సంవత్సరం : 2003, ఫిబ్రవరి 12 సమయం : సాయంత్రం 04 : 20 గం \\
అప్పుడే స్కూల్ గేట్ నుంచి బయటకి వచ్చిన నాకు నాన్న బదులు పోలీసుల కార్లు నిలబడ్డాయి. నేనేం అనకుండానే ఒక పోలీస్ ఆఫీసర్ "మీ నాన్న గారు చిన్న పని మీద వెళ్లారు అమ్మా దీప్తీ , ఇదిగో ఈ పేపర్ ఇవ్వమన్నారు" అని నాకు ఒక ఉత్తరం చేతికి ఇచ్చారు.
నాన్న ( ఉత్తరం లో ) : "కన్నా, వాళ్ళు నాకు తెలిసినోళ్ళే , ఇంటికి జాగ్రత్త గా తీసుకెళ్లామని చెప్పా. అమ్మ ఒక్కర్తే ఉంది , తొందరగా తీసుకెళ్లామని చెప్పు..... నేను రేపు సాయంత్రానికల్లా వచేస్తానే......" అని ఉంది.
నాన్న రైటింగ్, మాటలు బట్టి అది నాన్నే రాసారు అని నమ్మి, ఆ పోలీస్ కార్స్ లో ఇంటికి వెళ్ళా. సంవత్సరానికి రెండు నెలలు మాత్రమే మాతో ఉండే నాన్న, ఈసారి ఆ రెండు నెలల్లో రెండు గంటలూ మాతో లేరు అని బాధపడుతూ ఇంటికి వెళ్ళా.
ఆఫీసర్ : "మేడం , S.P గారు చెప్పినట్టే మీ ఇంటి చుట్టూ గార్డ్స్ ని ఏర్పాటు చేసాం. మీకేం కావాలన్నా కాల్ చెయ్యండి. అన్నీ మేము చూసుకుంటాం. అర్జున్ సర్ ఇప్పుడు స్టింగ్ ఆపరేషన్ లో ఉన్నారు, పైగా ఆయనే ఇక్కడ చాలా అనుభవశాలి, అందుకే ఆయనే ఈ ఆపరేషన్ కి హెడ్ గా గవర్నమెంట్ ప్రకటించింది. ఉంటాం మేడం."
అమ్మ : "హా ......."
నేను : "అమ్మా ఏం జరుగుతుంది అమ్మా, నాన్నెక్కడ ? ఎక్కడికెళ్లారు ? "
అమ్మ : "దేశాన్ని పట్టి పీడిస్తున్న ఈ రాక్షశులని అంతం చెయ్యడానికి వెళ్లారు అమ్మా, రేపు సాయంత్రానికల్లా వచేస్తారుగా..... "
సంవత్సరం : 2003 సమయం : సాయంత్రం 06 : 10 గం \\
టి .వి లో : "ఈరోజు మధ్యాహ్నం రాజ్ కోట లో ఉగ్రవాదులు దాడి చెయ్యగా అక్కడే ఉన్న ముప్పై మంది ప్రాణాలు విడిచారు. అందులో సకం పైగా చిన్నారులు ఉండటం గమణియం. ఉగ్రవాదులు మరి కొందరిని వారి దగ్గర ఉంచుకున్నట్టు సమాచారం. ఉగ్రవాదులను హతమార్చడానికి ప్రభుత్వం దేశసైన్యం నుండి జనరల్ అర్జున్ ప్రసాద్ గారిని నియమించింది. రేపటికల్లా పరిస్థితులు చక్కబడతాయి అని ప్రభుత్వం తో పాటు దేశ ప్రజలు కూడా ఆశిస్తున్నారు. " అమ్మ నాకు ఎందుకు చెప్పలేదు అని అడగటానికి వంట గదిలోకి వెళ్ళా. ఏడుస్తూ అమ్మ నాకిష్టమైన బంగాళాదుంపల కూర వండుతుంది. టి. వి లో వార్తలు వినబడ్డాక నా వైపు చూసింది.
