దేశవ్యాప్తం గా ఎన్నో భాషల్లో సినిమాలు వస్తున్నా , ఒకానొక రోజు మన Telugu Cinema అలియాస్ Tollywood గారిని మన Indian Cinema గారు సరదాగా మాట్లాడుకోవడానికి పిలిచారన్నమాట ! ఆ తీపి conversation ఇప్పుడు చూద్దామా !!!
Indian Cinema : హా రావయ్యా టాలీవుడ్ ! ఎలా ఉన్నావ్ ? చూసి చాలా రోజులైంది . నాకు చాలా ఆనందం గా ఉందయ్యా నిన్ను చూస్తుంటే . చెప్పాలంటే చాలా గర్వంగా ఉంది కూడా !
Tollywood : నమస్కారం అండి ! ఎలా ఉన్నారు ? అంతా కుశలమే కదా ! నాకు కూడా చాలా ఆనందం గా ఉండండి, మిమ్మల్ని చాలా రోజుల తర్వాత ఇలా గర్వం గా చూడటం !
Indian Cinema : కుర్చొవయ్యా ! కాసేపు నీతో మాట్లాడడానికే నిన్ను పిలిపించా !
Tollywood : (Stands aside folding hands) అయ్యో ఫర్వాలేదులేండి !
Indian Cinema : మీ తెలుగు వారిలో నచ్చే విషయం ఇదేనయ్యా ! ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు . అది సరే గాని , మొన్ననే మన విశ్వనాథ్ గారికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చారు . చాలా ఆనందం గా ఉందయ్యా . ఇంతక ముందు బొమ్మిరెడ్డి , నాగిరెడ్డి , అక్కినేని నాగేశ్వరరావు , రామానాయుడు గార్లకి వచ్చినప్పుడు కూడా ఇంతే ఆనందపడ్డా !
Tollywood : అవునండి ! మీ నాన్న గారైన D. Govind Phalke గారి పేరు మీద ఉన్న అవార్డు మొన్న మా విశ్వనాథ్ గారికి రావడం మాకెంతో గర్వకారణం . ఆ అవార్డుకే అందం వచ్చినట్టైంది .
Indian Cinema : నిన్ననే చూసా అయ్యా ! మీ బాహుబలి ! ఏం దృశ్య కావ్యం గా మలిచాడయ్యా ఆ రాజమౌళి ! చూస్తుంటేనే వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయ్ . Hollywood cinema గారు ఎప్పుడైనా నాతో మాట్లాడితే వారి సినిమాలైన Ben-Hur,, Marvel create చేసిన పాత్రల గురించే మాట్లాడేవాడు . ఈరోజు మొట్టమొదటిసారి బాహుబలి గురించి మాట్లాడుతుంటే , నా ఆనందాన్ని వర్ణించలేమయ్యా బాబు !
Tollywood : మీరు అన్న మాటల్లో చిన్న correction అండి . "మీ బాహుబలి" అన్నారు . అది మా బాహుబలి కాదు...... మన బాహుబలి . చెప్పాలంటే అది పూర్తిగా మీదే కూడా !
Indian Cinema : హహ్హహా ! అవునయ్యా , నా సినిమా అంటే నేనెందుకు ఒప్పుకోను ? పైగా అది బాహుబలి . తెలుగోడి మీసం మెలేసిన సినిమా కదా ! చరిత్ర లో , మా మనసులో బాహుబలి నిలిచిపోయిందంతే !
Tollywood : అయినా మాదేముందండి ! జనాలు గొప్ప సినిమా అయితేనే ఈరోజుల్లో చూస్తున్నారు . అప్పట్లో భక్త ప్రహ్లాద తో మొదలైన మా ప్రయాణం ఒక్కో మైలురాయి నీ దాటుకుంటూ ఇప్పుడు బాహుబలి అనే పేద్ద మైలురాయి కి చేరింది . మాకిదే చాలండి ! మధ్యలో ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులూ వచ్చాయి . వాటన్నిటివల్లా వచ్చిన ఆనందం బాహుబలి లో చూసుకుంటున్నాం .
