Contributed By Kowshik Ramadugu
చిటికెను వేలు పట్టుకొని,కబర్లు చెప్తూ నాన్న పక్కన పడుకుంటే పేషెంట్ తలుపు చప్పుడు నా ఆనందాన్ని దూరం చేసింది ఐనా నేను బాధ పడలేదు ఎందుకంటే ….మా నాన్న డాక్టర్
ఆదివారం సినిమాకి అని బయల్దేరిన కారు మధ్యలో హాస్పిటల్ వైపుకి మళ్లింది, ఐనా నా ఆనందం ఆవిరవ్వలేదు.... స్కూల్ నుండి తీసుకోని వెళ్ళడానికి నాన్న రాకపోతే చూసి చూసి ఆటోలో ఇంటికి వెళ్లినా, నా మనసు బెదరలేదు.. ఎందుకంటే ….మా నాన్న డాక్టర్
పెళ్లిరోజు అని అమ్మ నాన్నతో కల్సి గుడికి వెళ్ళాలి అనుకుంటే… ఆపరేషన్ … నాన్న లేకుండానే మమల్ని వెళ్లేలాచేసింది… ఐనా అమ్మ నవ్వుతూనే ఉంది ఆమెకు తెలుసు క్షణం లేటైతే పోయేది ఒక ప్రాణం కాదు ఒక కుటుంబం నవ్వు అని...... మీ చేతి చలువ సారు!…నా కొడుకు బ్రతికాడు అని ఒకరు అంటే ఆ గర్వాన్ని నేను మాత్రమే పొందగలను ఎందుకంటే ….మా నాన్న డాక్టర్
నన్ను నా పేరుతో పిలిచినప్పుడు కంటే…. డాక్టర్ గారి అమ్మాయి అని పిలిచినప్పుడే నా మొహం మీద చిరునవ్వు రెట్టింపు అవుతుంది ..
నల్ల మబ్బులు కమ్ముకున్న ప్రస్తుత పరిస్థితిలో…తెల్ల కోటు మాటున వెన్నలాంటి మనసుతో చీకటిని చెరిపి వేయడానికి ప్రయత్నిస్తున్న ఎందరో డాక్టర్సకి…… థాంక్యూ..
వైద్యో నారాయణో హరి !
ఇట్లు డాక్టర్ గారి అమ్మాయి