What If...Democracy Was Compared To A 10 Year Old Boy?!

Updated on
What If...Democracy Was Compared To A 10 Year Old Boy?!

మా నాన్నగారి బాబాయ్ వాళ్ళ అన్నగారి పదేళ్ల కొడుకు ఒకసారి బూతులు మాట్లాడుతూ తన తండ్రి గారికి పట్టుబడ్డాడు. కోపం తో ఊగిపోయిన తండ్రి రెండు దెబ్బలేసి ఇంకెప్పుడైనా మాట్లాడితే తోలు తీయబడుతుందని హెచ్చరించాడు. ఆ క్షణానికి భయపడ్డ అబ్బాయి, ఆ రోజంతా బాగా ఏడ్చి, ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడకూడదు అని అనుకున్నా, అలావాటైపోయిన పదాలు విస్మరించలేక మళ్ళీ మామూలుగా అలాంటి బూతు పదాలు మాట్లాడటం కొనసాగించాడు. కానీ మాట్లాడే ముందు, చుట్టు పక్కల తండ్రి ఉన్నాడో లేదో ఒకసారి చూసుకుని, లేడు అని నిశ్చయించుకున్న తరువాత నే మాట్లాడేవాడు. ఇది 'IMPOSITION'

ఈ అబ్బాయి వాళ్ళ అమ్మగారు ఒకరోజు సరుకుల అంగడి కి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు మీద ఆడుకుంటున్న కొందరి పిల్లల నడుమ తన కుమారుడు బూతులు మాట్లాడుతున్న దృశ్యం కనబడింది. వాడిని తనతో పాటు ఇంటికి తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టుకుని అలాంటి బాష వాడవద్దని, మంచి పద్ధతి కాదని ఓర్పుగా వివరించింది. అది విన్న అబ్బాయి, కాస్త ఆలోచించి మానడం కష్టంగా ఉందని జవాబిచ్చాడు. కష్టమైనా సరే, మానేయాల్సిందే అని ఒట్టు వేయించుకుంది ఆ తల్లి. పిల్లవాడు కదా, బూతు నోటి వరకు ఒచ్చిన ప్రతిసారి అమ్మకు వేసిన ఒట్టు గుర్తొచ్చి కాస్త తగ్గి, జాగ్రత్తగా మాట్లాడేందుకు ప్రయత్నం మొదలుపెట్టాడు. కానీ, ఇది ఎక్కువ కాలం కొనసాగలేదు. ఒక 3 నెలల వ్యవధిలోనే మెల్లిగా ఆ మాటలు మళ్ళీ నోటి వెంట రావటం మొదలైంది. తల్లి విన్నప్పుడు చేసే మందలింపు ఆ క్షణానికి కాస్త పనిచేసినా, దీర్ఘకాలంలో ప్రభావం కోల్పోయేది. ఇది 'REGULATION'

తమతో పాటు ఉండేందుకు ఒచ్చిన నాయనమ్మ కు ఒకసారి వీడి బాష వినబడింది. వాడి తల్లిని అడగగా చాలా చెప్పి చూశామని, తండ్రి కొట్టిన సంగతి, తాను ఒట్టు వేయించుకున్న సంగతి చెప్పింది. నాయనమ్మ నవ్వి వాడిని పక్కకు పిలిచింది. భాష బాగోక పోవటం వలన బజారు పాలు అయిన తమ ఊరి జమీందారు కథ వివరంగా వాడికి చెప్పింది. అప్పుడు కుర్రవాడు దాన్ని విని మానటం చాలా కష్టంగా ఉందని అమ్మకు చెప్పిన సాకు మళ్ళీ చెప్పాడు. అలాంటి బాష వల్ల కలిగే నష్టాలు ఇంకా నిషితంగా వివరించటమే కాక, ఒక పద్దతిని ఇంట్లో ప్రవేశ పెట్టింది. కుర్రవాడు బూతు మాట్లాడినట్టు తెలిసిన ప్రతీ సారి, ఇల్లంతా అవే మాటలతో ఒక రెండురోజులు మాట్లాడుకుంటామని, ఒకరినొకరు అలానే పిలుచుకుంటామని తల్లి, తండ్రి ముందు తీర్మానం ఆమోదింపజేసింది. ఆమోదింపజేయడమే కాక, ఆచరణ కూడా చిత్తశుద్దిగా జరిగింది ఆ ఇంట్లో. తల్లి, తండ్రి, నాయనమ్మ, పని మనిషి, పాల వాడు, అందరు వాడి భాషలో వాడితో, ఇంటికొచ్చిన వారితో మాట్లాడేసారికి పిల్లవాడు దారిలో పడ్డాడు. అందరి ముందు అవమానం అవుతుందని అర్థమయి, పూర్తిగా నాలిక ను అదుపులోకి తెచ్చుకున్నాడు. ఐతే ఈ పద్ధతి విజయం సాధించేందుకు ఎక్కువ సమయం తీసుకుంది. దీన్నే 'ACTIVISM' అంటారు.

