రతి సుమం - మహర్షి
8. చుక్కలు తెమ్మన్నా - ఏప్రిల్ 1 విడుదల
9. ఎక్కడికి నీ పరుగు
10. వెన్నెల్లో హాయ్ హాయ్ - ఔను,వాళ్లిదరు ఇష్టపడ్డారు
11. ప్రతీ క్షణం నీ దర్శనం - అనుమానాస్పదం
12. నువ్వక్కడుండి నేనిక్కడుంటే - గోపి గోపిక గోదావరి
Bonus ఇప్పటివరకు మనసుకి హాయిని కలిగించే పాటలు చూసారు,ఈ పాట మాత్రం ఓ ఉత్తేజాన్ని రగిలించేది,అద్భుతమైన సాహిత్యంతో గొప్ప ప్రేరణనిస్తుంది 13. సాహసం నా పదం – మహర్షి