అసాధ్యం సాధ్యం అయ్యింది కనీసం మన ఊహల్లో కూడా ఆలోచించని ప్రయత్నం నెరవేరింది. ఇక నుండి కవర్ బ్యాగ్ లను వాడే వ్యక్తులను కోపంగా కాకుండా గౌరవంగా చూసే రోజులు రాబోతున్నాయి.. ఎందుకంటే గ్రీన్ మంత్ర పేరుతో శ్రీనివాస్ గారు తయారుచేయబడిన బ్యాగ్ భూమిలో కరిగిపోవడం మాత్రమే కాదు ఎరువుగా మారి మొక్కలకు, సమస్త ప్రాణికోటికి జీవించే కాలాన్ని పెంచబోతున్నది.

ఎలా తయారుచేశారు.? గ్లూకోజ్, వెజిటేబుల్ ఆయిల్, సెల్యులోజ్, గంజి.. ఇవ్వే గ్రీన్ మంత్ర బ్యాగుల తయారీకి అవసరమయ్యే ముడి పదార్ధాలు. గంజికి కొన్ని ఎంజైములు కలిపి లిక్విడ్ గ్లూకోజ్ గా మార్చుతారు. వివిధ రకాల బ్యాక్టీరియాలను కలిపి దాని నుండి ఫిల్మ్ రూపొందించి అనుకున్న సైజ్ లో కవర్లను తయారుచేస్తారు. మాములు ప్లాస్టిక్ బ్యాగులు భూమిలో కలిసిపోవాలంటే దాదాపు 1,000 సంవత్సరాలు పడుతుంది. గ్రీన్ మంత్ర బ్యాగ్ మాత్రం కేవలం 180 రోజుల్లోనే కరిగిపోయి ఎరువుగా మారిపోతుంది.

ఐక్యరాజ్య సమితి నుండి ఆహ్వానం: మన శ్రీనివాస్ గారు తయారుచేసిన ఈ బ్యాగ్ మాములుది కాదు. యావత్ ప్రపంచ పర్యావరణ మార్పునకు తనవంతు బాధ్యతగా తీసుకువచ్చిన ఈ బ్యాగ్ గురించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఐక్యరాజ్య సమితి వారు శ్రీనివాస్ గారిని ఆహ్వానించారు. ఐక్యరాజ్య సమితి పర్యావరణ అసెంబ్లీలో దీనిని ప్రదర్శించబోతున్నారు.

ప్రసాదం: గ్రీన్ మంత్ర బ్యాగులు ఇంకాస్త వేగంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం కోసం "వృక్ష ప్రసాదం" పేరుతో తిరుమల శ్రీ వెంకటేశ్వర దేవస్థానం పరిధిలో ప్రచారం కల్పించి భక్తులకు అందిస్తున్నారు. తిరుమల దేవస్థానంలో లడ్డుల కోసం ప్రతిరోజూ లక్షల ప్లాస్టిక్ కవర్ల స్థానంలో 180రోజుల్లోనే భూమిలో కలిసిపోయే గ్రీన్ మంత్ర బ్యాగులను ఉపయోగిస్తే ఎంతో ప్రయోజనమని అవగాహన కల్పిస్తున్నారు. అలాగే ప్రతి బ్యాగులో 200 తులసి విత్తనాలు ప్యాక్ చేస్తున్నారు, వాడి పారేసిన తర్వాత ఎరువుగా మారి తులసి విత్తనాలు మొక్కలుగా మారుతాయి(వీటిలో సగమైన మొలకెత్తుతాయి). అందుకే దీనిని వృక్షప్రసాదమని కూడా పిలుస్తున్నారు.

To order bags: Please Click Here