మన ప్రజాస్వామ్యం ఒక పదేళ్ల కుర్రాడిని నా భావన. ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలు. ఇక్కడ ప్రజలే ప్రభువులు,పాలకులు, సేవకులు. పార్లమెంటు బిల్లులైనా, ప్రభుత్వాల విధానాలైనా, కోర్టుల రూలింగులైనా సరే ప్రాజాభిప్రాయానికి విరుద్దంగా వెళ్లి ఏమి సాధించలేక ఉడికి ఉడకని కూరల్లాగా ఎందుకూ పనికిరాని చెత్తబుట్ట సామాను అయ్యే అవకాశం చాలా ఎక్కువ.

ప్రజాతంత్రం లో 'REGULATION' పని చేయొచ్చు, కొన్ని సార్లు చిత్త శుద్ధి లేని ఆచారణా విధానాల వల్ల చేయకపోవచ్చు., 'ACTIVISM' పని చేయొచ్చు, ప్రజలు మరీ మొండిఘటాలైతే ముందు వెనక్కి కదలవచ్చు, కానీ 'IMPOSITION' పని చేసినా చేయకపోయినా వర్తించదు. ఎందుకంటే 'IMPOSE' చేస్తే అది 'ప్రజాస్వామ్యం' అనిపించుకోదు. చైనా లాగా 'COMMUNISM' అవుతుంది.

మద్యాన్ని చిత్తశుద్దిగా 'REGULATE' చేయటం ద్వారా కల్తీలూ, బోగస్ లు తగ్గుతాయి. తాగి నడిపితే జైలు శిక్ష, లైసెన్స్ రద్దు లాంటివి చేయటం వల్ల ఆ సంస్కృతీ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

మద్యం తాగడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేస్తూ 'ACTIVISM' బాట పట్టొచ్చు. ప్రభుత్వ ప్రకటనలు, N.G.O ల సాయంతో ఊరూరా తిరిగి చైతన్యం రాగిలించే ప్రయత్నం చేయొచ్చు. అలా చేయటం వల్ల ఫలితాలు వెను వెంటనే కనబడకపోయినా, దీర్ఘ కాలంలో సరైన పద్ధతుల్లో ప్రచారం చేయటం ద్వారా ఆరోగ్యవంతమైన ఫలితాలు లభించే అవకాశాలు ఎక్కువ. అదే ప్రజలకు నచ్చకపోయినా సరే నిషేధాజ్ఞలు జారీ చేస్తే, ప్రజలు అడ్డదారులు వెతికే అవకాశం చాలా ఎక్కువ. నల్ల బజారు వ్యాపారం ఎక్కువైపోయి ఉన్న సమస్యలకు ఇంకొన్ని సమస్యలు తోడవుతాయి. ప్రభుత్వాలు కూలిపోవచ్చు. కల్తీ మద్యం వల్ల ఆరోగ్య సమస్యలు, నల్ల బజారు దొంగల వల్ల ప్రజాభద్రత సమస్యలు మచ్చుకు కొన్ని. 1950 లోనే మన దేశ రాజ్యాంగం అంతరానితనాన్ని (Untouchability) నేరంగా పరిగణించింది. కానీ నిన్న మొన్నటి వరకు దేశంలోనే చాలా ప్రాంతాల్లో ఇంకా దాని ఛాయలు కనబడుతూనే వచ్చింది. రూలింగులతో మార్పు రాదు, మార్పు ఆలోచన వల్ల కలుగుతుంది అనేందుకు ఇంతకన్నా గొప్ప ఉదాహరణ లేదు. తమిళనాడు లో నిన్న మొన్న జరిగిన జల్లి కట్టు ఉద్యమం ఇంకొక తాజా ఉదాహరణ. 'పెటా'(PeTA) సంస్థ వారి ఆలోచన ఎలాగ ఉన్నా, అందుకు ఆచరించిన పద్దతి సరిగ్గా లేదని నా అభిప్రాయం. మార్పు కోసం కోర్టు మెట్లెక్కటం సులభ పద్దతి అయినా, ప్రజల్లోకి వెళ్లి "వాళ్ళు(PeTA) కోరుకున్న చైతన్యం" రగిలించే దీర్ఘకాలిక వ్యవహారమే భారత దేశం లాంటి దేశంలో మెరుగ్గా పని చేసే పద్దతి.మార్పు ప్రజల నుండి రావాలి అన్నది అసంపూర్ణ వ్యాఖ్య. మార్పు ప్రజల నుండే రావాలి అన్నది సరైన వ్యాఖ్యానం.

'IMPOSITION' must be a rare emergency in democracy. Both REGULATION in short term and ACTIVISM in long term can take real stable change forward.

Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.