Indian Cinema : అవునయ్యా ! మన తెలుగు వాళ్ళు కథ , కథనానికి ప్రత్యేకమైన స్థానం ఇస్తారు . అందుకే దేశం లో మాయాబజార్ , మల్లీశ్వరి , స్వాతిముత్యం , శంకరాభరణం , స్వయంకృషి, ఈగ , కంచె , పెళ్లిచూపులు లాంటి వాటికీ ప్రత్యేకమైన గుర్తింపొచ్చింది . ఒక్క విషయం చెబుతా విను .అప్పట్లో 1957 లో సంచలనాలని సృష్టించిన మాయాబజార్ తర్వాత ..... 1959 లో వచ్చిన Ben-Hur ఎవ్వరూ చేరుకోలేనంత పేద్ద target set చేస్సి , వెళ్ళిపోయింది . ఇప్పడు బాహుబలి దాన్ని చేరుకోగలిగింది . మీ తెలుగు వారి ప్రస్థానం 1921 లో "భీష్మ" అనే సినిమా తో మొదలైంది అనుకుంటా . ఆ తర్వాత మీ నుంచి వచ్చిన C. పుల్లయ్య , నాగిరెడ్డి ,నాగయ్య , రంగారావు , ఎన్టీఆర్ , నాగేశ్వరరావు , సావిత్రి , జామున , భానుమతి మొదలైన వారు చెరగని ముద్రలు వేశారు మన దేశవ్యాప్తంగా . ఆ తర్వాత పాతాళభైరవి , దేవదాసు , మల్లీశ్వరి , లవకుశ , మాయాబజార్ మొదలైనవి తిరుగులేని విజయాలుగా నమోదయ్యాయి . ముఖ్యం గా ఇప్పుడు బాహుబలి గురించి మాట్లాడుతున్నట్టు అప్పట్లో మాయాబజార్ గురించి దేశవ్యాప్తం గా మాట్లాడుకునేవారు . 1913 లో పుట్టా కదా , అవన్నీ గుర్తొచ్చి చెప్తున్నా . ఏమీ అనుకోకు !
Tollywood : భలేవారండీ ! మీరు చెప్పుకొద్దీ నాకు ఇంకా మన సినిమాల మీద గౌరవం పెరుగుతుందండీ ! మీరు ఆరోజుల్లోవి చెప్పినట్టు , ఆ తర్వాత కాలం లో ఇద్దరు వ్యక్తులు సినిమా గురించి కొత్త నిర్వచనం ఇచ్చారు . వారే బాపు గారు , విశ్వనాథ్ గారు . సినిమా అంటే కేవలం వినోదం , కథలే కాదు , సంస్కారాన్ని కూడా ఇస్తాయి అని prove చేసారు వాళ్ళు . వీరి శకం అయిన తర్వాత మన రాజమౌళి గారి శకం మొదలైందనే చెప్పాలండీ !
Indian Cinema : అవునయ్యా ! పైన చెప్పిన వినోదం , సంస్కారం , కథ , కథనం అవన్నీ కలిపి ఒక దృశ్యకావ్యం గా బాహుబలి ని మనకి అందించాడు రాజమౌళి . ఒక రెండున్నర గంటలు జనాలకి సినిమా ని ఇవ్వడం కోసం , Prabhas తన ఐదేళ్ళని ఇచ్చేయడం , Prabhas మరియు Rana , Anushka , Ramya Krishna , Nazar , Satyaraj ......... వీరందరూ పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేశారనే చెప్పాలి . తెలుగు సినిమాల గురించి చర్చించవలసి వస్తే , బాహుబలి ముందు ఆ తర్వాత అని చెప్పుకోవాలేమో ! అప్పట్లో మాయాబజార్ , భక్త ప్రహ్లాద అయితే , ఇప్పుడు బహుబలే !దీన్ని కొలవడానికి మన దగ్గర కొలమానాలు ఏవీ లేవు ! మళ్ళీ ఇలాంటి సినిమాలు రావడానికి ఇంకెన్నాళ్లు పడుతుందో ! ఎడారి లో తప్పిపోయిన ఒక మనిషికి మన తెలుగింటి భోజనం పెట్టినట్టు , తెలుగు సినిమా అంటే ఓస్ , after all తెలుగు సినిమా అనే వాళ్ళకి , ఒక ధీటైన సమాధానం ఇచ్చాడు మన రాజమౌళి .
Tollywood : అవునండీ ! ఈరోజునుంచి తెలుగు నుండి ఎలాంటి మంచి సినిమా వచ్చినా సరే , ప్రపంచం ఎదురు చూసే స్థాయి కి మన బాహుబలి ఒక road create చేస్సిందండి !
Indian Cinema : ఇప్పటికే చాలా మాట్లాడేసుకున్నట్టున్నాం ! ఇక ఉంటానయ్యా ! మళ్ళీ త్వరలోనే కలుద్దాం .
Tollywood : మీరు నన్ను పిలుపించుకొని మరీ మాట్లాడటం నాకెంతో సంతోషం గా ఉందండీ ! తప్పకుండా మళ్ళీ కలుద్దాం ! ఇక సెలవు !