పక్షి తన గూడుని నిర్మించడానికి ఒక్కో గడ్డి పోచను ఏరుకొస్తుంది.. ఏ అనుభవం లేకపోయినా తన బ్రతుకుకోసం మనోహరమైన కళకండాన్ని నిర్మిస్తుంది. నాకు ధనుంజయ్ గారి బొమ్మలు చూసినప్పుడు ఒక పక్షి గూడే కనిపిస్తుంది ఒక్కో గడ్డి పోచకు మల్లె ఒక్కో గీతతో ఆకారాలను తీసుకువస్తున్నారు. విశాఖపట్నానికి చెందిన ధనుంజయ్ గారు వేసిన ఈ రేఖాచిత్ర అద్భుతాలన్ని యాభై రూపాయల కేమిలిన్ పెన్సిల్స్ తో వేసినవే. ఒక కళాకారుడి గొప్పతనం వీక్షకులను ఎంత సేపు తన కళ దగ్గర కట్టిపడేస్తాడన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ధనుంజయ్ గారు జన్మనిచ్చిన ప్రతి చిత్రం మన ఆలోచనలను కొన్ని క్షణాలపాటు ఆపుచేస్తుంది. ఆయన గీసిన బొమ్మలన్ని సామాన్యులవే, సెలెబ్రెటీల బొమ్మలు గీస్తూ తద్వారా తన కళ గుర్తింపు పొందాలని ఆశించలేదు. రోడ్డు పక్కన పని కోసం ఎదురుచూసే రోజువారీ కార్మికులు, సైకిల్ టైర్ తో జ్ఞాపాకాలను నింపుకునే పిల్లలు, పచ్చని ప్రకృతి మధ్య నిర్మితమైన ఇల్లు, ఒకరిని మోసం చెయ్యకుండా న్యాయంగా డబ్బు సంపాదించుకునే మనుషులే ఆయన ప్రపంచంలోని హీరోలు, హీరోయిన్లు ..

బొమ్మలు గియ్యాలనే కోరిక పుట్టినప్పుడు, వాటితో సహజీవనం చేస్తున్నపుడు జైలు వార్డెన్ గా పనిచేసే నాన్న గారు ఏ మాత్రం ఒప్పుకోలేదు. బుద్దిగా చదువుకుంటే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది హాయిగా తన కొడుకు ఏ ఇబ్బందులు లేకుండా బ్రతుకుతాడనే ఆశతో కర్కశంగానే ఆంక్షలు పెట్టేవారు. తన కదలికలను నాన్న పసిగట్టకూడదని రహస్యంగా బొమ్మలు గీయడం నేర్చున్నాడు. ఆ తర్వాత తన ఇష్టప్రకారమే జే.ఎన్.టి.యూ నుండి ఫైన్ ఆర్ట్స్ లో డిగ్రీ తీసుకున్నాడు. ఈ కళను డబ్బు సంపాదించుకోవడం కోసం ఉపయోగించుకోవాలని ఏనాడు ఆతృత పడలేదు. అందుకనే ఆయన చిత్రాలలో నిజాయితీ స్పష్టంగా కనిపిస్తుంది. ధనుంజయ్ గారు జన్మనిచ్చిన బతుకు చిత్రాలు కొన్ని..
1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

10.

11.

12.

13.

14.

15.

16.

17.

18.

19.

20.

21.

22.

23.

24.

25.

26.

27.

28.

29.

30.

31.

32.

33.

34.

35.
