అవసరం వ్యాపార విలువలు: కార్తీక్, అనిల్ లిద్దరూ ఇక్కడే ఇంజినీరింగ్ పూర్తిచేసి అమెరికా వెళ్లారు. అక్కడ చదువు తర్వాత మంచి జాబ్ సాధించారు. ఎక్కడున్నా వారి ఆలోచనలన్నీ ఇండియాలోనే ఉన్నాయి, ఏదైనా స్టార్టప్ స్టార్ట్ చెయ్యాలని ఇండియాలో ఉంటున్న అవినాష్, గణేష్ లతో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు కొత్తరకమైన బిజినెస్, స్టార్టప్ ప్రారంభించాలంటే "జనాలకు అవసరం, వ్యాపారంలో విలువలు ఉండాలి". రకరకాల పరిశోధనలు, రకరకాల ఆలోచనలు, రకరకాల ప్రణాళికలు వెరసి చివరికి "డిటెక్టివ్ స్ట్రీట్" సృష్టించబడింది.
ఇప్పుడెందుకు అవసరం: మునుపటి కన్నా స్కూల్, కాలేజీలు పెరిగిపోయాయి ఎక్కువమంది చదుకుంటున్నారు అని అనుకుంటుంటే గ్రౌండ్ లేకుండా పోతుంది. శరీరాన్ని పరిగెత్తించడం తగ్గిపోయి, ఒక్కచోట కూర్చొని మొబైల్ లోని బొమ్మలను పరిగెత్తిస్తున్నారు. ఒంటరితనం పెరిగిపోతుంది, ఫోన్ ఉంటే చాలు అందులోనే ఫ్రెండ్షిప్, రిలేషన్ షిప్, నలుగురు కలిసి అక్కడే ఆటలాడుతున్నారు. అనుబంధం ఆటలోని అసలైన మజా కోల్పోతున్నారు. మనవాళ్లకు గేమ్స్ అంటే చాలా ఇష్టం సరైన గ్రౌండ్ ఇంకా రకరకాల కారణాల వల్ల మొబైల్ ముందు తల వంచాల్సి వస్తుంది. "డిటెక్టివ్ స్ట్రీట్ లోని ఆటలు మాత్రం మెదడుకు, శరీరానికి పని చెప్తాయి". రైస్ ఆఫ్ హనుమపుత్ర, ది జంగిల్, హోటల్ ప్యారడైజ్ మొదలైన గేమ్స్ ఒక ఇమేజనరీ ప్రపంచంలో కాకుండా రియాలిటిలో ఆడిస్తాయి.
ఇండియాలోనే మొదటిది: "నేను 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న డిటెక్టివ్ స్ట్రీట్ కు వెళ్లి ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత గేమ్ జరుగుతున్న ప్రదేశం ఫొటో కావాలంటే వాళ్ళు ఇవ్వడానికి అంగీకరించలేదు(రిసెప్షన్ లోని ఫొటోస్ మాత్రమే ఇచ్చారు). గేమింగ్ రూమ్ ఎలా ఉంటుందో చెబితే కొత్తగా వచ్చేవారికి థ్రిల్ మిస్ అవుతుంది, వచ్చే వాళ్ళు ముందుగానే గేమ్ స్ట్రాటజీ తెలుసుకునే అవకాశం ఉంటుందని కారణాలు. హైదరాబాద్ లోనే కాదు, ఇండియా లోనే ఇలాంటి గేమ్ మొదటిదని వీరి టీం చెబుతారు. 2018 జులై లో ప్రారంభించిన డిటెక్టివ్ స్ట్రీట్ చాలామంది గేమర్లను రీచ్ అవ్వడానికి ప్రధాన కారణం మౌత్ పబ్లిసిటీ వల్ల.
వాళ్ళ గేమ్ ని బట్టి క్లూస్: ఉదయం పది నుండి రాత్రి పదకొండు లోపు మనం రోజులో ఒక స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ప్రతి గేమ్ గంటపాటు ఉంటుంది. 12 సంవత్సరాల నుండి 60 దాటినా కూడా ఈ గేమ్ హాయిగా ఆడవచ్చు. ఒంటరిగా వచ్చి గేమ్ ఆడడం ఇక్కడ కుదరదు. టీం వర్క్ ఈ గేమ్ లో అవసరం. ఖచ్చితంగా ఇద్దరి నుండి ఎనిమిది మందితో కలిసి రావాలి. అలాగే ప్రతి రూమ్ లో ఒక కెమెరా ఉంటుంది. వచ్చినవారు గేమ్ ఎలా ఆడుతున్నారు, వాళ్ళ మెదడు ఎంత చురుగ్గా పనిచేస్తుందని డిటెక్టివ్ స్ట్రీట్ గమనిస్తూనే ఉంటుంది. ముందు ఒకదారి చూపించడానికి సులభమైన స్ట్రాటజీ ఇచ్చి గేమ్ పెరుగుతున్న కొద్దీ టఫ్ గా మారిపోతుంది, 50% నుండి 70% గేమ్ పూర్తిచేసిన వారికే మిగిలిన ఆట పూర్తిచేయ్యడానికి క్లూస్ ఇస్తుంటారు.
త్వరలోనే బెంగళూర్, వైజాగ్ లోనూ: ప్రారంభించిన 6 నెలల కాలంలో "మన లోకల్ సిటీజన్స్ తో పాటు 30 నుండి 40 శాతం వరకు ఇండియాలో ఇక్కడ హైదరాబాద్ లో ఉండి పనిచేస్తున్న విదేశీయులు వస్తున్నారని తెలిసింది". అలాగే పిల్లల కోసం కూడా మరో ప్రత్యేకమైన గేమ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం ఇందులో 50 మంది వరకు బర్త్ డే పార్టీ చేసుకునేందుకు వీలుంది. త్వరలోనే ఒక ఫుడ్ కోర్ట్ కూడా రాబోతుంది, బెంగళూరు, విశాఖపట్నంలోని ప్రజలు ఈ గేమ్ త్వరలోనే ఆడబోతున్నారు కూడా. ఒకేసారి పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టి ఇబ్బందులు ఎదుర్కోకుండా డిటెక్టివ్ స్ట్రీట్ పెరుగుతున్న కొద్దీ గేమర్స్ కు అవసరమయ్యే వాటిని పెంచుకుంటూ పోవడంతో స్టార్టప్ లోని తప్పులను అధిగమిస్తున్నారు.
Official Website : http://www.detectivestreet.com Phone : 98499 49007