నేను : "ఎందుకమ్మా ఏడుస్తావ్ . నాన్న గురించి టి. వి లో చూపిస్తున్నారు. నాన్న ఇంత గొప్ప వారు అని ఎందుకు చెప్పలేదు. నాన్న కచ్చితం గా వస్తారు, నాకు ఉత్తరం లో రాసారు." అమ్మ : "మీ నాన్న గొప్పతనం చెప్తే తెలిసేది కాదు అమ్మా. ఒక వయసు వచ్చాక నువ్వే అర్థంచేసుకుంటావ్. దేశం లోనే అత్యున్నత పదవి అమ్మా ఆయనది. దేశాన్ని పట్టి పీడించే ఉగ్రవాదులందరినో అయన చాకచక్యం తో పోరాడిన రోజులు ఉన్నాయి. ఈరోజు ఇంకో సమస్య అంతే. కానీ ప్రతీ సారీ వెళ్ళినప్పుడు ఎదో తెలియని వెలితి, భయం వచ్చి ఇలా కళ్లనుంచి నీళ్లు కారతాయి. "
సంవత్సరం : 2003, ఫిబ్రవరి 13 సమయం : ఉదయం 10 : 00 గం \\
టి .వి లో : "జెనరల్ అర్జున్ ప్రసాద్ గారు నిన్న రాత్రి నుంచి స్టింగ్ ఆపరేషన్ మొదలు పెట్టారు, కానీ ఒక్క ఉగ్రవాది కూడా లభ్యమవ్వలేదు."
అమ్మ ముఖం లో ఎదో తెలియని భయం. నాకు మాత్రం మా నాన్న వస్తారు అనే తపన. ఛానల్ మర్చి టామ్ అండ్ జెర్రీ చూస్తున్నా.
ఇంతలో అమ్మకి ఫోన్ కాల్ .....
ఎవరో నాన్న టీం లో ఉన్న ముగ్గురు సైనికుల్ని కాల్చేశారు అని. అమ్మ ముఖం లో భయం,వంట్లో కంగారు ఎక్కువైంది. రిమోట్ లాక్కుని న్యూస్ ఛానల్ పెట్టింది. అందులో ఉగ్రవాదుల జాడ , మా నాన్న జడ ఏదీ కనబడట్లే, ఒక ఇల్లుని మాత్రమే చూపిస్తున్నారు.
సంవత్సరం : 2003, ఫిబ్రవరి 13 సమయం : సాయంత్రం 02 : 36 గం \\
ఛానల్ మార్చకుండా చూస్తున్న మాకు ఒక్కసారిగా గుండె పగిలిపోయింది. ఉగ్రవాదులందరినీ హతమార్చిన అనంతరం కోన ఉపిరి తో ఉన్న ఒక ఉగ్రవాది నాన్న గుండెల్లోకి కాల్చివేసాడు అని. వార్త కనిపించింది. ఉన్నట్టుండి అమ్మ కుప్పకూలిపోయింది. ఒక్కసారిగా అంతా అంధకారం. అమ్మ అరుపులు విని ఇంటికిందనున్న పోలీస్ ఆఫీసర్ లు ఇంట్లోకి వచ్చారు. నాకేం చెయ్యాలో అర్థంకాలేదు. నాన్న నాతో ముందు రోజు అన్న మాటలే గుర్తొచ్చాయి.
సంవత్సరం : 2003, ఫిబ్రవరి 11 సమయం : సాయంత్రం 04 : 00
నేను : "నాన్నా..... ప్రోగ్రెస్ కార్డ్ ..సైన్ పెట్టవా.. " అమ్మ : "ఏంటి అర్జున్..... దాని మర్క్స్ చూసి అప్పుడు సైన్ పెట్టు .....ఎంత వచ్చాయో చూసావా దానికి, టి. వి చుసిన శ్రధ్ధ సకం చదువు మీద పెడితే బాగుపడుద్ది. సిగ్గులేదు, వాళ్ళ క్లాస్ వాళ్లందరికీ బాగానే వస్తాయ్ దీనికి తప్ప." ఎప్పుడు ప్రోగ్రెస్ కార్డు ఇచ్చినా నన్ను కొట్టే అమ్మ, ఈసారి నాన్న ఉన్నారని తిట్టడం తో సరిపెట్టింది. అమ్మ మాటలు విని ఏడుస్తున్న నా ముఖం లో ఉన్న కన్నీటిని తుడుస్తూ, .....
