ఓరుగల్లు అంటేనే మనకు ఠక్కున కాకతీయుల రుద్రతేజం రాణి రుద్రమ దేవి గుర్తుకువస్తారు.. నాటి రుద్రమదేవి ఇతర రాజులపై వీరోచితంగా యుద్ధాలు చేస్తే నేడు ఇదే వరంగల్ అర్బన్ కు కలెక్టర్ గా చేస్తున్న ఆమ్రపాలి గారు వెనుకబాటుతనంపై, అభివృద్ధి కోసం తన శాఖ అధికార సైన్యంతో యుద్ధం చేస్తున్నారు. కలెక్టర్ లలో స్వార్ధంగా అవినీతికి పల్పడే వారిని చూశాం ఇప్పుడు శక్తివంతమైన నిజాయితీ గల ఆఫీసర్ గురించి తెలుసుకుందాం.
మనం ఏం అవ్వగలమన్నది మన తల్లిదండ్రులు నిర్ణయించలేరు ఒక వయసు రాగనే మనంతట మనకే తెలుస్తుంది, ఎందుకంటే మనల్ని మనం పరిశీలించినంతగా ఇంకెవ్వరు గమనించలేరు కాబట్టి. ఆమ్రపాలి గారి ఫాదర్ వెంకట రెడ్డి గారు ఆంధ్రయూనివర్సిటీలో ప్రోఫెసర్. ఆమ్రపాలి గారు చిన్నతనం నుండే కలెక్టర్ అవ్వాలనుకున్నారు ధైర్యంగా సాధించారు. మొదట వికారాబాద్ సబ్ కలెక్టర్ గా పనిచేశారు(2014). ఆ తర్వాత తెలంగాణ కొత్త జిల్లాల ఏర్పాటు ఇంకా తన పనితనం ఉన్నతంగా ఉండటంతో ప్రస్తుతం వరంగల్ అర్బన్ జిల్లాకు కలెక్టర్ గా నియామికమయ్యారు.
తన హయాంలో జరిగిన కొన్ని గొప్ప పనులు.. నోట్లను బ్యాన్ చేయడం ఇంకా సరిపడ డబ్బులు బ్యాంకులు అందించకపోవడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు భయంకరంగా ఇబ్బందులు ఎదుర్కున్నారు. పేదలు ఫుడ్ కోసం చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడు కలెక్టర్ ఆమ్రపాలి ముందుకొచ్చి 5స్టార్ హోటెల్స్, రెస్టారెంట్స్ తో సహా అందరితో మాట్లాడి ప్రతిరోజు మిగిలిపోయిన ఆహారన్ని పేదలకు అందేలా చర్యలు తీసుకుంది. ఇందుకోసం ఫుడ్ ఇన్సెపెక్టర్లను నియమించి, ఫుడ్ క్వాలిటిగా ఉండడానికి ప్రత్యేకంగా పాకేజింగ్ చేయించారు.
స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా వరంగల్ లో రివల్యూషనరి చేంజెస్ తీసుకువచ్చారు. 100% రోడ్లమీద చెత్త ఉండకుండా శుభ్రంగా ఉంచడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. డిసెంబర్ 2017 వరకల్లా వరంగల్ అర్బన్ జిల్లాను పూర్తి పరిశుభ్రమైన జిల్లాగా మార్చనున్నారు.
కలెక్టర్ అంటే ఎక్కడో ప్రజలకు దూరంగా కేవలం ఆఫీస్ కి మాత్రమే పరిమితమవుతారు అనేలా కాకుండా నిత్యం ప్రజలతో కలిసిపోయి వారి సమస్యల గురించి తెలుసుకుంటున్నారు. కేవలం 4నెలల కాలంలోనే జిల్లా మొత్తానికి తన శక్తి ఏంటో తెలిసింది. ఆమ్రపాలి గారు ఇప్పుడు వరంగల్ లో ఒక సెలబ్రెటి.. స్కూల్స్, కాలేజీస్ లలో జరిగే కార్యక్రమాలకు ఇప్పుడు హీరోలను పిలవడం లేదు ముఖ్య అతిధిగా ఆమ్రపాలి గారిని పిలుస్తున్నారు.
AMRUT ఇంకా వాటర్ గ్రిడ్ సహాయంతో జిల్లాలో ప్రతి ఇంటికి 24గంటలు మంచినీరు అందేలా ప్రణాళికలు జరుగుతున్నాయి.
జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క కార్పోరేట్ స్కూల్ కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ ని దత్తత తీసుకుని వాటిని అభివృద్ధి పరిచేందుకు చర్యలు జరుగుతున్నాయి.
జిల్లాలో ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతో ఉండాలి ఎవ్వరికి భయపడకూడదు అని చెప్పి కరాటే, ఇంకొన్ని Safety Tips నేర్చుకోవాలని అందుకు తగిన శిక్షణ తరగతులు ప్రారంభించబోతున్నారు.
ఇవి కేవలం 4నెలల కాలంలో జరుగుతున్న పనులు. మాటలు ప్రధమ స్థానమైతే చేతలు అత్యున్నత స్థానమవుతాయన్నట్టుగా తన చేతలతో ఎన్నో అభివృద్ధి పనులు చేయడానికి మరిన్ని పకడ్బంది ప్రణాళికలు తయారుచేస్తున్నారు ఆమ్రపాలి గారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.