Unable To Carry 'Clay Pot' Water? These People Made Eco Friendly Clay Bottles!

Updated on
Unable To Carry 'Clay Pot' Water? These People Made Eco Friendly Clay Bottles!

ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ భూమిలో కరగడానికి వందలు, వేల సంవత్సరాలు పడుతుంది. అలాగే ఇందులో Bisphenol A లాంటి హానికర పదార్ధం ఉండడంతో వీటిలో ఎక్కువ రోజులు గర్భిణీ స్ర్తీలు తాగడం వల్ల పిల్లలు లోపాలతో పుట్టే అవకాశం ఉంటుంది మిగిలిన వారి ఆరోగ్యాలకు ఇది ఎంతమాత్రమూ మంచిది కాదని రుజువయ్యింది. ప్లాస్టిక్ వల్ల అటు ప్రకృతికి ఇటు మానవాళికి కూడా అపాయకరమని ఇప్పుడు తెలుసుకున్నట్టు ఉన్నారు. మళ్ళీ మన పాత తరానికి చక్రం తిరిగింది.

సాధారణ బాటిల్ లో తాగడం కన్నా మట్టి కుండలు, బాటిల్ లో తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది, అలాగే Testosterone లెవల్స్ ను సాధారణ స్థాయిలో ఉండేలా కృషిచేస్తుంది. అదే ప్లాస్టిక్ బాటిల్ నీరు మాత్రం ఈ స్థాయిని తగ్గిస్తుంది. మట్టి కుండలలోని రుచి మరెక్కడా ఉండదు వాటిలోని నీటిని తాగితేనే దాహం తీరినట్టుగా అనిపిస్తుంది. మట్టికుండలను ప్రతి చోటుకు తీసుకెళ్ళడం చాలా కష్టం అందుకనే చిన్నపాటి మట్టి వాటర్ బాటిళ్ళను మన హైదరాబాద్ కేంద్రంగా కొన్ని సంస్థలు తయారుచేస్తున్నాయి.

రాబోయేది ఎండాకాలం అది కూడా ఈసారి ఎండలు విజృంబించే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పేసింది. ఈ సమయంలో మరింత చల్లని నీటిని తీసుకోవడం వల్ల వాటిని ఒకేసారి మన శరీరం తట్టుకోలేదు. ఒక్కోసారి త్వరగా మన శరీర ఉష్ణోగ్రత తగ్గినా ఇబ్బందులు ఎదురవుతాయి. వీటిలో నీళ్ళు పోసిన 30 నిమిషాలలోనే చల్లబడిపోతాయి. మరీ చల్లదనంగా కాకుండా సుమారుగా 14 సెంటిగ్రెడ్ చల్లదనంగా ఉండడంతో అటు ఎక్కువగా కాకుండా ఇటు తక్కువగా కాకుండా మధ్యస్థంగా ఉంటూ దాహాన్ని తీరుస్తున్నాయి.

ఈ బాటిళ్ళను బంక మట్టి(క్లే) తో తయారుచేస్తారు. వీటి ధర సాధారణ కాస్ట్లీ బాటిల్స్ కన్నా సగానికి సగం తక్కువ.. కేవలం రూ.150 నుండి రూ. 200 మధ్యలో ఒక లీటర్, రెండు లీటర్లు, ఐదు, పది లీటర్ల సామర్ధ్యం గల బాటిళ్ళను, క్యాన్ల తయారుచేస్తున్నారు. నీటిని మట్టి కుండలలో, మట్టి బాటిళ్ళల్లో పోయడం వల్ల ఒక వేళ నీటిలో ఏమైనా హానికర బాక్టీరియా లాంటిదేమైనా ఉంటే మట్టి దానిని గ్రహించి స్వచ్ఛమైన మంచి నీటిని మనకందిస్తుంది. వీటిలో మరో స్పెషాలిటీ ఏంటంటే ట్రెండ్ కి తగ్గట్టుగా అందంగా ఉండడం. రొటీన్ ప్లాస్టిక్ బాటిళ్ళను పట్టుకెళ్ళడం కన్నా మట్టి బాటిళ్ళను ఉపయోగించడంతో ఒక డిఫ్రెంట్ లుక్ వచ్చేస్తుంది

If you want to get get these 'Clay Bottles', you can contact Nagarjuna (LB Nagar) at 7799089550 (Hyderabad). Or you can visit 'Jithender Devishetty Clay Shop' at 'Mahendra Hills Checkpost, East Maredpalli' for more such products.