నాన్న : "అదేంట్రా తల్లీ జస్ట్ పాస్ అయ్యావా .... అదేం టీచర్ సరిగ్గా చెప్పట్లేదా ? పేపర్ కష్టం గా ఇచ్చారా ? ఇట్లా చిన్న విషయాలకి ఏడవకూడదు అమ్మా. మనం ఎంత కష్టమొచ్చినావు స్ట్రాంగ్ గా ఉండాలి. నీ వయస్సు లో చూడు రాణి లక్ష్మీ భాయ్ కత్తి యుద్ధం నేర్చుకుంది. నిన్ను మీ అమ్మ చాక్ పెట్టుకుంటేనే కొడ్తుంది. హహ్హ. మార్కులు తక్కువ వస్తేనేం ? నా కూతురు చాలా ధైర్యమైనది. ఇప్పుడు చిన్న పిల్లవి. రేపు పెద్దయ్యాకా నిన్ను అది చెయ్యద్దు , ఇదే చెయ్యాలి అంటారు. నువ్వు పెద్ద పెద్ద పనులకి పనికిరావు అంటారు. తెలియని వాళ్ళు నానా మాటలు అంటారు. కానీ ఒకటి గుర్తించుకో నువ్వు పుట్టింది ఒక రుద్రమ దేవి, లక్ష్మి భాయ్, నీర్జా భానోట్, మొన్న మొన్ననే చనిపోయిన కల్పనా చావల పుట్టిన నెల మీద. ఎంత కష్టమొచ్చినా మనం ఎదిరించి పోరాడాలి. ఎంత చదివాము అన్నది కాదు , మన వల్ల దేశానికి కొంతైనా ఉపయోగం ఉందా లేదా అన్నది చూడాలి. జీవితం లో నీకు నచ్చిందే చెయ్యి. భూమి చాలా అందమైనది, అందులో ప్రతీ అణువూ బ్రతికున్నప్పుడే చూడాలి, అది కష్టమైనా, ఇష్టమైనా కూడా. ఈరోజు నీకు మార్కులు తక్కువ వచ్చాయి కాబట్టి, సాయంత్రం సినిమా కి వెళ్దాం పదా. సక్సెస్ ని ఎంత ఎంజాయ్ చెయ్యాలో , ఫెయిల్యూర్ కూడా అంతే ఎంజాయ్ చెయ్యాలి. పోయి రెడీ అవ్వు...." ఆ మాటలన్నీ ముఖం ముందు కదిలిన తర్వాత, పోలీసులు చెప్పినా వినని అమ్మ, నా మాటలు విని కన్నీళ్లు ఆపుకుంది. ఆ తర్వాత ఢిల్లీ లో నాన్న సమాధి ముందు లక్షల్లో జనాలు జై జై లు కొడుతున్నప్పుడు అమ్మ కళ్ళల్లో , నా కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నా, ఒక్క బొట్టు కూడా కిందకి పడలేదు. కానీ ఒక్కటే ఆలోచన . నాన్న కి ఇంత ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది అని.
సంవత్సరం : 2018, జూన్ 18, 2018.
ఎందుకో ఈరోజు నేనూ భారత సైన్యం లో చేరుదాం అని నిర్ణయం తీసుకున్నాకా, నాన్న వెంటనే గుర్తొచ్చారు. నాన్న గొప్పతనం అప్పుడు పసిపిల్లగా ఉన్నప్పటికన్నా , ఈరోజు వికీపీడియా ముందు కూర్చొని నాన్న గురించి చదువుతున్నప్పుడు తెలిసీ ..... కన్నీళ్లు రావడం తప్పా ఇంకేమీ చేతకావట్లేదు. ....... ఐ మిస్ యు నాన్న.