మనం ఎంచుకున్న లక్ష్యం దాని దారి ఇతరులకు హాని కలగనప్పుడు మనల్ని విమర్షించే హక్కు ఈ ప్రపంచానికి లేదు".. వరంగల్ జిల్లాకు కలెక్టర్ ఐన అమ్రపాలి గారు కలెక్టర్ గా కేవలం తన వృత్తి విషయంలో మాత్రమే కాదు వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో భిన్నంగా, ఉన్నతంగా ప్రయాణం సాగిస్తున్నారు. ఎప్పుడూ ఫార్మల్ గా ఉంటూ నేను ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ని, కలెక్టర్ ను అని ఒక అధికారిగా నడుచుకుంటే ప్రజలు, యువత తమ సమస్యలు చెప్పుకోవడానికి ముందుకు రాకపోవచ్చు అమ్రపాలి గారి నడవడికతో వరంగల్ లో ఉన్న సమస్యలను తగ్గి ప్రజలు ఆశించిన, ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలు నెరవేరుతున్నాయి.
పాండవుల గుట్ట క్లైంబింగ్: టూరిజమ్ డెవలప్మెంట్ కోసం మనకేం స్టార్స్ అవసరం లేదు అమ్రపాలి లాంటి అధికారులు ఒక ముగ్గురు ఉన్నా చాలు. భూపలపల్లి జిల్లాలో ఉన్న పాండవుల గుట్ట లో అటవీ శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఫెస్టివల్స్ జరిగాయి. పాండవుల గుట్టను తెలంగాణలోనే మంచి టూరిస్ట్ ప్లేస్ లో ఒకటిగా తీర్చిదిద్దాలని అటవి శాఖ వారు ఈ ఫెస్టివల్స్ నిర్వహించారు. అప్పటికే ఇందులో పాల్గొనడానికి 250 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అక్కడి వారందరినీ ఆశ్చర్యపరిచి వారితో పాటు అమ్రపాలి గారు కూడా సరదాగ ఇంత పెద్ద గుట్టను అదిరోహించడం తన శక్తికి నిర్వచనం.
అడవిలోను: ఉద్యోగంతో పాటు గానే జీవితాన్ని కూడా ఆనందంగా గడిపేవారు చాలా తక్కువమంది ఉంటారు. ఒకసారి అమ్రపాలి గారు తన తోటి కలెక్టర్ ప్రీతి అమీనా(మహబూబాబాద్) గారితో కలసి బయ్యారం పెద్దగుట్ట అడవిలో 12కిలో మీటర్ల దూరం కాలినడ ద్వారా వెళ్ళారు. 4 గంటల పాటు ఆ పచ్చని అడవిలోనే గడిపి కేవలం పర్యటించడం వరకు మాత్రమే కాకుండా అడవిలో ఉన్న సమస్యల గురించి, అక్కడి ప్రజల జీవన విధానాల గురించి తెలుసుకోవడం ప్రజలపై తనకున్న ప్రేమను తెలియజేస్తుంది.