ఒకసారి చిన్నతనంలో స్వామి వివేకనందా తన స్నేహితుల ఇంటికి నడుచుకుంటు వెళ్తుండగా.. ఒక చెట్టు పై నుండి "కోతుల గుంపు" స్వామి మీదకు దూకి దాడి చెయ్యడం ప్రారంభించాయి, తను భయపడి ఆ గుంపు నుండి తప్పించుకొనుటకు పరిగెత్తుతున్నా కూడ ఆ గుంపు కూడ స్వామిజీ ని వెంబడించాయి,
స్వామిని కొన్ని కోతులు కరుస్తున్నాయి ఇదంతా గమనించిన ఒక వ్యక్తి ఇలా అన్నాడు..
స్వామి భయపడకు వాటిని ఎదురించు అని స్పూర్తిని నింపాడు... వెంటనే స్వామి ఒక కర్ర తీసుకొని ఒక్క కోతిని కొట్టగానే మిగిలిన కోతులన్ని కూడ భయపడి పారిపోయాయి. అప్పటినుండి వివేకనందా ఏ సమస్యను చూసి భయపడి పారిపోవడం కన్నా ఆ సమస్యను సమస్యను చంపే పరిష్కారానికి జన్మనివ్వడం నేర్చుకున్నాడు.
తన సమస్యల వల్ల భాద తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందామని.. పట్టాల పక్కన ఒక చిన్న పుస్తకం చూశాడు.. చదివాడు..
వెంటనే వెనక్కి తిరిగి చూడకుండ ముందుకు వెళ్ళాడు.. సైనికునిగా దేశానికి రక్షణ ఇచ్చాడు. బ్రహ్మచారిగా ఉంటు తన సొంత ఊరు "రాలేగావ్ సిద్ధి" ని దేశంలోనే మద్యం, దొంగతనాలు, నిరాక్ష్యరాస్యత లేని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాడు.. 70 సంవత్సరాలలో కూడ నిరహార దీక్ష చేస్తు అవినీతి పై పోరాటం చేస్తున్నాడు.. ఆయన ఆత్మహత్యకు ముందు తాను చదివిన పుస్తకం "స్వామి వివేకనందుని స్పూర్తి వాక్యాలు". ఆత్మహత్య చేసుకుందామనుకున్న వ్యక్తి పేరు పద్మభూషన్ "అన్నా హజారే". పైనున్న కథను చదివిన అన్నా హజారే తన జీవితాన్ని మార్చుకున్నాడు.
"సమస్యలు కూడ కోతి లాంటిదె మనం పద్దతిగా చేసుకున్న ప్రణాళికలను కోతిలా చిందర వందర చేస్తుంది. వాటినుండి భయపడి పారిపోతుంటె మనకన్నా వేగంగా వచ్చి మనల్ని నాశనం చేస్తాయి... భయపడొద్దు... తల వంచద్దు.. ఎదురు తిరిగి పోరాడాలి.. నిజంగా మనం ధైర్యంగా ఉంటే ఒక కోతి(సమస్య) మనిషిని చంపలేదు.