పోలీస్ అంటేనే ఎప్పుడు ఏదో ఒక కేసులతో నిరంతరం టెంక్షన్ వాతావరణంలో జీవిస్తారు. ఒక పక్క నాయకుల సెక్యూరిటీ, ఇంకోపక్క గొడవలు, తగాదాలు, ఎన్నో కేసులతో కుస్తీ పడుతు ఆలోచించే క్రమంలో నిత్యం టెన్షన్ లైఫ్ వారిది.. అలాంటి వారికి కనీసం కంటి నిండా ప్రశాంతంగా నిద్రకూడా పట్టదు.. ఇంకా చదువుకోవడం అది కూడా పి.హెచ్.డి లో డాక్టరేట్ ను సొంతం చేసుకునేంతలా అంటే అది మామూలు విషయం కాదు.. అంతటి క్లిష్ట పరిస్థితులలో PhD పూర్తిచేసి డాక్టరేట్ అందుకున్న పోలీస్ కానిస్టేబుల్ గుగులోత్ చంద్రశేఖర్ పేరు ఇప్పుడు డిపార్ట్ మెంట్ నంతటిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
అరే పోలీస్ జాబ్ వచ్చేసింది ఇంకేంటి లైఫ్ సెటిల్ ఒక పక్క పేరుకు పేరు, ఇంకో పక్క అందినకాడికి లంచాలు లైఫ్ బిందాస్..! ఇలా కొంతమందిలా అతను ఆలోచించలేదు. ఒక లక్ష్యాన్ని ఛేదించగానే ఇక అంతే అని ఆగిపోలేదు, ఒక్క లక్ష్యం అందుకోగానే దాన్ని దాటి మరోక లక్ష్యంపై దృష్టిపెడుతు సాగించిన మార్గంలో ఇప్పుడు పి.హెచ్.డి డాక్టరేట్ విజయాన్ని చేరుకున్నాడు చంద్రశేఖర్. ఎవరో గొప్ప రచయిత అన్నట్టు "విజయం అంటే అది ఒక నిరంతర ప్రక్రియ" దీనిని అక్షరాల ఆచరిస్తు క్రమక్రమంగా ఎదిగారు.
వరంగల్ జిల్లా నర్సంపేట సురిపల్లికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ గుగులోతు చంద్రశేఖర్(29) కేవలం చదువు వల్లనే జీవితాలు మారుతాయని బలంగా నమ్మే కుటుంబం నుండి వచ్చారు. పేదరికం కారణంగా చిన్నతనం నుండి ప్రభుత్వ పాఠశాలలో కష్టపడి చదివారు. ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు కూడా ప్రభుత్వ కళాశాలలో చదివు పూర్తిచేశారు. గత ఐదు సంవత్సరాలుగా కానిస్టేబుల్ గా జాబ్ చేస్తూ రాత్రిపగలు కష్టపడి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుండి కోయ లంబాడి గిరిజన ప్రజల జీవన ప్రమాణాలు వారి సంప్రదాయాలు, అలవాట్ల మీద పరిశోధనలు చేసి ఈ మధ్యనే డాక్టరేట్ ను అందుకున్నారు.
డాక్టరేట్ తో చంద్రశేఖర్ సంతృప్తి చెందాడా అంటే లేదనే చెప్పాలి..! "తను ఇంతవరకు చదివిన చదువు, జ్ఞానం సామాన్యులకు, పేదవారికి చెందాలి అందుకోసం ఉపాద్యాయుడిగా వారికి సేవనందించాలని ఆశిస్తున్నారు. త్వరలో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసే జూనియర్ లెక్చరర్ ఉద్యోగానికై నిర్వహించే పరీక్షకు మరియు ఉద్యోగానికి అనుమతి ఇవ్వాలని పోలీస్ డిపార్ట్ మెంట్ ను కోరుకుంటున్నారు. నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో చంద్రశేఖర్ ఒక ఆణిముత్యం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.