When Will We Finally Catch The Notorious Dawood Ibrahim?

Updated on
When Will We Finally Catch The Notorious Dawood Ibrahim?


సాయంత్రం 6 దాటింది.. ఏదో పని ఉండటం వల్ల ఇంటినుండి బయటికి వెలుతున్నాం.. అమ్మ నాన్న వంక చూస్తే తెలుస్తుంది వారికి ఎలాంటి భయం ఉందో అని.. రాత్రి మాత్రమే కాదు పట్ట పగలు కూడా ఏదైనా జనం ఎక్కువగా ఉండే రద్దీ ప్రదేశాలకు వెళ్ళాలన్న కూడ ప్రాణ భయం కలుగుతుంటుంది ఎక్కడ ఏ బాంబు పేలుతుందోనని.. ఈ ధుస్థితికి కారణం ఎవరు? నిత్యం శాంతి, ధర్మం అని ప్రపంచానికి మనవ విలువలను నేర్పిస్తున్న మన దేశాన్ని ఇలా ఉగ్రవాదులకు టార్గెట్ గా మారిపోవడానికి గల ఏకైక కారణం ఒక్క దావుద్.. అన్నతమ్ముళ్ళలా కలిసి ఉండే హిందు ముస్లింల మధ్య తగదాలు పెట్టి ఒక మతానికి చెందిన వ్యక్తులందరిని అనుమానంగ చూసేంతటి పరిస్థితి తీసుకువచ్చాడు ఒక్క దావుద్..

దావుద్ పుట్టి పెరిగింది ఎక్కడో కాదు ఒక పోలిస్ కానిస్టేబుల్ ఇంట్లో.. అవును దావుద్ తండ్రి ఒక హెడ్ కానిస్టేబుల్.. మహారాష్ట్ర ముంబాయ్ లో అతని స్వస్థలం. మొదట చిన్న చిన్న దొంగతనాలు చేస్తు గ్యాంగ్ స్టర్ హజీ మస్తాన్ ప్రోద్భలంతో డి కంపెనీని స్థాపించాడు... ఇక అప్పటి నుండి అతని అరాచకం ప్రారంభం అయ్యింది.. అతని ఆదాయం ప్రారంభం అయ్యింది అన్నదాని కన్నా భారత్ ను నాశనం చేద్దామనే ఆశయం ప్రారంభమైందనే చెప్పాలి. భారత్ ఆర్ధిక వ్యవస్థను పతనం చేయడానికి ఫేక్ కరెన్సినీ మొదలుకొని, Celebrities ను Black mail చేయడం, డ్రగ్స్, మ్యాచ్ ఫిక్సింగ్, బాంబు దాడులు వంటి ప్రతి హింసాకర సంఘటనలకు ప్రధాన సూత్రదారిగా ఉండటం, ప్రపంచానికి పెను విఘాతంగా ఉన్న తీవ్రవాదానికి ఆర్ధికంగా సహాయం అందించడం ఇలా ఎన్నో వందల మంది అమాయకుల ప్రాణాలను బలితీసుకున్న నరరూప రాక్షసుడు దావుద్.. ఒక్క భారతదేశానికే కాదు అంతర్జాతీయ మోస్ట్ వాంటెడ్ వ్యక్తులలో దావుద్ మూడవ వాడు.. ఇప్పుడు దావుద్ కు ఇండియా, బ్రిటన్, నేపాల్, సౌది అరేబియా, సింగపూర్, థాయ్ లాండ్, స్పేయిన్ లాంటి పది దేశాలలో ఆయనకు లక్షల కోట్లల్లో ఆస్థులున్నాయి.. ఇదంతా భారతీయులను భయపెట్టి, హింసించి, చంపి సంపాదించిన సొమ్ము..

1993 ముంబాయ్ పేళుళ్ళకు ప్రణాళిక చేసి ఏకంగా పాకిస్థాన్ పారిపోయాడు.. ఇప్పుడు మన శత్రుదేశమే అతనికి పాక్ పౌరసత్వం ఇచ్చి రక్షణ కొరకు ఏకంగా మూడు వివిధ పేర్లతో పాస్ పోర్ట్ లను జారి చేసింది.. ఇప్పుడు పాకిస్థాన్ యే అతన్ని కాపాడుతుంది. భారత్ ఇంకా ఎలా నాశనం చేయాలి? మతసామరస్యాన్ని ఎలా విచ్ఛిన్నం చేయాలి అని పదకాలు రచిస్తున్నారు.. ఇదే అరాచకం మరోక దేశంలో చేసేదుంటే ఇపాటికి దావుద్ శవమయ్యే వాడు.. నిన్న మొన్నటి ఒసామా బిన్ లాడేన్ చావే అందుకు ఉదాహరణ.. తన దేశంలో అరాచకాన్ని సృష్టించిన లాడేన్ ను పాకిస్థాన్ నట్టింటికి తన సైన్యంతో వచ్చి కాల్చి చంపి శవాన్ని దర్జగా తీసుకెళ్ళిన ఘనత అమేరికాది.. కాని మనం దాదాపు 30 సంవత్సరాల నుండి వెతుకుతున్నాం.. అతను మాత్రం దర్జగా దేశాలు తిరిగేస్తుంటాడు. ఇప్పుడు ఆనారోగ్య కారణాలతో చావుకు దగ్గరగ ఉన్నాడు. పాక్ ఆర్మి డాక్టర్స్ నేతృత్వంలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నది పాకిస్థాన్ నేషనల్ హాస్పిటల్ లియాఖత్ లో వైద్యం జరుగుతుంది అని అడ్రస్ తో సహా ప్రపంచానికి తెలిసినా ఈడ్చుకొని తీసుకురాక ఇంకా మన వాళ్ళు చోద్యం చూస్తున్నారు... పైన దేవుడున్నాడు ఆయన శిక్షిస్తాడు అని. నిజంగా ఎంత సిగ్గుచేటు ఎంత చేతగాని తనం..!!!