ఈరోజుల్లో ఒక ఐడియా అనేది వెలకట్ట లేని ఆస్థి లాంటిది.. చాలామంది సరైన గైడెన్స్ లేకపోవడం, మెరుగైన అవకాశాలను అందుకోలేకపోవడం వల్ల, లేదంటే ఇతర కారణాల వల్ల ఆ ఆస్థి నిరూపయోగంగా మారిపోవడం జరుగుతున్నది. ఇలా అవగాహన లేనితనం దాదాపు 80% యువకులలో కనిపిస్తుంది.. అందుకే స్టార్టప్ లో కేవలం కొన్ని మాత్రమే మాంచి సక్సెస్ సాధిస్తున్నాయి. జెక్స్టాపోజ్ ను స్టార్ట్ చేయకముందు కూడా స్రుతి ఇంకా తన ఫ్రెండ్స్ కి రకరకాల స్టార్టప్ ఆలోచనలు వారి మదిలో మెదిలాయి ఐతే స్టార్టప్ ల కోసం మాత్రం ఏ ఒక్క స్టార్టప్ రూపుదిద్దుకోలేదు దీనినే ఎందుకు ప్రారంభించకూడదు అనే ఊహకందని ఆలోచనతో జాక్స్టాపోజ్ సంస్థను ప్రారంభించారు.
ఒకప్పుడంటే మంచి ఉద్యోగం దొరికితే చాలని భావించేవారు కాని ప్రస్తుతం పరిస్థితి అలా లేదు ప్రతి ఒక్కరు తమకు తామే యజమానిగా ఉండాలని కోరుకుంటున్నారు తప్ప జీతం కోసం జాబ్ చేయాలనే ఆలోచనలో చాలా తక్కువమందే ఉన్నారు. కాలేజ్ లో చదువుకుంటుండగానే శృతితో పాటు అక్షయ్, రచన, తేజ, శ్రవణ్, ప్రేరణ వీరందరి మనస్తత్వాలు ఒకే విధంగా ఉండడంతో స్టార్టప్ ల కోసం ఓ స్టార్టప్ రావడానికి సమయం అంత తీసుకోలేదు. దాదాపు 18 నెలల క్రితం మొదలైన వీరి ప్రయాణం స్టార్టింగ్ లో కొంత ట్రబుల్ ఇచ్చినా గాని జాక్స్టాపోజ్(Jxtapose) వేగంగానే అందరినీ చేరుకుంటుంది.
ఎలా గైడెన్స్ ఇస్తారంటే..
ఒకరిలో ఉన్న టాలెంట్ మరొకరిలో ఉండకపోవచ్చు స్టార్టప్ కు అన్ని రంగాలలో ఉన్న నిష్ణాతుల అవసరం ఉంటుంది. ఇలా వివిధ రంగాలలో ఉన్నవారిని వీరు కలుపుతారు, ప్రస్తుతం అవసరమయ్యే మార్కెటింగ్ స్ట్రాటజీపై అవకాశాలు చూపిస్తారు. ఇలాంటి వారందరి కోసం జెక్స్టాపోజ్ సంస్థ స్థలంలోనే ప్రతి శనివారం ఎగ్జిబిషన్, వర్క్ షాప్ లను ఏర్పాటుచేసి వారు తయారుచేసిన వస్తువులను కూడా అమ్ముకునే సధుపాయం కల్పిస్తారు.
కేవలం మనం ఒక్క ఐడియాతో ఈ సంస్థలోకి అడుగుపెడితే ఆఫీస్ మొదలుకుని ఉద్యోగులు, ఫర్నీచర్, మార్కెటింగ్ మెళకువులు, ఇన్వెస్టర్స్ ఇలా కంప్లీట్ గా ఒక స్టార్టప్ సక్సెస్ అవ్వడానికి ఏవైతే అవసరమో అవన్నీ కూడా జెక్స్టాపోజ్ అమరుస్తుంది. కేవలం స్టార్టప్ కోసమే అని కాదు మనలో ఒక గొప్ప టాలెంట్ ఉంటే ఉదాహరణకు ఒక సింగర్ గా, సాఫ్ట్ వేర్ డెవలపర్, ఆర్టిస్ట్ ఇలా ఏ రంగంలోనైనా మంచి ప్రతిభ కలిగి ఉంటే వారికి సైతం ఈ వేదిక మీద అవకాశాలు లభిస్తాయి.